Blue Origin: అంతరిక్షంలోకి అమెజాన్ బెజోస్‌..

అమెజాన్‌ వ్యవస్థాపకుడు జెఫ్‌ బెజోస్‌ ఇవాళ(20 జులై 2021) అంతరిక్ష యాత్రకు వెళ్ళనున్నారు. 20 ఏళ్ల క్రితం బెజోస్ ప్రారంభించిన ‘బ్లూ ఆరిజిన్‌’ సంస్థకు చెందిన తొలి స్పేస్‌క్రాఫ్ట్‌ ‘న్యూ షెపర్డ్‌’ బెజోస్‌తో పాటు నలుగురిని భూమి నుంచి వంద కిలోమీటర్ల దూరంలోకి కార్మన్‌ లైన్‌ దాటి అవతలకు తీసుకువెళ్తుంది.

Blue Origin: అంతరిక్షంలోకి అమెజాన్ బెజోస్‌..

Amazon (1)

Blue Origin launching Jeff Bezos to space Tuesday: అమెజాన్‌ వ్యవస్థాపకుడు జెఫ్‌ బెజోస్‌ ఇవాళ(20 జులై 2021) అంతరిక్ష యాత్రకు వెళ్ళనున్నారు. 20 ఏళ్ల క్రితం బెజోస్ ప్రారంభించిన ‘బ్లూ ఆరిజిన్‌’ సంస్థకు చెందిన తొలి స్పేస్‌క్రాఫ్ట్‌ ‘న్యూ షెపర్డ్‌’ బెజోస్‌తో పాటు నలుగురిని భూమి నుంచి వంద కిలోమీటర్ల దూరంలోకి కార్మన్‌ లైన్‌ దాటి అవతలకు తీసుకువెళ్తుంది. సరిగ్గా 10 నిమిషాల తరువాత తిరిగి వారిని భూమిపైకి తీసుకుని వస్తుంది.

ఈ యాత్రలో బెజోస్‌తో పాటు ఆయన సోదరుడు మార్క్, మాజీ పైలట్‌ అయిన 82 ఏళ్ల మహిళ వేలీ ఫంక్, 18 ఏళ్ల యువకుడు ఆలీవర్‌ డీమన్‌ ఉంటారు. ఇప్పటికే బిలియనీర్‌ రిచర్డ్‌ బ్రాన్సన్‌ తన సొంత స్పేస్‌ క్రాఫ్ట్‌లో అంతరిక్ష యాత్ర ముగించగా.. ఆ యాత్రలో తెలుగమ్మాయి కూడా వెళ్లిన సంగతి తెలిసిందే. పశ్చిమ టెక్సాస్‌ నుంచి ప్రారంభమయ్యే ఈ యాత్ర కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ట్రైనింగ్ తీసుకున్నారు.

ఈ యాత్రలో ట్రైనింగ్ తీసుకున్న అస్ట్రోనాట్స్‌ ఎవరూ లేరు. స్పేస్‌ క్రాఫ్ట్‌ భారత కాలమానం ప్రకారం సాయంత్రం 6.30 గంటలకు నింగిలోకి స్పేస్ క్రాఫ్ట్ దూసుకుని వెళ్లనుంది. స్పేస్‌క్రాఫ్ట్‌ ‘న్యూ షెఫర్డ్‌’ ప్రయాణానికి సిద్ధంగా ఉందని బ్లూ ఆరిజిన్‌ సంస్థ అస్ట్రోనాట్‌ సేల్స్‌ డైరెక్టర్‌ ఆరియన్‌ కార్నెల్‌ వెల్లడించారు. 1961లో అంతరిక్షానికి వెళ్లిన తొలి అమెరికన్‌ అలాన్‌ షెఫర్డ్‌ పేరును బ్లూ ఆరిజిన్‌ సంస్థ ఫస్ట్ స్పేస్‌క్రాఫ్ట్‌కు పెట్టింది. స్పేస్‌ ఎక్స్‌ సంస్థకు చెందిన ఫాల్కన్‌ 9 రాకెట్‌ తరహాలో స్పేస్ క్రాఫ్ట్‌ను తయారుచేశారు.