Naji Zaheer: బయటపడిన ఉగ్ర బంధం.. పాకిస్తాన్‌లో హమాస్ కమాండర్.. ఎవరీ నజీ జహీర్
ఇజ్రాయల్‌పై హమాస్ దాడి జరిగిన తర్వాత పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో అనేక సదస్సులు, ర్యాలీలలో నజీ జహీర్ పాల్గొన్నాడు. Naji Zaheer
Naji Zaheer Representative Image (Image Credit To Original Source)
- గుజ్రాన్ వాలాలో లష్కరే తోయిబా కార్యక్రమం
- లష్కరే తోయిబా కీలక నేతను కలిసిన హమాస్ కమాండర్
- పాక్ అడ్డాగా ముమ్మరం అవుతున్న అంతర్జాతీయ ఉగ్రవాద నెట్ వర్క్
Naji Zaheer: పాకిస్తాన్ అడ్డాగా అంతర్జాతీయ ఉగ్రవాద నెట్‌వర్క్ ముమ్మరం అవుతోందా? అంటే అవుననే సమాధానం వస్తోంది. హమాస్ కమాండర్ నజీ జహీర్ పాకిస్తాన్ లో కనిపించడం కలకలం రేపింది. పంజాబ్ ప్రావిన్స్ లోని గుజ్రాన్ వాలాలో లష్కరే తోయిబా నిర్వహించిన ఈవెంట్ లో జహీర్ పాల్గొన్నాడు. లష్కరే తోయిబా కీలక నేత రషీద్ అలీ సంధూని కలిశాడు. ఇప్పుడీ పరిణామం సంచలనంగా మారింది.
కాగా, జహీర్ గతంలోనూ పీవోకేలో పర్యటించాడు. భారత వ్యతిరేక ర్యాలీల్లో పాల్గొన్నాడు. అమెరికా నిషేధించిన ఈ రెండు గ్రూపుల మధ్య సమన్వయం పెరుగుతుండటం ఆందోళన కలిగించే పరిణామంగా చెబుతున్నారు. దీనికి పాక్ సైన్యం అండ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. అమెరికాకు చెందిన మిడిల్ ఈస్ట్ ఫోరమ్ నివేదిక ప్రకారం పాలస్తీనా మిలిటెంట్లకు పాకిస్తాన్ ఒక కొత్త కార్యాచరణ స్థావరంగా అవతరిస్తోంది.
నజీ జహీర్ హమాస్ నాయకుడు ఖలీద్ మషాల్ ప్రత్యేక ప్రతినిధి. హమాస్ ఉగ్రవాద సంస్థ రాజకీయ విభాగం అధిపతిగా యహ్యా సిన్వార్ తర్వాత బాధ్యతలు చేపట్టే అవకాశం ఉన్న నాయకుల్లో ఒకడు ఈ ఖలీద్ మషాల్.
గత ఏడాదిన్నర కాలంగా ముఖ్యంగా అక్టోబర్ 7, 2023న ఇజ్రాయల్‌పై హమాస్ దాడి జరిగిన తర్వాత, జహీర్ పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో అనేక సదస్సులు, ర్యాలీలలో పాల్గొన్నాడు. అమెరికా ప్రకటించిన ఉగ్రవాద సంస్థలు లష్కరే తోయిబా (LeT), జైషే మహ్మద్ (JeM) సంస్థల నాయకులతో వేదికను పంచుకున్నాడు.
అక్టోబర్ 7 దాడుల జరిగిన ఒక వారం తర్వాత జహీర్ పెషావర్‌లో జరిగిన పాలస్తీనా అనుకూల ర్యాలీలో ప్రసంగిస్తూ కనిపించాడు. ఈ కార్యక్రమానికి మషాల్ వర్చువల్‌గా హాజరయ్యాడు. పాలస్తీనా సమస్యకు మద్దతిచ్చినందుకు పాకిస్తాన్‌కు ధన్యవాదాలు తెలిపాడు.
నవంబర్ 2, 2023న, జహీర్ కరాచీలో జరిగిన 12 రోజుల నిరసన కార్యక్రమానికి గుర్తుగా నిర్వహించిన ‘తూఫాన్-ఎ-అక్సా’ సదస్సులో వర్చువల్‌గా పాల్గొన్నాడు. ఆసక్తికరంగా ఈ కార్యక్రమంలో హమాస్ మాజీ అధినేత ఇస్మాయిల్ హనియే కూడా వర్చువల్‌గా పాల్గొన్నాడు. “ఈ యుద్ధం కేవలం పాలస్తీనా కోసమే కాదు.. ఇది మొత్తం ఉమ్మత్ (ముస్లిం సమాజం) కోసం” అని అతడు ప్రకటించాడు.
Also Read: ఇదో రకం జెన్ జీ పోరాటం.. పాక్ ఆర్మీని వణికించిన యువకుడి వ్యాసం.. చివరకు..
