కరోనా మందు: రెండు వ్యాక్సిన్లు రెడీ చేసిన చైనా

ప్రపంచవ్యాప్తంగా లక్ష మందికి పైగా సోకిన కరోనాకు ప్రయోగాత్మకంగా ఎటువంటి మందులు తయారుచేయలేకపోయారు. ఇటీలవ చైనాలోని గ్సిన్వా మీడియా తెలిపిన కథనం ప్రకారం.. రెండు టెస్టుల్లో తయారైన మందులను అప్రూవ్ చేసింది చైనా ప్రభుత్వం. 

బీజింగ్ కు చెందిన నస్‌దఖ్ లిస్టెడ్ సినోవాక్ బయోటెక్ కంపెనీ, వూహాన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ బయోలాజికల్ ప్రొడక్ట్స్ కంపెనీ వారు వీటిని తయారుచేశారు. దేశానికి చెందిన చైనా నేషనల్ ఫార్మాస్యూటికల్ గ్రూప్ వారే వీటిని ఉత్పత్తి చేశారు. 

మార్చి నెలలో చైనా మరో కరోనా వ్యాక్సిన్ ప్రయోగానికి పచ్చ జెండా ఊపింది. దీనిని చైనా మిలటరీ అకాడమీ ఆఫ్ మెడికల్ సైన్సెస్, హెచ్కే లిస్టెడ్ బయోటెక్ ఫార్మ్ క్యాన్‌సినో బయో కంపెనీలకు చెందినవి. మందు తయారు చేసే పనిలో భాగంగా యూఎస్ డ్రగ్ డెవలపర్ మోడర్నా కూడా సిద్ధమైంది. మనుషులపై ప్రయోగించి పనితీరును పరీక్షించనున్నట్లు యూఎస్ నేషనల్ ఇనిస్టిట్యూట్స్ ఆఫ్ హెల్త్ తెలిపింది. 

Also Read | ‘పాకిస్తాన్ వాడినని ఐసీసీ బౌలింగ్ నుంచి నిషేదించింది’