Chinese construction work: మరోసారి దుందుడుకు చర్యలకు పాల్పడుతోన్న చైనా.. అరుణాచల్‌ ప్రదేశ్‌లో నిర్మాణాలు?

అరుణాచల్‌ ప్రదేశ్‌లోని వాస్తవాధీన రేఖ వద్ద చైనా దుందుడుకు చర్యలను కొనసాగిస్తోంది. స్థానికులు చైనా చర్యలపై వీడియోలు తీయడంతో పలు విషయాలు వెల్లడయ్యాయి. చగ్లాగామ్‌లోని హడిగర డెల్టా-6 వద్ద నిర్మాణ యంత్రాలను చైనా భారీగా ఉంచింది. ఆ ప్రాంతం వద్దకు వెళ్ళాలంటే దాదాపు నాలుగు రోజులు పడుతుంది. అయినప్పటికీ స్థానికులు అక్కడకు వెళ్ళి వీడియోలు తీశారు.

Chinese construction work: అరుణాచల్‌ ప్రదేశ్‌లోని వాస్తవాధీన రేఖ వద్ద చైనా దుందుడుకు చర్యలను కొనసాగిస్తోంది. స్థానికులు చైనా చర్యలపై వీడియోలు తీయడంతో పలు విషయాలు వెల్లడయ్యాయి. చగ్లాగామ్‌లోని హడిగర డెల్టా-6 వద్ద నిర్మాణ యంత్రాలను చైనా భారీగా ఉంచింది. ఆ ప్రాంతం వద్దకు వెళ్ళాలంటే దాదాపు నాలుగు రోజులు పడుతుంది. అయినప్పటికీ స్థానికులు అక్కడకు వెళ్ళి వీడియోలు తీశారు. ఈ వీడియో ఆగస్టు 11న తీసినట్లు సమాచారం. అక్కడ చైనా హెలీప్యాడ్‌ను కూడా నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది.

ఇందుకు సంబంధిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో కనపడుతున్నాయి. దీనిపై భారత రక్షణ వర్గాలు మాత్రం అధికారికంగా ప్రకటన చేయలేదు. అంతేగాక, చైనా నిర్మాణాలు చేపడుతోందన్న ప్రచారాన్ని అధికారులు కొట్టిపారేస్తున్నారు. చైనా భూభాగంలో ఆ నిర్మాణాలు జరుగుతున్నాయని అన్నారు.

ఆ నిర్మాణాలు అరుణాచల్‌ ప్రదేశ్‌లో జరగడం లేదని అంటున్నారు. అరుణాచల్‌ ప్రదేశ్‌లో చైనా చర్యలపై మరోసారి ఆందోళన వ్యక్తమవుతోంది. చైనా దురాక్రమణకు పాల్పడితే భారత్ వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని పలువురు నేతలు డిమాండ్ చేస్తున్నారు.

‘Spy ship’ issue: ‘శ్రీలంకకు మద్దతు కావాలి.. అనవసర ఒత్తిడి కాదు’ అంటూ చైనాకు కౌంటర్ ఇచ్చిన భారత్

ట్రెండింగ్ వార్తలు