Paralysis : పక్షవాతం గుట్టువిప్పిన యూఎస్ పరిశోధకులు

యూఎస్ పరిశోధకులు పక్షవాతం గుట్టువిప్పారు. ఎలుకలపై ప్రయోగం నిర్వహించిన యూఎస్‌లోని అయోవా యూనివర్సిటీ పరిశోధకులు.. మెదడులోని రెండు వేర్వేరు ప్రాంతాలను కలిపే న్యూరల్‌ సర్క్యూట్‌.. మానవులతో సహా జంతువుల్లో ఒత్తిడితో కూడిన పరిస్థితికి ఎలా ప్రతిస్పందిస్తుందో కనుగొన్నారు.

Paralysis : పక్షవాతం గుట్టువిప్పిన యూఎస్ పరిశోధకులు

paralysis

paralysis : యూఎస్ పరిశోధకులు పక్షవాతం గుట్టువిప్పారు. ఎలుకలపై ప్రయోగం నిర్వహించిన యూఎస్‌లోని అయోవా యూనివర్సిటీ పరిశోధకులు.. మెదడులోని రెండు వేర్వేరు ప్రాంతాలను కలిపే న్యూరల్‌ సర్క్యూట్‌.. మానవులతో సహా జంతువుల్లో ఒత్తిడితో కూడిన పరిస్థితికి ఎలా ప్రతిస్పందిస్తుందో కనుగొన్నారు. మరొక ప్రయోగంలో శాస్త్రవేత్తలు న్యూరల్‌ సర్క్యూట్‌లో విజయవంతంగా మార్పులు చేశారు.

దీంతో ఎలుకలు పక్షవాతం కలిగించే ప్రతిస్పందనను అధిగమించాయి. పక్షవాతానికి కారణమవుతున్న ఒత్తిడి, ఆందోళన కలిగించే విషయాలపై ప్రతిస్పందించకుండా మధ్య మెదడులోని న్యూరల్‌ సర్క్యూట్‌ను నిష్క్రియాత్మకం చేస్తే పక్షవాతం ముప్పును తప్పించ వచ్చని శాస్త్రవేత్తలు నిర్ధారించారు. శరీరంలోని వివిధ అవయవాలు ప్రయత్నపూర్వక చలనాన్ని కోల్పోయే రుగ్మతను ‘పక్షవాతం’ అంటారు.

Fish : వారానికి ఓసారి చేపలు తింటే.. పక్షవాతం ముప్పు తప్పుతుందా..?

స్ట్రోక్‌ని బ్రెయిన్ అటాక్ అని అంటారు. మెదడులోని ఓ భాగానికి రక్తసరఫరా ఆగిపోయినప్పుడు, మెదడులోని రక్తనాళం పగిలినప్పుడు కూడా ఇది వస్తుంది. ఒక స్ట్రోక్ మీ మెదడులోని భాగాలు దెబ్బతినడానికి, చనిపోయేలా చేస్తుంది. దీని వల్ల దీర్ఘకాలిక వైకల్యం, మరణానికి కూడా దారి తీస్తుంది. పక్షవాతం వస్తే భయం ఉంటుంది. స్ట్రోక్ సంకేతాలు తెలుసుకోవడం చాలా ముఖ్యం. కాబట్టి వెంటనే వైద్యులను కలవాలి.

స్ట్రోక్ లక్షణాలను తేలికపాటివి, నిర్దిష్టంగా ఉండవు. ఇవి తప్పుగా నిర్ధారణకి దారి తీస్తుంది. వెర్టిగో, మైకం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇది రోజుల నుండి వారాల వరకు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. వీటిని పట్టించుకోవాలి. రోగ నిర్ధారణ కోసం డాక్టర్‌ని సంప్రదించాలి. వెర్టెబ్రోబాసిలర్ ధమని వ్యవస్థ మెడుల్లా, సెరెబెల్లమ్, పోన్స్, మిడ్‌బ్రేన్, థాలమస్, ఆక్సిపిటల్ కార్టెక్స్‌ని పెర్ఫ్యూజ్ చేస్తుంది.. అంటే ద్రవంతో సరఫరా చేస్తుంది.

Facial Paralysis : ముఖ పక్షవాతం…లక్షణాలు…కారణాలు

వెర్టెబ్రోబాసిలార్ మెటీరియల్ సిస్టమ్‌లో రక్త ప్రసరణకు అంతరాయం ఏర్పడినప్పుడు.. ఇది పృష్ట ప్రసరణ స్ట్రోక్(PCS)కి దారి తీస్తుంది. ఇది అన్ని ఇస్కీమిక్ స్ట్రోక్‌లలో 25 శాతం ఉంటుంది. ఈ రకమైన స్ట్రోక్స్ చాలా అసాధారణమైనవి. వెర్టిగో, మైకం వంటి నాన్‌స్ట్రోక్ లక్షణాలకు కారణమవుతుంది. ఈ కన్ఫ్యూజన్ లక్షణాల కారణంగా రోగ నిర్ధారణ లేకపోవడం వల్ల మరణాల ప్రమాదం పెరుగుతుంది.