China Pakistan deal: చైనా-పాకిస్థాన్ మధ్య మరో భారీ ఒప్పందం.. ఎందుకు హాట్ టాపిక్‌గా మారింది?
ఓ వైపు సరిహద్దుల్లో గిల్లికజ్జాలు పెట్టుకుంటూ, మరోవైపు, దాయాది పాకిస్థాన్‌ను ఎగదోస్తూ.. భారత్‌ను ఇబ్బందులకు గురిచేయడానికి చైనా చేయని ప్రయత్నమంటూ లేదు.

China inks deal with Pakistan
China inks deal with Pakistan: ఇండియా-పాకిస్థాన్.. ఈ రెండు పేర్లు కలిపి వినగానే.. రెండు దేశాల మధ్య ఉన్న వైరమే ముందు గుర్తొస్తుంది. దాయాది దేశాల మధ్య పోరు ఏ స్థాయిలో ఉంటుందో ప్రపంచం మొత్తానికి తెలుసు. కశ్మీర్(Kashmir)పై పట్టుకోసం, ఇండియా(India)పై పైచేయి సాధించేందుకు పాక్ చేయని ప్రయత్నమంటూ లేదు. కొన్నేళ్లుగా చైనా కూడా భారత్‌కు పక్కలో బల్లెంలా మారింది. దాంతో.. పాక్-చైనా ఏదో రకంగా ఇండియాను ఇబ్బంది పెట్టాలని చూస్తున్నాయ్. ఇందుకోసం.. పాకిస్థాన్‌కు సాయం చేస్తూ వస్తోంది చైనా. నేరుగా.. ఇండియాని ఏమీ చేయలేక.. తన కుటిల నీతితో మన శత్రువైన పాకిస్థాన్‌ను పటిష్టం చేస్తోంది డ్రాగన్ కంట్రీ.
భారత్‌పై పైచేయి సాధించాలని..
ప్రపంచం దేశాలన్నీ భారత్ అంటే స్నేహ హస్తం చాస్తాయి. కానీ.. పాకిస్థాన్, చైనా మాత్రం.. కసితో రగిలిపోతుంటాయ్. చైనా పైకి కనిపించకపోయినా.. సైలెంట్‌గా చేయాల్సింది చేస్తూ పోతుంది. ఏదోరకంగా ఇండియాను ఇబ్బంది పెట్టాలని చూస్తుంది. ఇక.. పాకిస్థాన్ అయితే అలాంటి లెక్కలేమీ ఉండవు. డైరెక్ట్‌గానే భారత్‌పై కుట్రలు పన్నుతుంది. ఏదో రకంగా భారత్‌పై పైచేయి సాధించాలని చూస్తుంది. శత్రువుకి.. శత్రువు.. మిత్రుడన్నట్లుగా.. ఇప్పుడు చైనా కూడా పాకిస్థాన్‌తో అనుబంధం పెంచుకుంటోంది. సరిహద్దుల్లో ఇండియాను దీటుగా ఎదుర్కొనేందుకు.. మన శత్రువైన పాకిస్తాన్‌ను చైనా పటిష్టం చేస్తోంది. అండగా ఉంటూ.. ఆయుధాలు అందిస్తోంది.
ఇందుకు.. లేటెస్ట్‌గా జరిగిన ఓ పెద్ద ఒప్పందమే.. మరో బిగ్ ఎగ్జాంపుల్. పాకిస్థాన్-చైనా మధ్య ఉన్న ద్వైపాక్షిక సంబంధాలను మరో స్థాయికి తీసుకెళ్లే క్రమంలో భాగంగా.. రెండు దేశాల మధ్య కొత్తగా మరో ఒప్పందం కుదిరింది. పాకిస్థాన్‌లో.. 39 వేల 406 కోట్లతో.. 1200 మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యం ఉన్న అణు విద్యుత్ కేంద్రాన్ని(nuclear power plant).. చైనా నిర్మించనుంది. పాకిస్థాన్ పంజాబ్‌లోని మియాన్‌వాలీ జిల్లా(Mianwali district)లో.. చష్మా-వి (Chashma-V nuclear plant) పేరుతో.. ఈ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఏర్పాటు చేయబోతోంది. ఇదే ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
దాయాది దేశాన్ని ఎగదోస్తూ..
ఓ వైపు సరిహద్దుల్లో గిల్లికజ్జాలు పెట్టుకుంటూ, మరోవైపు, దాయాది పాకిస్థాన్‌ను ఎగదోస్తూ.. భారత్‌ను ఇబ్బందులకు గురిచేయడానికి చైనా చేయని ప్రయత్నమంటూ లేదు. కొన్నేళ్లుగా పాక్‌కు సైనిక సహకారంతో పాటు ఆయుధ సంపత్తిని కూడా అందజేస్తోంది. అత్యాధునిక ఆయుధాల విషయంలో.. పాకిస్థాన్‌ను.. భారత్‌తో సరిసమానంగా నిలపాలని డ్రాగన్ భావిస్తోంది. ఇండియా దగ్గరున్న ఆయుధాలను, డిఫెన్స్ సిస్టమ్‌ని దీటుగా ఎదుర్కొనేందుకు.. అత్యాధునిక ఆయుధాలను పాక్‌కు సప్లై చేస్తోంది చైనా. సంప్రదాయ ఆర్టిలరీ సిస్టమ్‌లు, యుద్ధ విమానాలు, విధ్వంసకారులను సరఫరా చేస్తోంది. ఈ ఆయుధాల సరఫరా వెనుక పెద్ద కారణమే ఉంది. భారత్-పాక్ మధ్య శాశ్వత శత్రుత్వం కొనసాగాలన్నదే చైనా అసలు లక్ష్యమని.. విశ్లేషకులు చెబుతున్నారు.
