China defence budget : ప‌క్కా వ్యూహాంతో చైనా.. డిఫెన్స్ బ‌డ్జెట్ 7.2 శాతం పెంపు.. భార‌త బ‌డ్జెట్ ఎంతంటే?

డ్రాగన్ కంట్రీ భారత్‌కు పక్కలో బల్లెంల తయారైంది.

China boosts defence spending by 7.2 per cent

డ్రాగన్ కంట్రీ భారత్‌కు పక్కలో బల్లెంల తయారైంది. ఆర్మీ పటిష్టతే లక్ష్యంగా డిఫెన్స్ బడ్జెట్ పెంచుకుంటూ పోతుంది. ఏడేళ్లుగా రక్షణశాఖకు ఎక్కువమొత్తంలో బడ్జెట్ కేటాయిస్తూ వస్తోంది. ఈ ఏడాది తమ రక్షణ రంగ బడ్జెట్‌ను ఏకంగా 7.2 శాతం పెంచింది చైనా. పక్కావ్యూహంతోనే తన డిఫెన్స్ పై పెట్టుబడులు పెంచుతుంది. అమెరికాతో పోటీ పడుతూ.. భారత్ కంటే మూడురెట్లు ఎక్కువ బడ్జెట్ కేటాయింపులు చేసింది డ్రాగన్ కంట్రీ. ఎప్పటినుంచో భారత్ ను టార్గెట్ చేసిన చైనా.. తన పిపుల్ లిబరేషన్ ఆర్మీని ఎదురులేని శక్తిగా తయారు చేసేందుకు వ్యూహాత్మక అడుగులు వేస్తోంది.

చైనా రక్షణ బడ్జెట్ ఎంతలా పెరిగిందంటే.. భారత రక్షణ బడ్జెట్ కంటే మూడు రెట్లు ఎక్కువ. 2024 ఏడాదికి భారతదేశ రక్షణ బడ్జెట్ 6 లక్షలా 21వేల కోట్లు కాగా.. చైనా తన డిఫెన్స్‌ బడ్జెట్ ను దాదాపు 18లక్షలా 66వేల కోట్లుగా ప్రకటించింది. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ తన ఆర్మీని అప్ గ్రేడ్ చేసేందుకు అమెరికాతో ధీటుగా పటిష్టం చేసేందుకు పక్కా ప్రణాళికతో ముందుకెళ్తున్నారు. 2027నాటికి తన పిపుల్ లిబరేషన్ ఆర్మీని వరల్డ్ లోనే టాప్ మిలిటరీగా నిలపెట్టాలని భావిస్తున్నారు. దాంతో ప్రపంచ దేశాలను భయపెట్టి తన గుప్పిట్లో పెట్టుకోవాలనేది చైనా దురాశ.

ఒక్క పాకిస్థాన్‌తో త‌ప్ప‌..

ఈ దేశం..ఆ దేశమని కాదు. ఒక్క పాకిస్థాన్ తో తప్ప చాలా దేశాలతో గిల్లి కయ్యం పెట్టుకుంటోంది చైనా. ఎదురుతిరిగిన దేశాల అంతుచూసేందుకు అంతర్జాతీయ ఒప్పందాలను కూడా లెక్క చేయడం లేదు. భారత్ టార్గెట్ గా చైనా ఎప్పుడూ ఏదో ఒక కవ్వింపు చర్య చేస్తూనే ఉంటుంది. సరిహద్దుల్లో అయినా.. అంతర్జాతీయంగానైనా డ్రాగన్ కంట్రీ కంత్రీ పనులు కొనసాగిస్తూనే ఉంది.

కొన్నాళ్లుగా.. భారత్, చైనా సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు కంటిన్యూ అవుతున్నాయి. రెండు దేశాల సైనికుల మధ్య మాటల యుద్ధం కూడా జరిగింది. ఈ నేపథ్యంలో చైనా తన సైన్యాన్ని అప్ గ్రేడ్ చేసేందుకు భారత్ కంటే మరో ముందడుగు వేసింది. ఈసారి తన డిఫెన్స్ బడ్జెట్ ను భారీగా పెంచేసింది డ్రాగన్ కంట్రీ.

