Lottery Prize : అదృష్టమంటే ఇతడిదే.. 6 నెలల్లో రెండోసారి రూ.90 లక్షల జాక్‌పాట్ కొట్టేశాడు!

Lottery Prize : అదృష్టానికి ఇతడు బ్రాండ్ అంబాసిడర్‌లా ఉన్నాడు.. కేవలం 6 నెలల్లోనే రెండుసార్లు లాటరీ గెలిచి రూ. 90 లక్షల రూపాయల జాక్‌పాట్ కొట్టేశాడు.

Lottery Prize : అదృష్టమంటే ఇతడిదే.. 6 నెలల్లో రెండోసారి రూ.90 లక్షల జాక్‌పాట్ కొట్టేశాడు!

US Man Wins Rs. 90 Lakh Lottery Prize For The Second Time In 6 Months

Lottery Prize : జీవితంలో అదృష్టమనేది ఎవరినైనా ఎప్పుడో ఒకసారి పలకరిస్తుంది. కానీ, అమెరికాకు చెందిన ఒక వ్యక్తిని మాత్రం అదృష్టం ఎప్పుడూ అంటిపెట్టుకునే ఉంటోంది. అతడు ఏది చేసినా ఇట్టే కలిసివస్తోంది. మిచిగాన్‌లోని వేన్ కౌంటీకి చెందిన ఈ అదృష్టవంతుడు కేవలం 6 నెలల వ్యవధిలో రెండోసారి 110,000 డాలర్లు (రూ. 91,13098) లక్షల జాక్‌పాట్ కొట్టేశాడు. ఫాంటసీ 5 డబుల్ ప్లే లాటరీ జాక్‌పాట్‌ను గెలుచుకున్న అనంతరం 59 ఏళ్ల విజేత సంబరాలు చేసుకున్నాడు.

Read Also : Varalaxmi Sarathkumar : పెళ్లిపీటలు ఎక్కబోతున్న లేడీ విలన్.. నిశ్చితార్థం చేసుకున్న వరలక్ష్మి శరత్ కుమార్..

సౌత్‌ఫీల్డ్‌లోని వెస్ట్ 9 మైల్ రోడ్‌లోని బీపీ గ్యాస్ స్టేషన్‌లో ఫిబ్రవరి 11 డ్రాయింగ్ కోసం అతడు టిక్కెట్‌ను కొనుగోలు చేశాడు. ఆసక్తికరంగా, రెండోసారి కూడా అదృష్టం వరించింది. గతంలోనే ఒకసారి లాటరీ గెలిచిన ఈ వ్యక్తి బాగా కలిసొచ్చిన అదే నంబర్‌లను (02-06-11-20-23) ఉపయోగించి ఆగస్టు 31, 2023న ఫాంటసీ 5 డబుల్ ప్లే డ్రాయింగ్‌లో జాక్‌పాట్ మొత్తాన్ని గెలుచుకుని లక్షాధికారి అయ్యాడు.

గత ఆగస్టులో 110,000 డాలర్లు గెలుచుకున్న తర్వాత తన ఫాంటసీ 5 నంబర్‌లను మార్చానని అతడు తెలిపాడు. తన లాటరీ టిక్కెట్‌లను చెక్ చేసి అదే నెంబర్లను ఎంచుకున్నాడు. అతడి టిక్కెట్‌లను స్కాన్ చేసిన అనంతరం ఒకటి తిరిగి ఇచ్చారు. మొదట్లో తాను లాటరీలో గెలుస్తానని అనుకోలేదు. తాను నేను గెలుపొందిన లాటరీ సంఖ్యల కోసం వెతికాడు. అదృష్టవశాత్తూ అతడు మళ్లీ గెలవడాన్ని నమ్మలేకపోయినట్టు చెప్పుకొచ్చాడు. రెండోసారి లాటరీ గెలవడం తనకు చాలా సంతోషంగా ఉందని తెలిపాడు.

మొదట్లో గెలిచిన లాటరీ డబ్బులను తన అప్పులను తీర్చేందుకు వినియోగించినట్టు తెలిపాడు. రెండోసారి గెలిచిన లాటరీ డబ్బులతో ఎంజాయ్ చేయాలని భావిస్తున్నట్టు ఆనందం వ్యక్తం చేశాడు. ‘మొదటిసారి గెలిచినప్పుడు నా రుణం మొత్తాన్ని తీర్చాను. రెండోసారి డబ్బును ఖర్చుపెట్టేందుకు నా దగ్గర ఇంకా ప్రత్యేక ప్రణాళికలు లేవు. లాటరీ డబ్బులను బ్యాంకు అకౌంట్లో జమ చేసుకుంటాను’ అని తెలిపాడు.

Read Also : Not Losing Weight : ఎంత డైట్ చేసినా ఫలితం లేదా? మీరు బరువు తగ్గకపోవడానికి 5 కారణాలివే..!