3.69 కోట్లు ఇచ్చింది.. యువకుడితో అతడి భార్యను విడదీసింది.. అతడితో ఏడాది ఉండి.. ఇప్పుడు ఆ డబ్బంతా ఇచ్చేయాలంటూ..

కొన్ని రోజులకే వారిద్దరు ప్రేమలో పడ్డారు. అప్పటికే "ఝూ"కి భర్త ఉన్నాడు. "హె"కి భార్య ఉంది. అయినప్పటికీ తమ రిలేషన్‌షిప్‌ను కొనసాగిస్తూ..

Representative Image

Chinese Businesswoman: చైనాలోని చోంగ్‌క్వింగ్‌ ప్రాంతానికి చెందిన ఝూ (Zhu) అనే మహిళా పారిశ్రామికవేత్త తనకంటే చిన్నవాడైన, తన కంపెనీలో పనిచేసే యువకుడిని పెళ్లి చేసుకోవాలనుకుంది. అయితే, ఆ యువకుడికి అప్పటికే పెళ్లైంది.

అతడితో అతడి భార్యకు విడాకులు ఇప్పించేందుకు ఝూ సాయం చేసింది. ఆ యువకుడు కోర్టులో విడాకులు పొందడానికి ఝూ ఏకంగా 3 మిలియన్‌ యువాన్‌ (రూ.3.69 కోట్లు) ఇచ్చింది.

ఆ తర్వాత ఆ యువకుడితో ఝూకి బ్రేకప్‌ అయింది. దీంతో తాను ఇచ్చిన డబ్బును తనకు తిరిగి ఇవ్వాలని డిమాండ్‌ చేసింది. సౌత్‌ చైనా మార్నింగ్‌ పోస్ట్‌లో వచ్చిన కథనం ప్రకారం.. ఆ యువకుడి పేరు “హె”. కొన్నాళ్ల క్రితం ఝూకి చెందిన కంపెనీలో హె చేరాడు.

కొన్ని రోజులకే వారిద్దరు ప్రేమలో పడ్డారు. అప్పటికే ఝూకి భర్త ఉన్నాడు. హె కి భార్య ఉంది. అయినప్పటికీ తమ రిలేషన్‌షిప్‌ను కొనసాగిస్తూ, ఇద్దరూ తమ తమ జీవిత భాగస్వాములకు విడాకులు ఇచ్చి కొత్త జీవితాన్ని మొదలుపెట్టాలని నిర్ణయించుకున్నారు.

Also Read: మరో బాంబు పేల్చిన భాను ప్రకాశ్ రెడ్డి.. సంచలన విషయాలు బయటకు వస్తాయంటూ..

ఏడాదికే విభేదాలు

హె తన భార్య చెన్‌తో విడిపోవడానికి అతడికి ఝూ 3 మిలియన్‌ యువాన్‌ ట్రాన్స్‌ఫర్‌ చేసింది. ఈ మొత్తాన్ని విడాకుల పరిహారంగా, పిల్లల పెంపకం ఖర్చులకు వాడతారు. డబ్బు ఇచ్చిన తరువాత హె విడాకులు తీసుకుని ఝూతో నివసించాడు.

సంవత్సరం తర్వాత ఝూ, హె మధ్య విభేదాలు వచ్చాయి. ఝూ వెంటనే హె, చెన్‌పై కేసు వేసి తాను ఇచ్చిన మొత్తం డబ్బును తిరిగి ఇవ్వాలని డిమాండ్‌ చేసింది.

కోర్టుల్లో రెండు రకాల తీర్పులు

మొదట విచారణలో చోంగ్‌క్వింగ్‌ కోర్టు ఝూకు అనుకూలంగా తీర్పు చెప్పింది. ఆ డబ్బు చెల్లింపు ప్రజా శ్రేయస్సు, నైతిక విలువలకు విరుద్ధమని.. అది చెల్లని బహుమతి అని పేర్కొంది. అందువల్ల హె, చెన్‌ డబ్బు తిరిగి ఇవ్వాలని ఆదేశించింది.

చెన్, హె పై కోర్టులో అప్పీలు చేశారు. కేసు ఉన్నత న్యాయస్థానానికి వెళ్లింది. కింది కోర్టు ఇచ్చిన తీర్పును తిరస్కరించింది. ఝూ ఆ డబ్బును చెన్‌కు వ్యక్తిగత బహుమతిగా ఇచ్చినట్లు నిరూపించలేకపోయిందని పేర్కొంది. ఆ మొత్తాన్ని హె తన భార్యకి విడాకుల సెటిల్‌మెంట్‌గా, పిల్లల పెంపకం ఖర్చులుగా ఇచ్చినదిగా పరిగణించింది.

ఝూ తీరును కోర్టు విమర్శించింది. తన సంపదతో హె విడాకులు త్వరగా జరిగేలా చేసి, రిలేషన్‌షిప్ బ్రేకప్ అయ్యాక డబ్బు తిరిగి పొందాలని చూసిందని పేర్కొంది. ఇలాంటి పరిస్థితిలో డబ్బు వెనక్కి ఇవ్వాలని అడగడం సరికాదని తెలిపింది.