Covid : క‌రోనా సోకిన పిల్లుల‌ను చంపేసిన చైనా

చైనా అధికారులు జంతువులపై పాశవికంగా ప్రవర్తించారు. కరోనా సోకిన పిల్లులకు చికిత్స అందించకుండా చంపేశారు.

Covid

Covid : కరోనా పుట్టిల్లు చైనాలో ఓ అమానవీయ ఘటన జరిగింది. యజమాని కారణంగా పిల్లులకు కరోనా సోకడంతో వాటిని అధికారులు చంపేశారు. ఈ ఘటన ఉత్తర చైనాలోని హార్బిన్ నగరంలో చోటుచేసుకుంది. హార్బిన్ కు చెందిన ఓ వ్యక్తి తన ఇంట్లో మూడు పిల్లులను పెంచుకుంటున్నాడు. తాజాగా అతడికి కరోనా సోకింది. అది తెలియక వ్య‌క్తి పిల్లుల‌కు కావాల్సిన ఆహారం, నీళ్లు వంటివి ఇచ్చాడు.

Ream More : Pawan Kalyan: అన్నీ గుర్తుపెట్టుకుంటా.. ప్రతి ఒక్కరికీ బదులిస్తా.. ఎలా కావాలంటే అలా యుద్ధం చేస్తా..!

ఆరోగ్యం సరిగా లేకపోవడంతో పరీక్షలు చేయించుకోగా కరోనా నిర్దారణ అయింది. దీంతో అతడు ఐసోలేష‌న్‌లోకి వెళ్లిపోయారు. ఆ త‌ర్వాత ఓ క‌మ్యూనిటీ వ‌ర్క‌ర్ వ‌చ్చి ఆ పిల్లుల‌కు క‌రోనా ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌గా.. రెండుసార్లు పాజిటివ్‌గా వచ్చింది. దీంతో వాటిని అక్కడి నుంచి తరలించారు. వాటిని చంపుతారని యజమానికి తెలియడంతో త‌న పెంపుడు జంతువుల‌ను చంపొద్ద‌ని అధికారుల‌ను వేడుకున్నారు.

ఆన్‌లైన్ ఉద్యమం కూడా న‌డిపారు. అయినా మంగ‌ళ‌వారం రాత్రి స్థానిక అధికారులు వాటిని చంపేశారు. దీంతో జంతు ప్రేమికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రత్యేక ప్రదేశంలో పెట్టి వాటి బాగోగులు చూడకుండా చంపడం ఏంటని నిలదీస్తున్నారు. కరోనా సోకిన జంతువులను చంపుకుంటూ పోతే ఇక ఏవి భూమిపై మిగలవని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Read More : False Propaganda : టెస్లాపై నెగిటీవ్ ప్రచారం.. న్యాయపోరాటానికి సిద్దమైన ఎలాన్ మస్క్

నిజానికి మ‌నుషుల నుంచి జంతువుల‌కు క‌రోనా సోకుతుంద‌ని తేలినా.. జంతువుల నుంచి మ‌నుషుల‌కు ముప్పు వాటిల్లిన‌ట్లు ఇప్ప‌టి వ‌ర‌కూ తేల‌లేదు. ఈ పిల్లుల‌ను కూడా చంపొద్దంటూ జంతు ప్రేమికులు పెద్ద ఎత్తున ఆన్‌లైన్ ప్ర‌చారం నిర్వ‌హించారు. ఏకంగా 52 వేల మంది దీనిపై కామెంట్లు చేశారు.