France : పార్ల‌మెంట్‌లో అబార్షన్ బిల్లు ఆమోదం.. ప్రపంచంలోనే తొలి దేశం ఫ్రాన్స్

చైనా తన సరిహద్దులో ఉన్న నాలుగైదు దేశాలతో ఎప్పుడూ ఏదో ఒక గొడవ పెట్టుకుంటూనే ఉంది. దక్షిణ చైనా సముద్రంలో ఫిలిప్పీన్స్, జపాన్ సహా పలు దేశాలతో వివాదాలను కొనసాగిస్తోంది డ్రాగన్ కంట్రీ. దక్షిణ చైనా సముద్ర జలాల్లో మెజారిటీ వాటా తమదేనని వాదిస్తోంది. దక్షిణ చైనా సముద్రంలో ప్రతికూల పరిస్థితుల నేపథ్యంలో చైనా తన రక్షణశాఖకు కేటాయింపులు పెంచడం హాట్ టాపిక్ అవుతోంది. భౌగోళిక విస్తరణ కాంక్షతో దురాక్రమణలకు పాల్పడుతున్న చైనా పలుపొరుగు దేశాలతో సరిహద్దు వివాదాలను ఎదుర్కొంటోంది.

తైవాన్‌ను త‌మ భూభాగంలో క‌లిపేసుకోవాల‌ని..

మరోవైపు ప్రస్తుతం స్వతంత్రంగా ఉన్న తైవాన్‌ను తమ భూభాగంలో కలిపేసుకోవాలని కుట్రలు చేస్తోంది. అందుకోసం సైనిక చర్యకైనా సిద్ధమంటూ పలుసార్లు స్పష్టమైన సంకేతాలిచ్చింది. ఫిలిప్పీన్స్‌, వియత్నాం, మలేషియా, బ్రూనై, తైవాన్‌ చైనా కుట్రలను తిప్పికొట్టే ప్రయత్నం చేస్తున్నాయి.

హిందూ మహాసముద్రంలోని అనేక దేశాలలో చైనా స్థావరాలను ఏర్పాటు చేసింది. సైనికుల సంఖ్యను కూడా పెంచడంతో.. సైనికుల పరంగా చైనా సైన్యం అతి పెద్దదిగా మారింది. చైనా తన రాకెట్ బలగాన్ని సైలెంట్ గా విస్తరిస్తోందన్న ఆరోపణలున్నాయి. ఎందుకంటే చైనా తన సైనిక పరిశోధన, అభివృద్ధి బడ్జెట్‌ను రక్షణ బడ్జెట్‌లో చేర్చలేదు.

చైనా ప్రాబ‌ల్యంపై అమెరికా ఆందోళ‌న‌..

ఇక చైనా ప్రాబల్యం పెరగడంపై అమెరికా కూడా ఆందోళన చెందుతోంది. రక్షణ బడ్జెట్‌లో అమెరికా ఇప్పటికీ చైనా కంటే చాలా ముందుంది. గతేడాది అమెరికా రక్షణ బడ్జెట్ 886 బిలియన్ డాలర్లు. చైనా నుంచి పెరుగుతున్న సవాలును దృష్టిలో పెట్టుకుని ఆస్ట్రేలియా, బ్రిటన్ సైన్యాన్ని బలోపేతం చేయడంలో అమెరికా బిజీగా ఉంది. అదే సమయంలో అమెరికా కూడా భారత్‌తో వ్యూహాత్మక సహకారాన్ని పెంచుకుంటోంది.

Lottery Prize : అదృష్టమంటే ఇతడిదే.. 6 నెలల్లో రెండోసారి రూ.90 లక్షల జాక్‌పాట్ కొట్టేశాడు!

ఆర్మీనే కాదు.. తన నేవీని కూడా స్ట్రాంగ్ గా తయారు చేస్తోంది చైనా. నౌకాదళంలో పెద్దఎత్తున పెట్టుబడులు పెడుతుండటం కూడా చైనా రక్షణ బడ్జెట్‌ పెంచడానికి కారణం. సైనికుల సంఖ్య పరంగా కూడా చైనా భద్రతావ్యవస్థ అతిపెద్దది. డ్రాగన్ సైన్యంలో రెండు రాకెట్ దళాలు ఉన్నాయి. ఈ రాకెట్ ఫోర్స్ అణ్వాయుధాల ఆపరేన్ను నిర్వహిస్తుంది. చైనా తన రాకెట్ బలగాన్ని రహస్యంగా విస్తరిస్తుందన్న ఆరోపణలూ ఉన్నాయి.

ట్రెండింగ్ వార్తలు