China : విజయవంతంగా 90రోజుల అంతరిక్ష యాత్ర..భూమికి తిరిగొచ్చిన చైనా వ్యోమగాములు..

మూడు నెలలు అంతరిక్ష యాత్రను విజయవంతంగా పూర్తి చేసుకుని భూమ్మీదకు సురక్షితంగా తిరిగి వచ్చారు చైనా వ్యోమగాముల బృందం.

Chinese astronauts return after 90-day to space station : భూమికి 360 కిలోమీటర్ల ఎత్తులో చైనా సొంతంగా నిర్మించుకున్న అంతరిక్ష కేంద్రంలో మూడు నెలలు గడిపి భూమికి సురక్షితంగా..తిరిగి వచ్చారు చైనా వ్యోమగాములు. రోదసీలో సుదీర్ఘకాలంపాటు గడిపిన వ్యోమగాములుగా చైనీయులు రికార్డు క్రియేట్ చేశారు. టెక్నాలజీ కొత్త చరిత్రలు లిఖిస్తున్నా చైనా..ప్రపంచం మొత్తాన్ని తనవైపు దృష్టి సారించేలా చేస్తున్న చైనా ఈ అంతరిక్ష విజయోత్సవ యాత్రతో మరో రికార్డును క్రియేట్ చేసినట్లు అయ్యింది.

Read more : Space Tour : గుడ్‌ న్యూస్‌, అంతరిక్ష యాత్రకు టికెట్ల విక్రయం ప్రారంభం

మూడు నెలలపాటు రోదసీలో గడిపిన ముగ్గురు చైనా వ్యోమగాములు గురువారం (సెప్టెంబర్ 17,2021)సురక్షితంగా భూమికి తిరిగొచ్చారు. వీరి రాకతో అంతరిక్ష యాత్ర విజయవంతమైందని చైనా ప్రకటించింది. వీరు సురక్షితంగా భూమికి చేరుకోవడంతో సుదీర్ఘంగా అంతరిక్షంలో గడిపిన చైనీయులుగా నీ హైషెంగ్, లియు బోమింగ్, టాంగ్ హోంగ్బో అనే వ్యోమగాములు చరిత్ర సృష్టించారు. వీరు ప్రయాణించిన షెంఝౌ-12 వ్యోమనౌక ఉత్తర చైనాలోని ఇన్నర్ గురువారం మంగోలియాలో మధ్యాహ్నం 1:34 గంటలకు ల్యాండ్ అయ్యింది.

Read more : Blue Origin: అంతరిక్షంలోకి అమెజాన్ బెజోస్‌..

భూ కక్ష్యలో చైనా సొంతంగా నిర్మించుకుంటున్న అంతరిక్ష కేంద్రం తియాన్హే మాడ్యూల్‌లో వీరు మూడు నెలలపాటు గడిపారు. భూమికి 360 కిలోమీటర్ల ఎత్తులో చైనా ఈ అంతరిక్ష కేంద్రాన్ని నిర్మిస్తోంది. ప్రపంచం మొత్తాన్ని వీక్షించేందుకు వీలు కల్పించేలా ‘ఆకాశ నేత్రం’గా ఈ ప్రాజెక్టును చైనా పరిగణిస్తోంది. వచ్చే ఏడాది నాటికి ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలని చైనా గట్టి పట్టుదలగా ఉంది. కాగా రెండవ వ్యోమగాముల బృందం వచ్చే సంవత్సరంలో వెళ్లటానికి చైనా ప్లాన్ చేస్తోంది.

Read more : Blue Origin New Shepard : రోదసీలోకి వెళ్లొచ్చిన అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్!

ఇప్పుడు మూడు నెలలు అంతరిక్షంలో ఉండి కొత్త చరిత్ర క్రియేట్ చేసిన చైనా 2022లో వెళ్లే బృందం ఆరు నెలల పాటు రోదసీ యాత్రలో ఉండేలా ప్లాన్ చేస్తోంది. ఆ యాత్రకూడా విజయవంతంగా పూర్తి అయితే చైనా తన చరిత్రను తానే బ్రేక్ చేసి మరో కొత్త చరిత్ర సృష్టించనుంది.

 

ట్రెండింగ్ వార్తలు