Illegal Marriages : ఒకరికి తెలియకుండా ఒకరిని… నాలుగు పెళ్లిళ్లు చేసుకున్న తమిళ తంబి

ఏపీలోని విశాఖలో ఒకరికి తెలియకుండా మరోకరిని నాలుగు పెళ్లిళ్లు చేసుకున్న పోలీసు హెడ్ కానిస్టేబుల్ అప్పలరాజు ఉదంతం మరువక ముందే తమిళనాడులోనూ  ఇలాంటి సీనే రీపీట్ అయ్యింది.

Illegal Marriages : ఒకరికి తెలియకుండా ఒకరిని… నాలుగు పెళ్లిళ్లు చేసుకున్న తమిళ తంబి

Four Marriages

Illegal Marriages : ఏపీలోని విశాఖలో ఒకరికి తెలియకుండా మరోకరిని నాలుగు పెళ్లిళ్లు చేసుకున్న పోలీసు హెడ్ కానిస్టేబుల్ అప్పలరాజు ఉదంతం మరువక ముందే తమిళనాడులోనూ  ఇలాంటి సీనే రీపీట్ అయ్యింది. సినిమా స్టైల్లో ఒకరికి తెలియకుండా మరోకరి చొప్పున నాలుగు పెళ్లిళ్లు చేసుకున్నాడు.

తిరుప్పూరులోని   పాండియన్ నగర్ కు చెందిన సంధ్య (28) కు  2012 లో తిరుప్పూర్ లోనే  టైలర్ గా పని చేస్తున్న ధర్మపురి జిల్లాకు చెందిన సింగారం అనే వ్యక్తితో  పెళ్లి అయ్యింది. ఇద్దరూ స్ధానిక దుస్తుల తయారీ కంపెనీలో టైలర్‌లుగా పని చేస్తున్నారు.  వారికి ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. మరోసారి సంధ్య గర్భం దాల్చింది. దీంతో సింగారం తన భార్యను తన పుట్టింటికి ధర్మపురి పంపించాడు.

సంధ్య బిడ్డకు జన్మనిచ్చింది. భార్య డెలివరీ అయినా సింగారం బిడ్డను చూడటానికి ధర్మపురి వెళ్లలేదు. ఇంతకు ముందు చేసే కంపెనీలో మానేసి వేరే కంపెనీలో చేరాడు. అక్కడ ఒక మహిళతో పరిచయం ఏర్పడింది. ఆమెకు తన మొదటి పెళ్లి విషయం దాచిపెట్టి ఆమెను రెండో పెళ్లి చేసుకుని ఆమెతో కాపురం చేయసాగాడు. కొన్నాళ్లకు ఆ మహిళ మరణించింది. అయినా సింగారం ధర్మపురి నుంచి భార్యను మాత్రం ఇంటికి తీసుకురాలేదు.

Also Read : Extra Marital Affair : భార్య వివాహేతర సంబంధం..ప్రియుడితో కలిసి…….!
ఈలోగా అదే కంపెనీలో పని చేసే కోయంబత్తూరుకు చెందిన మరోక మహిళతో అతనికి పరిచయం ఏర్పడింది. ఆమెకు తన రెండు పెళ్ళిళ్ల గురించి చెప్పకుండా మూడో పెళ్లి చేసుకుని కాపురం చేయసాగాడు.  కోయంబత్తూరు మహిళకు తెలియకుండా మధురైకి చెందిన మరోక మహిళను వివాహం చేసుకున్నాడు. ఆమె కోసం ఇంకో ఇల్లు తీసుకుని అక్కడ కాపురం పెట్టాడు.

సింగారం ఇన్నాళ్లైనా ఇంటికి రాకపోవటంతో మొదటి భార్య సంధ్య పిల్లలను తీసుకుని తిరుప్పూరు వచ్చింది. ఆసమయంలో  సింగారం కోయంబత్తూరుకు చెందిన మహిళను తీసుకుని కోయంబత్తూరులోని  అనుప్పర్ పాళ్యం టూర్ కు వెళ్లినట్లు తెలుసుకుంది. భర్త తిరిగి రాగానే పెళ్లిళ్ళ  గురించి నిలదీసింది. అవును చేసుకున్నాను. ఆమెకూడా ఒక పక్కన ఉంటుంది. అనినిర్లక్ష్యంగా సమాధానం చెప్పాడు.

మహిళల అందాల్ని ఆరాధించటానికే నేను జన్మించానని చెప్పుకొచ్చాడు. భర్త మాటలకు ఆగ్రహించిన సంధ్య తిరుప్పూర్ మహిళా  పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. అనంతరం  జిల్లా కలెక్టర్ ను  కలిసి ఒకరికి  తెలియకుండా   మరోకరిని పెళ్ళి చేసుకున్న తన భర్తపై చర్యలు తీసుకోవాలని కోరింది.