France : పార్ల‌మెంట్‌లో అబార్షన్ బిల్లు ఆమోదం.. ప్రపంచంలోనే తొలి దేశం ఫ్రాన్స్

ఫ్రెంచ్ ప్రధాని గాబ్రియెల్ అటల్ మాట్లాడుతూ.. మహిళలు ఇకపై అబార్షన్ విషయంలో సొంత నిర్ణయాలు తీసుకోవచ్చని అన్నారు.

France : పార్ల‌మెంట్‌లో అబార్షన్ బిల్లు ఆమోదం.. ప్రపంచంలోనే తొలి దేశం ఫ్రాన్స్

France

Abortion Bill : ఫ్రాన్స్ పార్లమెంట్ చారిత్రక బిల్లును ఆమోదించింది. అబార్షన్ హక్కును రాజ్యాంగంలో చేర్చింది. దీంతో ప్రపంచంలో అబార్షన్ హక్కును రాజ్యాంగంలో పొందుపర్చిన తొలి దేశంగా ఫ్రాన్స్ సోమవారం చరిత్ర సృష్టించింది. సోమవారం జరిగిన ఉభయ సభల సమావేశంలో బిల్లు ఆమోదంపై ఓటింగ్ జరిగింది. 780 ఓట్లతో బిల్లకు ఆమోదం లభించింది. 72 మంది సభ్యులు ఈ బిల్లును వ్యతిరేకించారు. అత్యధిక ఓట్లతో బిల్లు ఆమోదం పొందిన నేపథ్యంలో ఉమ్మడి సెషన్ లోని సభ్యులు చప్పట్లతో తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. మహిళా హక్కుల కార్యకర్తలు దేశవ్యాప్తంగా సంబరాలు చేసుకున్నారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ నిర్ణయాన్ని ప్రశంసించారు.

Also Read : WPL 2024 : భారీ సిక్సర్ కొట్టిన ఆర్సీబీ బ్యాటర్.. ఆ బాల్ వెళ్లి ఎక్కడ తగిలిందో తెలుసా?.. వీడియో వైరల్

పార్లమెంట్ లో ఓటింగ్ ఫలితాన్ని భారీ స్క్రీన్ పై ప్రదర్శించారు. అనంతరం నా శరీరం నా హక్కు అనే సందేశాన్ని కూడా స్క్రీన్ పై ప్రదర్శించారు. బిల్లు ఆమోదానికి ముందు ఫ్రెంచ్ ప్రధాని గాబ్రియెల్ అటల్ మాట్లాడుతూ.. మహిళలు ఇకపై అబార్షన్ విషయంలో సొంత నిర్ణయాలు తీసుకోవచ్చని అన్నారు. మరోవైపు అబార్షన్ వ్యతిరేక సంఘాలు ఈ చట్టంపై తీవ్రంగా విమర్శలు చేస్తున్నాయి.