Nestle: మీ పిల్లలకు నెస్లే మిల్క్ పౌడర్ వాడుతున్నారా? వెంటనే ఆపేయండి.. ఆ పాల పొడిలో విష పదార్ధం..!

పాలను వేడి చేయడం వల్ల లేదా మరిగించడం వల్ల ఆ టాక్సిన్ నశించదు. కాబట్టి పౌడర్‌లో టాక్సిన్ ఉంటే అది నేరుగా పిల్లల శరీరంలోకి చేరుతుంది. Nestle

Nestle: మీ పిల్లలకు నెస్లే మిల్క్ పౌడర్ వాడుతున్నారా? వెంటనే ఆపేయండి.. ఆ పాల పొడిలో విష పదార్ధం..!

Nestle Food Representative Image (Image Credit To Original Source)

Updated On : January 7, 2026 / 8:28 PM IST

 

  • నెస్లే చరిత్రలోనే అతిపెద్ద రీకాల్
  • ప్రముఖ బ్రాండ్ల బ్యాచులలో సిరులైడ్ అనే టాక్సిన్ ఉండే ప్రమాదం
  • శిశువుల ఆరోగ్యానికి హానికరం
  • శిశువుల్లో వాంతులు, వికారం, కడుపు నొప్పి వచ్చే అవకాశం

Nestle: బేబీ ఫుడ్స్ రంగంలో దిగ్గజంగా గుర్తింపు పొందిన నెస్లే కీలక నిర్ణయం తీసుకుంది. తల్లి పాలకు ప్రత్యామ్నాయంగా వాడే కొన్ని శిశు ఫార్ములా ఉత్పత్తులను ప్రపంచవ్యాప్తంగా రీకాల్ చేసింది. కొన్ని బ్యాచ్‌లు ఫుడ్ పాయిజనింగ్‌కు కారణమయ్యే టాక్సిన్‌తో కలుషితమై ఉండొచ్చనే ఆందోళనతో ఈ ఉత్పత్తులను వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించింది. స్విట్జర్లాండ్ లో ఉన్న నెస్లే ప్రధాన కార్యాలయం జనవరి 6న విడుదల చేసిన ఒక ప్రకటనలో తన సిమ్యులేటెడ్ మిల్క్ అడాప్టెడ్ (SMA) ఇన్ఫెంట్ ఫార్ములా, ఫాలో-ఆన్ ఫార్ములా నిర్దిష్ట బ్యాచ్‌లు శిశువులకు సురక్షితం కాదని తెలిపింది.

కొన్ని ఉత్పత్తుల్లో విషపదార్ధం..

ప్రపంచవ్యాప్తంగా అనేక మార్కెట్లలో విక్రయించే ఈ బ్యాచ్‌లలో.. వికారం, వాంతులను కలిగించే సెరియులైడ్ అనే విషపదార్థం ఉండే అవకాశం ఉందని తెలిపింది. ఇప్పటివరకు, ఈ రీకాల్ 31 దేశాలలో విక్రయించిన ఉత్పత్తులను ప్రభావితం చేసింది. వీటిలో ప్రధానంగా యూరప్‌లోని యూకే, ఫ్రాన్స్, జర్మనీతో పాటు, లాటిన్ అమెరికాలోని మూడు దేశాలు, ఆసియాలోని హాంకాంగ్ ఉన్నాయి.

ప్రస్తుతం ఈ జాబితాలో భారత్ పేరు లేదు. అయితే, దర్యాప్తు కొనసాగుతున్న కొద్దీ జాబితాను అప్ డేట్ చేస్తామని నెస్లే స్పష్టం చేసింది. ప్రభావిత దేశాలలో వెనక్కి తీసుకున్న బ్రాండ్‌లలో SMA, BEBA, NAN ఉన్నాయి. వెనక్కి తీసుకుంటున్న బ్యాచ్ నంబర్లను కూడా ఈ ఆహార తయారీ సంస్థ వెల్లడించింది.

శిశు పోషకాహార విభాగంలో ఇండియాలో నెస్లే ఒక ప్రముఖ సంస్థగా ఉంది. నవజాత శిశువుల నుండి పసి పిల్లల వరకు వివిధ వయసుల వారికి NAN PRO, లాక్టోజెన్ ప్రో వంటి ఉత్పత్తులను విక్రయిస్తోంది. ప్రస్తుతానికి ఈ ఉత్పత్తుల్లో దేనినీ వెనక్కి తీసుకోనప్పటికీ, ఈ పరిణామం తల్లిదండ్రుల్లో ఆందోళన నింపింది.

శిశువులకు ఆరోగ్యానికి కలిగే ప్రమాదాలివే..

