క్రిస్మస్, న్యూ ఇయర్ : బహిరంగ ప్రదేశాల్లో నో లిక్కర్ సేల్స్

  • Publish Date - December 14, 2020 / 08:11 AM IST

Christmas, New Year in Germany : కరోనా ధాటికి యూరప్‌ విలవిలాడుతోంది. రోజుకు వేల సంఖ్యలో కేసులు, వందల సంఖ్యలో మరణాలు చోటు చేసుకుంటున్నాయి. దీంతో చాలా దేశాలు కోవిడ్‌ నిబంధనలు కఠినంగా అమలు చేస్తున్నాయి. యూరప్‌లో భక్తి శ్రద్ధలతో ఘనంగా జరుపుకునే క్రిస్మస్‌ పండగకు కూడా నిబంధనల నుంచి సడలింపులు ఇచ్చేందుకు వెనకడాడుతున్నారు అక్కడి దేశాధినేతలు.

క్రిస్మస్‌, న్యూ ఇయర్‌ సందర్భంగా బహిరంగ ప్రదేశాల్లో ఆల్కహాల్‌ అమ్మకాలను జర్మనీలో నిషేధించారు. సంబరాల్లో భాగంగా బాణాసంచా కాల్చేందుకు అనుమతి నిరాకరించారు. డిసెంబరు 16 నుంచి జనవరి 10 వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయి. కీలకమైన రెండు పండగల సందర్భంగా కఠినంగా వ్యవహరించకపోతే దేశంలో కరోనా పరిస్థితి చేయి దాటి పోతుందని అందుకే కఠిన నిర్ణయాలు తీసుకోకతప్పడం లేదని జర్మని పాలకవర్గాలు అంటున్నాయి.

గత నెలలో సుమారు 6 లక్షల మందికి కరోనా సోకగా 9 వేల 7 వందల మంది జర్మనీలో చనిపోయారు. సాధారణంగా క్రిస్మస్‌ పండక్కి నెల రోజుల ముందు నుంచే జర్మనీలో పండగ వాతావరణం చోటు చేసుకుంటుంది. వీధులన్నీ జనాలతో కళకలాడుతాయి. వాణిజ్య కూడళ్లు చక్కగా అలంకరించుకుంటాయి. రెస్టారెంట్లు, బార్లు కిటకిటాడుతుంటాయి. కానీ కరోనా కారణంగా ఈసారి క్రిస్మస్‌కి అవేమీ ఉండబోవడం లేదంటున్నారు జర్మన్‌ ఛాన్సలర్‌ ఏంజెలా మార్కెల్‌.

ట్రెండింగ్ వార్తలు