Iran Economic Crisis: ట్రే గుడ్లు 35 లక్షలు, లీటర్ వంట నూనె 18 లక్షలు.. ఇరాన్‌లో దారుణ పరిస్థితులు.. ఎందుకిలా

అమ్మకాలు పడిపోవడంతో దుకాణదారులు సైతం గగ్గోలు పెడుతున్నారు. వ్యాపారం దెబ్బతిందని వాపోతున్నారు. మార్కెట్ పరిస్థితులు బాగోలేవని, కస్టమర్లు కొన్ని వస్తువులను కొనలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. Iran Economic Crisis

Iran Economic Crisis: ట్రే గుడ్లు 35 లక్షలు, లీటర్ వంట నూనె 18 లక్షలు.. ఇరాన్‌లో దారుణ పరిస్థితులు.. ఎందుకిలా

Iran Economic Crisis Representative Image (Image Credit To Original Source)

Updated On : January 8, 2026 / 8:52 PM IST
  • భారీగా పెరిగిన నిత్యావసరాల ధరలు
  • కుప్పకూలిన ఆర్థిక వ్యవస్థ
  • దారుణంగా పడిపోయిన కరెన్సీ విలువ
  • ధరలను నియంత్రించాలంటూ ఇరాన్ లో ఆందోళనలు

Iran Economic Crisis: లీటర్ వంట నూనె ధర 18 లక్షల రియాల్స్. ఒక్క ట్రే గుడ్ల ధర 35 లక్షల రియాల్స్. ఏంటి షాక్ అయ్యారా? ప్రస్తుతం ఇరాన్ లో నెలకొన్న దారుణ పరిస్థితి ఇది. ఆ దేశంలో నిత్యవసర వస్తువుల ధరలు భగ్గుమంటున్నాయి. తినే వస్తువుల రేట్లు భారీగా పెరిగిపోయాయి. ఏడు రోజుల క్రితం ఒక ట్రే గుడ్ల ధర 22 లక్షల రియాల్స్ కాగా, లీటర్ వంట నూనె ధర 7 లక్షల 90 వేల రియాల్స్ గా ఉండేది. వారం రోజుల్లో సీన్ మొత్తం మారిపోయింది. ఇప్పుడు ఆ ధరలు దాదాపుగా డబుల్ అయ్యాయి. ఏం కొనేటట్టు లేదు, ఏం తినేటట్టు లేదు అంటూ అక్కడి ప్రజలు వాపోతున్నారు. భారీగా పెరిగిన ధరలతో గగ్గోలు పెడుతున్నారు. ధరలను కంట్రోల్ చేయాలంటూ రోడ్డెక్కారు. ఆందోళన బాట పట్టారు.

భారీగా పడిపోయిన ఇరాన్ కరెన్సీ..

ఇరాన్ లో ప్రస్తుతం పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి. నిత్యవసర వస్తువుల రేట్లు చుక్కలను తాకుతున్నాయి. దీనికి కారణాలు ద్రవ్యోల్బణం, ఆర్థిక సంక్షోభమే. ఆర్థిక సంక్షోభంగా కారణంగా ఇరాన్ కరెన్సీ భారీగా పడిపోయింది. మార్కెట్లు మూతపడటంతో నిత్యవసర వస్తువుల ధరలు భగ్గుమంటున్నాయి. ఈ పరిస్థితులను చక్కదిద్దేందుకు ఇరాన్ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ధరల నియంత్రణకు సబ్సిడీ విధానాన్ని పూర్తిగా మార్చేసింది. సబ్సిడీలకు బదులుగా ప్రజల చేతికే డబ్బు ఇస్తోంది. ప్రతి నెల 10 మిలియన్ రియాల్స్ (7 డాలర్లు) బ్యాంకు ఖాతాల్లో వేస్తున్నారు. అయితే, ఇది ఆహార ధరలు మరింత పెరగడానికి కారణమైంది.

