‘Spy ship’ issue: ‘శ్రీలంకకు మద్దతు కావాలి.. అనవసర ఒత్తిడి కాదు’ అంటూ చైనాకు కౌంటర్ ఇచ్చిన భారత్

 ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన శ్రీలంకకు ఇప్పుడు కావాల్సింది మద్దతు అని, అంతేగానీ, అనవసర ఒత్తిడి, వివాదాలు కాదంటూ చైనాకు భారత్ కౌంటర్ ఇచ్చింది. చైనా నిఘా నౌక ‘యువాన్‌ వాంగ్‌ 5’కు ఇటీవల శ్రీలంక ప్రభుత్వం అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. భారత్ వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నప్పటికీ చైనా నౌకను హంబన్‌టొటా పోర్టులో నిలిపేందుకు శ్రీలంక అనుమతించింది.

‘Spy ship’ issue: ‘శ్రీలంకకు మద్దతు కావాలి.. అనవసర ఒత్తిడి కాదు’ అంటూ చైనాకు కౌంటర్ ఇచ్చిన భారత్

'spy ship' issue

‘Spy ship’ issue: ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన శ్రీలంకకు ఇప్పుడు కావాల్సింది మద్దతు అని, అంతేగానీ, అనవసర ఒత్తిడి, వివాదాలు కాదంటూ చైనాకు భారత్ కౌంటర్ ఇచ్చింది. చైనా నిఘా నౌక ‘యువాన్‌ వాంగ్‌ 5’కు ఇటీవల శ్రీలంక ప్రభుత్వం అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. భారత్ వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నప్పటికీ చైనా నౌకను హంబన్‌టొటా పోర్టులో నిలిపేందుకు శ్రీలంక అనుమతించింది. ఈ నౌక ద్వారా చైనా… భారత సైనిక వ్యవస్థతో పాటు పలు కార్యకలాపాలపై గూఢచర్యం చేసే అవకాశాలున్నాయని భారత్ కొన్ని రోజుల క్రితం చెప్పింది.

అయితే, దీనిపై శ్రీలంకలోని చైనా రాయబారి క్వి ఝెన్హొన్గొన్ తాజాగా స్పందిస్తూ… శ్రీలంక అంతర్గత విషయాల్లో భారత్ జోక్యం చేసుకుంటోందని చెప్పుకొచ్చారు. భద్రతాపర ఆందోళన అంటూ భారత్ అనవసరంగా ఎటువంటి ఆధారాలు లేకుండా మాట్లాడుతోందని అన్నారు. దీనిపై భారత్ స్పందించింది. చైనా రాయబారి చేసిన వ్యాఖ్యలు సరికాదని శ్రీలంకలోని భారత హై కమిషన్ చెప్పింది.

చైనా రాయబారి చేసిన వ్యాఖ్యలు ఆ దేశ తీరుకు నిదర్శనంగా నిలుస్తున్నాయని కౌంటర్ ఇచ్చింది. పారదర్శకత లేని విధానాలు, దేశాలు అప్పుల్లో కూరుకుపోయేలా చేసే అజెండాలే ప్రధాన సవాళ్ళని చైనాను ఉద్దేశించి విమర్శించింది. ముఖ్యంగా చిన్న దేశాలకు ఈ తీరు మరింత ప్రమాదకరమని చెప్పింది. ఇటీవల చోటుచేసుకుంటోన్న పరిణామాలు ఆందోళనకరమని పేర్కొంది.

Love Breakup : మీరు లవ్‌లో ఫెయిల్ అయ్యారా.. బ్రేకప్ బాధ నుంచి ఎలా బయటపడాలో తెలుసుకోండీ..