China : పందెం కాసి 10 నిమిషాల్లో లీటర్ మద్యం తాగిన ఉద్యోగి.. క్షణాల్లో ప్రాణాలు విడిచాడు
ఝాంగ్ అనే ఉద్యోగి బాస్ కాసిన పందెంకు ఒప్పుకున్నాడు. లీటర్ మద్యం బాటిల్ సీల్ తీసి గటగటామని 10 నిమిషాల్లోపే మొత్తం తాగాడు. కానీ, మద్యం తాగిన వెంటనే ఝాంగ్ స్పృహ తప్పి పడిపోయాడు.

Chinese Employee Died
Chinese Employee Died : కొందరు పందెం కాసి ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారు. చైనాలో పందెం ఓ నిండు ప్రాణాన్ని తీసింది. పందెం కాసి 10 నిమిషాల్లో లీటర్ మద్యం తాగిన ఉద్యోగి క్షణాల్లో ప్రాణాలు విడిచాడు. చైనాలోని ఓ కంపెనీకి చెందిన ఉద్యోగులు ఆఫీసులో పార్టీ చేసుకున్నారు. ఆ పార్టీలో మద్యం తాగే ముందు కంపెనీ బాస్, ఉద్యోగుల మధ్య పందెం ప్రస్తావన వచ్చింది. బాస్ యాంగ్ ఉద్యోగులతో పందెం కాశాడు.
10 నిమిషాల్లో ఒక లీటర్ మద్యం తాగిన వారికి రూ.5 వేల యువాన్ లు (సుమారు రూ.58వేలు) బహుమతిగా ఇస్తానని ఆఫర్ చేశాడు. కానీ దానికి ఎవరూ స్పందించలేదు. దాంతో రూ. 10 వేల యువాన్ లు (సుమారు. 1.15 లక్షలు) ఇస్తానని ప్రకటించాడు. అయినా కూడా ఎవరూ ముందుకు రాలేదు. అనంతరం బాస్ యాంగ్ ఏకంగా రూ. 20వేల యువాన్ లు (సుమారు రూ. 2.31 లక్షలు) ఆఫర్ ఇచ్చాడు.
Bihar : ప్రాణం తీసిన పందెం.. 150 మోమోస్ తిని అక్కడికక్కడే మృతి చెందిన యువకుడు, వెయ్యి రూపాయల కోసం..
దీంతో ఝాంగ్ అనే ఉద్యోగి బాస్ కాసిన పందెంకు ఒప్పుకున్నాడు. లీటర్ మద్యం బాటిల్ సీల్ తీసి గటగటామని 10 నిమిషాల్లోపే మొత్తం తాగాడు. కానీ, మద్యం తాగిన వెంటనే ఝాంగ్ స్పృహ తప్పి పడిపోయాడు. దీంతో సహోద్యోగులు వెంటనే అతన్ని ఆస్పత్రికి తరలించారు.
పరిశీలించిన వైద్యులు అతను అప్పటికే మృతి చెందినట్లు పేర్కొన్నారు. అతిగా మద్యం తీసుకోవడం వల్ల ఆల్కమాల్ పాయిజనింగ్, ఆస్పిరేషన్ న్యుమోనియా, ఊపిరాడకపోవడం, కార్డియాక్ అరెస్ట్ లాంటి కారణాలతో అతను మరణించి ఉంటాడని వైద్యులు తెలిపారు.