False Propaganda : టెస్లాపై నెగిటీవ్ ప్రచారం.. న్యాయపోరాటానికి సిద్దమైన ఎలాన్ మస్క్

టెస్లా కంపెనీపై అసత్య ప్రచారం చేస్తున్న వ్యక్తిపై న్యాయపోరాటానికి సిద్ధమయ్యారు కంపెనీ సీఈఓ ఎలాన్ మస్క్.

False Propaganda : టెస్లాపై నెగిటీవ్ ప్రచారం.. న్యాయపోరాటానికి సిద్దమైన ఎలాన్ మస్క్

False Propaganda 1

False Propaganda : చాలామంది తాము తీసుకున్న ప్రాడక్టుల గురించి రివ్యూ చేస్తుంటారు. ఎలా ఉపయోగించాలి.. ఎలా పనిచేస్తుంది.. అనే అంశాలను చెబుతుంటారు. అయితే కొందరు కొన్ని వస్తువుల గురించి పనికట్టుకొని నెగటివ్ ప్రచారం చేస్తుంటారు. మరికొందరు మాత్రం ఉన్నదున్నట్లు చెబుతుంటారు. అయితే తాజాగా టెస్లా కార్ల కంపెనీ పై ఓ వ్యక్తి నెగిటీవ్ ప్రచారం చేయసాగాడు. టెస్లా కార్లు వేస్ట్, చెత్త కార్లు, టెస్లా రోగ్‌ కంపెనీ’ అంటూ సోషల్ మీడియా వేదికగా ప్రచారం చేశాడు. అయితే ఈ వ్యవహారం కంపెనీ అధినేత ఎలాన్ మస్క్ దృషికి వెళ్ళింది. దీంతో అతడు సదరు వ్యక్తిపై చట్టపరమైన చర్యలకు సిద్ధమయ్యారు.

Read More : Oldest Grape Tree: ప్రపంచంలోనే అత్యంత పురాతనన ద్రాక్ష పాదు..ఇప్పటికీ దీని పండ్లతో తయారైన వైన్ కు ఫుల్ డిమాండ్

వివరాల్లోకి వెళితే… చైనాకు చెందిన హాన్ చావో అనే వ్యక్తి 2019లో టెస్లా కారును కొనుగోలు చేశాడు. అయితే మూడు నెలల వరకు కారు బాగానే నడిచింది.. ఆ తర్వాత దాని పనితీరు మందగించింది. దీంతో అతడు టెస్లా షో రూమ్ కి వెళ్లి తన కార్ రీప్లేస్ చెయ్యాలని కోరాడు. అందుకు షోరూమ్ నిర్వాహకులు ఒప్పుకోలేదు. దీంతో హాన్ చావో, టెస్లా కంపెనీపై విమర్శలు గుప్పించడం మొదలు పెట్టాడు. ఆన్ లైన్, ఆఫ్ లైన్ వేదికగా టెస్లా కంపెనీపై విమర్శలు గుప్పించాడు. చెత్త కార్లు, రోగ్ కంపెనీ అంటూ విమరితంగా విషప్రచారం చేశాడు. అంతేకాదు పరువునష్టం దావా కింద తనకి వన్‌ మిలియన్ యువాన్ చెల్లించాలని కంపెనీని డిమాండ్‌ చేశాడు.

Read More : Donate Kidneys : భర్తల కోసం హిందూ,ముస్లిం మహిళలు ఒకరికొకరు..కిడ్నీ దానాలు..మానవత్వమే తప్ప మతం లేదని నిరూపించిన అతివలు

ఇది కంపెనీ పెద్దల దృషికి వెళ్లడంతో ఎలాన్ మస్క్ రంగంలోకి దిగాడు. హాన్ ప్రచారంతో ప్రజల్లో టెస్లా కారు గురించి ప్రతికూల అభిప్రాయం ఏర్పడుతుంది. కంపెనీ ప్రతిష్ట దెబ్బ తింటుంది. ఇలాంటి చర్యల వలన కంపెనీకి సేల్స్ తగ్గే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలోనే సదరు వ్యక్తి చేసిన విషప్రచారంపై పరువు నష్టం దావా వేయాలని కంపెనీ ప్రతినిధులకు మస్క్ సూచించినట్లు సమాచారం.