Iran Protests

Iran Protests Representative Image (Image Credit To Original Source)

”ద్రవ్యోల్బణం పెరిగిపోవడంతో ఇరాన్ లో బియ్యం, నూనెలు, గుడ్లు వంటి నిత్యావసరాల రేట్లు భారీగా పెరిగాయి. కిలో బియ్యం ధర 2.2 లక్షలకు చేరింది. ట్రే గుడ్లు ఏకంగా 35 లక్షల రియాల్స్‌‌ పలుకుతున్నాయి. అంటే ఒక్కో గుడ్డు ధర లక్షకు పైనే. వారం రోజుల వ్యవధిలోనే ధరలు డబుల్ అయ్యాయి. డాలర్‌‌తో పోలిస్తే రియాల్ విలువ 14.7 లక్షలకు చేరడమే ఇందుకు కారణం” అని నిపుణులు వివరించారు.

కుప్పకూలిన ఆర్థిక వ్యవస్థ..

ఇరాన్ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిందనే చెప్పాలి. ఆర్థిక సంక్షోభంగా కారణంగా చాలా షాపులు క్లోజ్ అయ్యాయి. ఇరాన్ సెంట్రల్ బ్యాంక్ మెడిసిన్, గోధుమలు మినహా అన్ని ఉత్పత్తుల సబ్సిడీలను డాలర్ రియాల్ మారకం రేటును తగ్గించింది. దీంతో డాలర్ తో పోలిస్తే రియాల్ విలువ ఘోరంగా పడిపోయింది. 2025 జూన్ నెలలో ఒక డాలర్ 35వేల రియాల్స్ గా ఉంది. ఇప్పుడు ఒక డాలర్ విలువ లక్ష 43వేల రియాల్స్ కు చేరింది. దీంతో నిత్య అవసర వస్తువుల ధరలు చుక్కలను తాకుతున్నాయి. బియ్యం, నూనెలు, చికెన్, మాంసం ధరలు భగ్గుమంటున్నాయి.

వారం రోజుల్లో ధరలు డబుల్..

అమ్మకాలు పడిపోవడంతో దుకాణదారులు సైతం గగ్గోలు పెడుతున్నారు. వ్యాపారం దెబ్బతిందని వాపోతున్నారు. మార్కెట్ పరిస్థితులు బాగోలేవని, కస్టమర్లు కొన్ని వస్తువులను కొనలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో 7 లక్షల రియాల్స్ ఉన్న లీటర్ వంట నూనె ఇప్పుడు 18 లక్షల రియాల్స్ కు చేరిందన్నారు. కరెన్సీ విలువ పడిపోవడంతో నిత్యవసరాలు సహా అన్నింటి ధరలు 50 నుంచి 100శాతం రెట్టింపయ్యాయని వాపోయారు.

అమెరికాతో అణు ఒప్పందం రద్దు, ఇజ్రాయెత్ తో యుద్ధం ఎఫెక్ట్..

2018లో ఇరాన్ కు కష్టాలు మొదలయ్యాయి. ఆ ఏడాదిలో అమెరికాతో అణు ఒప్పందం నుంచి ఇరాన్ బయటకు వచ్చింది. అది మొదలు కష్టాలు స్టార్ట్ అయ్యాయి. ఆ దేశ చమురు ఎగుమతులపై ఆంక్షలు విధించడంతో కరెన్సీ విలువ దారుణంగా పడిపోయింది. ఇది ఆర్థిక సంక్షోభానికి దారి తీసింది. దీంతో ప్రజల సేవింగ్స్ పూర్తిగా కరిగిపోయాయి. వార్షిక ద్రవ్యోల్బణం 42 శాతానికి చేరింది. ఇక, 2025లో జూన్ లో ఇజ్రాయల్ తో యుద్ధం.. ఇరాన్ పరిస్థితిని మరింత దెబ్బతీసింది. ఇరాన్ పై అంతర్జాతీయ ఆంక్షలు మరింత కఠినతరం అయ్యాయి. దీంతో రియాల్ కరెన్సీ డిసెంబర్ లో పూర్తిగా పతనమైపోయింది. ఒక డాలర్ విలువ 1.4 మిలియన్లకు చేరుకుంది.

Also Read: మీ పిల్లలకు నెస్లే మిల్క్ పౌడర్ వాడుతున్నారా? వెంటనే ఆపేయండి.. ఆ పాల పొడిలో విష పదార్ధం..!