Strict lockdown in China: భూకంపంతో 65 మంది చనిపోయి ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నా.. కఠిన లాక్‌డౌన్‌ అమలు చేస్తోన్న చైనా

‘జీరో-కొవిడ్‌’ విధానాన్ని పాటిస్తూ కఠిన లాక్‌డౌన్‌లు, క్వారంటైన్లు విధిస్తోన్న చైనా.. భూకంపం వచ్చినప్పటికీ తన తీరును మార్చుకోవడం లేదు. ఓ వైపు ప్రజలు భూకంపంతో తీవ్ర ఇబ్బందులు పడుతుంటే, మరోవైపు లాక్‌డౌన్‌ పాటించాల్సిందేనని చైనా స్పష్టం చేసింది. లేదంటే చర్యలు తీసుకుంటామని చెప్పింది. చైనాలోని సిచువాన్‌ ప్రావిన్సులోని లూడింగ్‌ కౌంటీలో నిన్న భారీ భూకంపం విధ్వంసం సృష్టించిన విషయం తెలిసిందే.

Strict lockdown in China: ‘జీరో-కొవిడ్‌’ విధానాన్ని పాటిస్తూ కఠిన లాక్‌డౌన్‌లు, క్వారంటైన్లు విధిస్తోన్న చైనా.. భూకంపం వచ్చినప్పటికీ తన తీరును మార్చుకోవడం లేదు. ఓ వైపు ప్రజలు భూకంపంతో తీవ్ర ఇబ్బందులు పడుతుంటే, మరోవైపు లాక్‌డౌన్‌ పాటించాల్సిందేనని చైనా స్పష్టం చేసింది. లేదంటే చర్యలు తీసుకుంటామని చెప్పింది. చైనాలోని సిచువాన్‌ ప్రావిన్సులోని లూడింగ్‌ కౌంటీలో నిన్న భారీ భూకంపం విధ్వంసం సృష్టించిన విషయం తెలిసిందే.

భూకంపం ధాటికి ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 65కి చేరింది. 6.8 తీవ్రతతో భూకంపం రావడంతో ఎన్నో ఇళ్ళు కుప్పకూలాయి. ఇప్పటికీ శిథిలాల కింద చాలామంది చిక్కుకుని ఉన్నారు. దాదాపు 100 మంది గాయపడ్డారు. అయినప్పటికీ కరోనా లాక్‌డౌన్‌ను సడలించబోమని చైనా స్పష్టం చేసింది. చెంగ్డులో కరోనా నిబంధనలు పక్కాగా కొనసాగుతాయని చెప్పింది. కరోనా పరీక్షల సంఖ్యను పెంచుతున్నామని పేర్కొంది.

లాక్ డౌన్ వల్ల 2.1 కోట్ల మంది చెంగ్డు సిటీ ప్రజలు తమ ఇళ్ళకే పరిమితం అవుతున్నారు. టియాంజిన్‌లో 14 కొత్త కరోనా కేసులు నమోదు కావడంతో చైనా చుట్టుపక్కల ప్రాంతాలను కూడా అప్రమత్తం చేసి ఈ చర్యలు తీసుకుంటోంది. ఆయా ప్రాంతాల్లో విద్యార్థులు కూడా ఆన్‌లైన్‌ క్లాసులకే హాజరవుతున్నారు. నిన్న చైనాలో 1,552 కరోనా కేసులు నమోదయ్యాయి. చైనాలో ప్రస్తుతం 33 నగరాల్లో కరోనా ఆంక్షలు కొనసాగుతున్నాయి.

Bharat Biotech’s nasal vaccine: భారత్‌ బయోటెక్‌ ‘ముక్కు’ టీకా వినియోగానికి డీసీజీఐ అనుమతి

ట్రెండింగ్ వార్తలు