Catholic Church
Catholic Church : ఫ్రాన్స్‌కు చెందిన క్యాథలిక్ క్రైస్తవ ఫాదర్లు కొన్ని దశాబ్ధాల నుంచి చిన్నారులపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నట్లు స్వతంత్ర కమిషన్ చేసిన దర్యాప్తులో వెల్లడింది. 1950 నుంచి ఇప్పటి వరకు ఫ్రాన్స్ క్యాథలిక్ ఫాదర్లు సుమారు 21,6000 మంది చిన్నారులపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఈ కమిషన్ తేల్చింది. అయితే తమ దృష్టికి రానివి ఇంకా చాలా ఉండిఉంటాయని పేర్కొంది. మొత్తం 3,30,000 ఫాదర్లు చేతిలో లైంగిక వేధింపులు ఎదుర్కొని ఉంటారని రిపోర్ట్‌లో వెల్లడించారు.
Read More : మత్తెక్కించే అందాలతో మాయచేస్తున్న శ్యామల!
జీన్ మార్క్ సావే ఆ వేదికకు హెడ్‌గా ఉన్నారు. ఈ నివేదిక ఫ్రాన్స్ లో కలకలం సృష్టిస్తోంది. నివేదిక వెల్లడించిన అంశాలు ఆందోళనకరంగా ఉన్నాయని, క్షమాపణలు కోరుతున్నట్లు ఫ్రెంచ్ చర్చి విభాగం కోరింది. రోమన్ క్యాథలిక్ చర్చిల్లో చాలా దారుణమైన రీతిలో లైంగిక వేధింపుల ఘటనలు జరిగినట్లు ఆరోపణలు వస్తున్నాయి. అయితే తాజా రిపోర్ట్ అగ్నికి ఆజ్యం పోసినట్లు అయ్యింది. టెక్నాలజీ అభివృద్ధి చెందుతున్నా, లైంగిక వేధింపులు మాత్రం ఆగడం లేదని ఆ సంస్థ ప్రతినిధులు తెలిపారు. వారి దర్యాప్తు నివేదికలను అధికారులకు అందించారు.
Read More : ఒకరికి తెలియకుండా ఒకరిని… నాలుగు పెళ్లిళ్లు చేసుకున్న తమిళ తంబి