చిల్, డొనాల్డ్, చిల్ : ట్రంప్ కు ఆయన భాషలోనే ‘గ్రేటా’ కౌంటర్

  • Published By: venkaiahnaidu ,Published On : November 6, 2020 / 11:24 AM IST
చిల్, డొనాల్డ్, చిల్ : ట్రంప్ కు ఆయన భాషలోనే ‘గ్రేటా’ కౌంటర్

Updated On : November 6, 2020 / 11:43 AM IST

Greta Thunberg Trolls Trump With His Own Words అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై ప్రతీకారం తీర్చుకుంది ప్రముఖ పర్యావరణ పరిరక్షణ కార్యకర్త గ్రేటా థ‌న్‌బ‌ర్గ్(17). 11నెలల క్రితం తనపై ట్రంప్ ప్రయోగించిన పదాలనే ఇప్పుడు ఆయనపై గ్రేటా ప్రయోగించి తన ప్రతీకారం తీర్చుకుంది.



వాతావరణం, పర్యావరణ పరిరక్షణకై ఉద్యమిస్తూ…సెప్టెంబర్-23,2019న తన ఐక్యరాజ్యసమితి ప్రసంగం ద్వారాస్వీడన్‌ బాలిక గ్రేటా థన్ బర్గ్ ప్రపంచం దృష్టిని ఆకర్షించిన విషయం తెలిసిందే. వాతావరణ మార్పులకు ప్రప్రంచ దేశాలను పరిపాలిస్తున్న నాయకులే కారణమంటూ ప్రశ్నించి ప్రపంచం మన్ననలు పొందింది గ్రేటా.



https://10tv.in/donald-trump-on-usa-election-counting/
గతేడాది డిసెంబర్ లో ప్రముఖ టైమ్స్ మ్యాగజైన్ 2019 పర్శన్ ఆఫ్ ది ఇయర్ గా గ్రేటా థన్ బర్గ్ ని ప్రకటించింది. టైమ్స్ మ్యాగజైన్ ప్రతి ఏటా ఈ విధంగా పర్శన్ ఆప్ ది ఇయర్ ని ప్రకటించే సంప్రదాయం మొదలుపెట్టిన 1927నుంచి ఇప్పటివరకు ఈ చిన్నారే అత్యంత చిన్న వయస్సు ఉన్న వ్యక్తి.

కాగా, గ్రేటా థన్ బర్గ్ ని ఖ టైమ్స్ మ్యాగజైన్ 2019 పర్శన్ ఆఫ్ ది ఇయర్ గా ప్రకటించడంపై అప్పట్లో ట్రంప్ స్పందిస్తూ…చాలా హాస్యాస్పదం. గ్రెటా తన యాంగర్ మేనేజ్‌మెంట్ సమస్యపై తప్పక పనిచేయాలి. ఆపై ఫ్రెండ్ తో కలిసి పాత ఫ్యాషనైడ్ మూవీకి వెళ్ళండి! చిల్ గ్రెటా, చిల్ అంటూ ట్రంప్ ట్వీట్ చేశారు.



అయితే,ఇప్పుడు అమెరికా ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న క్రమంలో గ్రేటా థన్ ఓ చిన్న ట్వీట్ తో ట్రంప్ పై రివేంజ్ తీర్చుకుంది. అప్పట్లో ట్రంప్ ఏ విధంగా అయితే తనపై సెటైర్ వేశాడో. ఇప్పుడు అదే పదజాలంతో ట్రంప్ పై సెటైర్ వేసింది గ్రేటా.



అమెరికా అధ్యక్ష పీఠం దక్కే అవకాశాలు ప్రస్తుతానికి జో బైడెన్ కే ఉన్నట్లు ఇప్పటివరకు విడుదలైన ఎన్నికల ఫలితాలను బట్టి సృష్టంగా అర్థమవుతోంది. అయితే,ఓటమిని జీర్ణించుకోలేకపోతున్న ట్రంప్..పలు రాష్ట్రాల్లోని ఎన్నికల ఫలితాలపై తన క్యాంపెయిన్ టీమ్ తో పిటిషన్లు వేయించాడు. అయితే,కోర్టులు కూడా ట్రంప్ పిటిషన్లు కొట్టేస్తున్నాయి.

ఈ నేపథ్యంలో గ్రేటా థన్ బర్గ్ ఓ ట్వీట్ చేసింది. చాలా హాస్యాస్పదం. ట్రంప్ తన యాంగర్ మేనేజ్‌మెంట్ సమస్యపై తప్పక పనిచేయాలి. ఆపై ఫ్రెండ్ తో కలిసి పాత ఫ్యాషనైడ్ మూవీకి వెళ్ళండి! చిల్ డొనాల్డ్, చిల్ అంటూ ట్రంప్ బాషను ఆయనపైనే ప్రయోగించి గ్రేటా థన్ బర్గ్ చేసిన ట్వీట్ కు ఇప్పుడు సోషల్ మీడియాలో నెటిజన్ల నుంచి పెద్ద రెస్ఫాన్స్ వస్తోంది. ట్రంప్ కి సూపర్ కౌంటర్ ఇచ్చావ్ అంటూ,ఇది నిజంగా మిసైల్ దాడి అంటూ పలువురు గ్రేటాపై ప్రశంసలు కురిపిస్తున్నారు.