Paralysis Danger signals : ప్రపంచానికి పక్షవాతం ముప్పు.. చైనా హెచ్చరిక

చిన్నవయసులోనే గుండెపోటుకు గురవ్వడం, పక్షవాతం బారిన పడటం ఇటీవల కాలంలో చూస్తున్నాం. పోస్ట్ కోవిడ్ తరువాత ఈ సమస్య మరింత ఎక్కువగా కనిపిస్తోంది. 2030 నాటికి ఈ సమస్యల భారీగా పెరుగుతుందని ఏటా 50 లక్షల మరణాలు సంభవించవచ్చని చైనా శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.

China Report : వయసుతో సంబంధం లేకుండా ఇటీవల కాలంలో పక్షవాతంతో బాధపడుతున్నవారి సంఖ్య గణనీయంగా పెరిగింది. పోస్ట్ కోవిడ్ తరువాత ఈ సంఖ్య మరింత పెరిగింది. 2030 నాటికి పక్షవాతంతో భారీ మరణాలు సంభవిస్తాయని చైనా శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.

నడకతో గుండెపోటు, పక్షవాతం, కేన్సర్‌కు చెక్..!

పక్షవాతం సుగర్, బీపీ కంట్రోల్‌లో లేకపోతే వస్తుంది. ఊబకాయంతో కూడా పక్షవాతం వచ్చే అవకాశం ఉంది. అయితే భవిష్యత్‌లో పక్షవాతం ముప్పు భారీగా పెరగనుందని చైనా హెచ్చరిస్తోంది. మెదడుకి రక్తం సరఫరా అవ్వడంలో ఎదురయ్యే ఇబ్బందుల కారణంగా ఏర్పడే ఇషిమిక్ స్ట్రోక్ వల్ల 2030 నాటికి లక్షల్లో ప్రాణాలు పోయే అవకాశం ఉందని వారు చెబుతున్నారు. దాదాపుగా ఆ సంఖ్య 50 లక్షలు దాటిపోవచ్చని అంచనా వేస్తున్నారు.

 

గతంలో అంటే 1990 లో పక్షవాతంతో 20 లక్షలమందికి పైగా చనిపోగా.. 2019లో 32 లక్షల మంది చనిపోయినట్లు చైనా శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఆహారంలో సోడియం ఎక్కువగా ఉన్నా, పొగత్రాగే అలవాటు, బీపీ, హై కొలెస్ట్రాల్, కిడ్నీ ఫెయిల్ అవ్వడం, సుగర్, ఊబకాయం ఇలాంటి సమస్యలు పక్షవాతానికి దారి తీస్తాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

Paralysis : పక్షవాతం గుట్టువిప్పిన యూఎస్ పరిశోధకులు

ఎప్పటికప్పుడు బీపీ, సుగర్ కంట్రోల్‌లో ఉందో లేదో చెక్ చేసుకుంటూ తగిన జాగ్రత్తలు వహించాలి. ఆరోగ్యకరమైన లైఫ్ స్టైల్, ఒత్తిడిని తగ్గించుకోవడం ద్వారా కూడా పక్షవాతం బారిన పడకుండా కాపాడుకోవచ్చు.

ట్రెండింగ్ వార్తలు