Also Read: ఎప్పుడో ఇండియాకు రావాల్సిన టెస్లా.. ఇంత లేటుగా ఎందుకొస్తోంది?
40 వేల కోట్లతో ఒప్పందం
ముఖ్యంగా.. పాకిస్థాన్‌ని అణ్వస్త్ర దేశంగా మార్చడంలో.. చైనా కీలకపాత్ర పోషిస్తోంది. డిఫెన్స్ సిస్టమ్‌లను రహస్యంగా సప్లై చేస్తోందనే వాదనలు కూడా ఉన్నాయి. వీటన్నింటికి బలం చేకూర్చేలా.. పాకిస్థాన్‌లో ఇప్పుడు డ్రాగన్ కంట్రీ న్యూక్లియర్ ప్లాంట్ కూడా ఏర్పాటు చేసేందుకు.. దాదాపు 40 వేల కోట్లతో ఒప్పందం కుదుర్చుకుంది. వాస్తవానికి 1990ల నుంచే పాక్ – చైనా మధ్య ఈ ఆయుధాల సరఫరా వ్యవహారం నడుస్తోందని చెబుతున్నారు. చైనా వ్యూహం కూడా ఫలిస్తోందని.. అందువల్ల భారత్ నిరంతరం అప్రమత్తంగా వ్యవహరించాల్సి వస్తోందని విశ్లేషకులు అంటున్నారు. ఇప్పటికే.. మందుగుండు సామాగ్రి సప్లైతో పాటు టెక్నాలజీ షేరింగ్‌లోనూ.. రెండు దేశాల మధ్య ఓ అవగాహన ఉన్నట్లు తెలుస్తోంది. భారత పశ్చిమ సరిహద్దు వెంబడి.. పాకిస్థాన్ సైన్యం ఆయుధ శక్తిని.. ముఖ్యంగా జమ్ముకశ్మీర్‌లోని ఎల్వోసీ దగ్గర కాల్పుల ఉల్లంఘన ఒప్పందం రద్దయితే.. ఉద్రిక్తతలను పెంచడమే.. చైనా ప్రధాన లక్ష్యంగా కనిపిస్తోంది.
Also Read: సముద్రగర్భంలో అమెరికా, చైనా దేశాల ఇంటర్నెట్ కేబుల్ వార్.. ప్రచ్ఛన్న యుద్ధానికి దారితీయనుందా?
పాకిస్థాన్ పక్షానే చెైనా
కేవలం.. పాకిస్థాన్‌కు ఆయుధాలను సరఫరా చేయడమే కాదు.. భారత్ ఐక్యరాజ్యసమితి భద్రతామండలిలో చేరకుండా చైనా మోకాలడ్డుతోంది. అంతేకాదు.. యూఎన్‌లో కశ్మీర్ అంశం ప్రస్తావనకు వచ్చిన ప్రతిసారీ.. పాకిస్థాన్ పక్షానే నిలుస్తోంది డ్రాగన్. అక్కడితో ఆగకుండా.. రక్షణ రంగంలో పాకిస్థాన్‌కు.. చైనా పూర్తి స్థాయిలో సహకారం అందిస్తోంది. కేవలం.. ఆయుధాల సరఫరా మాత్రమే కాదు బాలిస్టిక్, యాంటీ ఎయిర్‌క్రాఫ్ట్, యాంటీ షిప్ మిస్సైల్స్, యుద్ధ ట్యాంకుల నిర్మాణంలోనూ సహకరిస్తోంది. లైట్ కాంబాట్, మల్టిపుల్ సిస్టమ్ కాంబాట్ ఎయిర్ క్రాఫ్ట్‌లను కూడా రెండు దేశాలు సంయుక్తంగా అభివృద్ధి చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇలా.. పాకిస్థాన్, భారత్ మధ్య ఎలాంటి శాంథి నెలకొనకుండా.. నిత్యం సరిహద్దుల్లో ఉద్రిక్తతలు కొనసాగేలా.. మన శత్రువుని, దాయాది పాక్‌ని పటిష్టం చేసేందుకు చైనా అన్ని విధాలుగా ప్రయత్నిస్తూనే ఉంది.
Also Read: ఇండియాకు గుడ్ బై చెబుతున్న కుబేరులు.. ఇబ్బంది లేదంటున్న ఆర్థిక నిపుణులు.. ఎందుకంటే?