Taliban Gun Fire
Taliban Gunfire: తాలిబాన్లు శిక్షించినా.. సంబరాలు జరుపుకున్నా మారణకాండ తప్పదనడానికి ఇదే సాక్ష్యం. అఫ్ఘాన్ స్థానిక మీడియా కథనం ప్రకారం.. శుక్రవారం రాత్రి పంజ్‌షీర్ ప్రాంతంపై అధికారం చేజిక్కాక పూర్తి అఫ్ఘానిస్తాన్ తమ చేతుల్లో ఉందనే గర్వంతో విర్రవీగారు తాలిబాన్లు. తుపాకీలతో గన్ ఫైర్ చేస్తూ.. ఆనందాన్ని వ్యక్తి పరిచారు. సోషల్ మీడియాలో ఈ ఫొటోలు, వీడియోలు వైరల్ అయ్యాయి.
హద్దులు మీరి చెలరేగిపోవడంతో అమాయకులైన 17మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోగా దాదాపు 41మంది వరకూ గాయాలపాలైయ్యారు. కాబూల్ లోని ఎమర్జెన్సీ హాస్పిటల్ లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. ననగర్హార్ ప్రాంతం నుంచి క్షతగాత్రులను తరలించినట్లు అధికారులు వెల్లడించారు.
పంజ్‌షీర్ బలగాల నాయకుడైన అహ్మద్ మసూద్.. అధికారం చేజిక్కించుకోవడం అనేది నిజం కాదు. నా ప్రాణమున్నంత వరకూ అది జరగని పని’ అని ట్వీట్ ద్వారా వెల్లడించారు.
పంజ్‌షీర్ ప్రాంతానికి చెందిన మరో నాయకుడు అమృల్లా సాలెహ్ కూడా ఈ విషయాన్ని తోసి పుచ్చుతూ అబద్ధమని కొట్టిపారేశారు. మా కమాండర్లతో పాటు, పొలిటికల్ లీడర్లకు సహకరిస్తూ పరిస్థితిని మేనేజ్ చేస్తున్నాం. ఇది క్లిష్టమైన పరిస్థితి అని తెలుసు’ అని అమృల్లా సాలెహ్ తెలిపారు.