”మా పాపులర్ బ్రాండ్స్ (SMA, NAN, BEBA) లలోని కొన్ని బ్యాచ్‌లలో ‘సెరియులైడ్’ (Cereulide) అనే ప్రమాదకరమైన టాక్సిన్ ఉంది. ‘బాసిల్లస్ సిర్యస్’ అనే బ్యాక్టీరియా ద్వారా ఉత్పన్నమయ్యే విష పదార్థమే సెరియులైడ్. ఒక ఫ్యాక్టరీలో సరఫరా అయిన ముడి పదార్థాల్లో లోపం వల్ల ఈ సమస్య తలెత్తింది. ఈ టాక్సిన్ కలిగిన పాలు తాగితే శిశువుల్లో తీవ్రమైన వాంతులు, వికారం, కడుపు నొప్పి వచ్చే అవకాశం ఉంది. పాలను వేడి చేయడం వల్ల లేదా మరిగించడం వల్ల ఆ టాక్సిన్ నశించదు. కాబట్టి పౌడర్‌లో టాక్సిన్ ఉంటే అది నేరుగా పిల్లల శరీరంలోకి చేరుతుంది” అని నెస్లే సంస్థ వివరించింది. అయితే, ఇప్పటివరకు ఈ ఉత్పత్తుల వల్ల ఏ శిశువు కూడా అనారోగ్యం బారిన పడినట్లు ఆధారాలు లేవని, ముందు జాగ్రత్త చర్యగా మాత్రమే ఈ గ్లోబల్ రీకాల్ చేపడుతున్నామని నెస్లే సంస్థ స్పష్టం చేసింది.

Nestle

Nestle Representative Image (Image Credit To Original Source)

అనుమానిత కలుషిత పదార్థం సెరూలైడ్.. మట్టిలో సాధారణంగా కనిపించే సూక్ష్మజీవి బాసిల్లస్ సెరియస్ అనే బాక్టీరియం జాతుల ద్వారా ఉత్పత్తి అయ్యే టాక్సిన్. ఈ టాక్సిన్ అనారోగ్యానికి కారణమవుతుంది. ఇది హీట్ స్టేబుల్ కావడం మరింత ఆందోళన కలిగించే అంశం. అంటే ఆహారాన్ని ఉడకబెట్టడం లేదా మళ్లీ వేడి చేయడం ద్వారా దీనిని నాశనం చేయలేము.

అరాకిడోనిక్ యాసిడ్ ఆయిల్ (ARA) నుండి ఈ కలుషితం జరిగి ఉండొచ్చని నెస్లే విశ్వసిస్తోంది. తల్లి పాలలో కనిపించే ముఖ్యమైన కొవ్వు ఆమ్లాలను ప్రతిబింబించడానికి శిశువుల ఫార్ములాలో జోడించే ఒక పదార్ధమే ఈ ఏఆర్ఏ. శిశువుల మెదడు అభివృద్ధి, రోగనిరోధక పనితీరు, ఎముకల ఆరోగ్యంలో ARA కీలక పాత్ర పోషిస్తుంది.

శిశువులకు సెరూలైడ్ ప్రమాదకరమని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. కలుషితమైన ఫార్ములా తీసుకున్న కొన్ని గంటల్లోనే ఆకస్మికంగా తీవ్రమైన వాంతులు, పూర్ ఫీడింగ్ (ఆహారం సరిగా తీసుకోలేకపోవడం), నీరసం, డీహైడ్రేషన్ కి దారితీస్తుందని వివరించారు. శిశువుల కాలేయం, నాడీ వ్యవస్థ ఇంకా అభివృద్ధి చెందుతూ ఉంటాయి. ఈ క్రమంలో ఆ విష పదార్థానికి గురికావడం వల్ల.. తక్కువ రక్త చక్కెర స్థాయి, జీవక్రియలో లోపాలు, అరుదైన సందర్భాలలో కాలేయ దెబ్బతినడం వంటి మరింత తీవ్రమైన సమస్యలు కూడా తలెత్తవచ్చు.

మీరు వాడే బేబీ ఫుడ్ సురక్షితమేనా?

మీరు వాడుతున్న మిల్క్ పౌడర్ (ప్యాకెట్ లేదా టిన్) సురక్షితమైనదేనా అని తెలుసుకోవడానికి టిన్ అడుగు భాగంలో లేదా ప్యాకెట్ పక్కన బ్యాచ్ కోడ్ ని చూడాలి. నెస్లే అఫీషియల్ వెబ్‌సైట్‌లోకి వెళ్లి అక్కడ ఇచ్చిన రీకాల్ లిస్ట్ లో మీ దగ్గరున్న బ్యాచ్ నెంబర్ ఉందో లేదో సరిచూసుకోండి. ఒక వేళ మీ దగ్గరున్న ఉత్పత్తి బ్యాచ్ కోడ్ ఆ లిస్ట్ లో ఉంటే.. వెంటనే వాడటం ఆపేయాలి.

Also Read: పోస్టాఫీసులో సూపర్ స్కీమ్.. జస్ట్ రోజుకు రూ. 500 ఇన్వెస్ట్ చేస్తే చాలు.. ఎన్ని ఏళ్లలో రూ. 25 లక్షలు సంపాదిస్తారంటే?