ఇల్లా లేక జూనా : 1300 కుక్కలు, పిల్లులు, గుర్రాల్ని పెంచుతున్న బామ్మ

  • Published By: nagamani ,Published On : December 11, 2020 / 12:49 PM IST
ఇల్లా లేక జూనా : 1300 కుక్కలు, పిల్లులు, గుర్రాల్ని పెంచుతున్న బామ్మ

Updated On : December 11, 2020 / 12:56 PM IST

china 68 years women animal home with 1300 dogs, cats and hourses : కుకలు,పిల్లులు, కుందేళ్లు ఇలా జంతువులను పెంచుకోవడం చాలా సరదా. అలా ఒకటీ రెండు జంతువుల్ని పెంచుకుంటాం. లేదంటే ఐదు,పది జంతువుల్ని పెంచుకుంటాం. కానీ ఓ బామ్మ ఏకంగా 1300ల కుక్కలు, వందకు పైగా పిల్లులు, నాలుగైదు గుర్రాలతో పాటు ఇంకా ఇతర జంతువుల్ని పెంచుకుంటోంది. అలా ఆమె ఇల్లంతా జంతువుల మయంగా మారిపోయింది. ఆ బామ్మగారి ఇల్లు చూస్తే..అది ఇల్లా? లేకా జూనా అనిపిస్తుంది.



చైనాలోని చాంగ్‌కింగ్ నగరానికి చెందిన వెన్ జున్హోంగ్ అనే బామ్మ వందలకొద్దీ జంతువుల్ని పెంచుకుంటోంది. ఆమె వయస్సు 68 సంవత్సరాలు. ఆ వయస్సులో కూడా ప్రతీ క్షణం అన్ని జంతువుల బాగోగుల్ని దగ్గరుండి చూసుకోవటం అంటే ఆమెకు చాలా చాలా ఇష్టం. ఎందుకంటే జంతువులంటే పిచ్చి ప్రేమ ఆమెకు.




68 ఏళ్ల వెన్‌కు జంతువులంటే పిచ్చి ప్రేమ. ఎంత ప్రేమంటే ఆ జంతువులకు సంబంధించిన పనుల్నీ ఆమే చూసుకునేంత. వాటికి పెట్టే ఆహారాన్ని ఆమే స్వయంగా తన చేతులతో వండేంత. వాటి మలమూత్రాలను స్వయంగా ఆమే చేతులతో ఎత్తేంత. మరి దీన్ని ప్రేమ అని అని సరిపెట్టుకోలేం. పిచ్చి ప్రేమ అనాల్సిందే.



వెన్ 20 ఏళ్ల కిందట ఆమె గాయాలతో బాధపడే ఓ వీధికుక్కను కాపాడింది. అప్పట్నుంచి ఎక్కడ కుక్కలు బాధతో ఉన్నా సరే వాటిని ఇంటికి తెచ్చేసుకుంటుంది. వాటికి సపర్యలు చేస్తుంది. అలా ఆమెకు కుక్కలపై ప్రేమ తెగ పెరిగిపోయి ఇల్లంతా కుక్కల కొంపగా మారిపోయింది.



అన్ని జంతువులను దగ్గరుండి సాకడం మామూలు విషయం కాదు. ఆ జంతువుల తోటే ఆమె లోకం.వాటితోనే మాట్లాడుతుంది. వాటిని ముద్దు ముద్దుగా విసుక్కుంటుంది. అన్ని వందల జంతువుల కోసం వెన్ ప్రతీరోజూ ఉదయం 4 గంటలే నిద్ర లేస్తుంది. కుక్కల మలమూత్రాలను డబ్బాల్లో ఎత్తి పారేస్తుంది.



తర్వాత 500 కిలోల ఆహారం వండుతుంది. తన చేతులతో స్వయంగా వండిపెడుతుంది. ఆహారంలో వెరైటీ వెరైటీ కూరలు వండుతుంది. రొట్టెలు, కూరలు, మాంసం, బిస్కెట్లు ఇలా అన్ని రకాలు ఆహారం కుక్కలకు వండిపెడుతుంది. కుక్కలకు, పిల్లులకు ప్రేమగా పెట్టటమంటే ఆమెకు చాలా చాలా ఇష్టం.



ఆ ఇష్టం వల్ల అలసట అని కూడా అనిపించదట వెన్ కు. అలాగే గుర్రాలకు గడ్డిపెడుతుంది. చుట్టుపక్కల వాళ్లు వెన్ జంతుప్రేమను చూసి నవ్వుకుంటారు. అది వాటిపై ప్రేమ కాదు పిచ్చి అని ఆటపట్టిస్తారట.అయినా అవేమీ ఆమె పట్టించుకోదు. ఇవే నా లోకం..వీటితోనే నా జీవితం అంటుంది.



చుట్టుపక్కలవారు వెక్కిరింపులపై వెన్ మాట్లాడుతూ..‘‘ఈ జంతువుల గురించి నన్ను ఎవరేమన్నా పట్టించుకోను..ఈ భూమి కేవలం మనుషులదే కాదు..కుక్కులదీ, పిల్లులు, ఇంకా ఎన్నో జంతువులు, ప్రాణులది. భూమిపై హక్కు ఒక్క మనిషికే కాదు.



అన్ని ప్రాణులకు ఆ హక్కు ఉంది. ఇది మనిషి మరచిపోవటం చాలా విచారకరమని ఆవేదన వ్యక్తం చేస్తుంది వెన్. మన కష్టాల్ని మనం మాటల ద్వారా చెప్పుకుంటాం. కానీ మాటలు రాని మూగజీవులకు అది చేతకాదు. కాబట్టి కష్టాల్లో ఉన్న ప్రాణులు కాపాడడం మనిషి ధర్మం…’ అని అంటుంది 68 ఏళ్ల వెన్. నిజమే మరి..ఈ భూమిమీద సకల ప్రాణులకు జీవించే హక్కు ఉంది.



వెన్ పెంచుకుంటున్న కుక్కల్లో కొన్ని కుంటివి, గుడ్డివి కూడా ఉన్నాయి. వందల జంతువులను సాకడానికి చాలా డబ్బులు కావాలి కదా. అంతే వెన్ తనకున్న ఓ ఇంటిని అమ్మేసింది. మరో ఇంటిని బ్యాంకులో కుదువ పెట్టి అప్పు చేసింది. తన జీవితాన్ని ఈ జంతువులకే అంకితం అంటోంది 68 ఏళ్ల వెన్ జున్హోంగ్.

 

https://youtu.be/NOKeC7GoMHs

https://youtu.be/iJBvhXsI5Os