Junk Food Law : ‘జంక్ ఫుడ్ చట్టం’ ప్రపంచంలోనే మొట్టమొదటి చట్టాన్ని అమలు చేసిన ఆ దేశం
కొలంబియా ప్రపంచంలోనే మొట్టమొదటి 'జంక్ ఫుడ్ చట్టం' అమలులోకి తీసుకువచ్చింది. అసలు 'జంక్ ఫుడ్ చట్టం' లక్ష్యాలేంటి?

Junk Food Law
Junk Food Law : జీవనశైలి వ్యాధులను అరికట్టడానికి కొలంబియా ప్రపంచంలోనే మొట్టమొదటి ‘జంక్ ఫుడ్ చట్టం’ అమలులోకి తీసుకువచ్చింది. అసలు ఈ చట్టం వివరాలు ఏంటి?
Feeling Hungry : జంక్ ఫుడ్ , చక్కెర ఆహారాలు తినాలన్న కోరికలు తగ్గించుకోవాలనుకుంటే ?
అనేక వ్యాధులను అధిగమించే ప్రయత్నంలో భాగంగా కొలంబియా ఇటీవల అల్ట్రా-ప్రాసెస్డ్ ఫుడ్స్‌పై పన్ను విధిస్తూ కొత్త చట్టాన్ని తీసుకువచ్చింది. ‘జంక్ ఫుడ్ చట్టం’ గా సూచిస్తూ తీసుకువచ్చిన ఈ కొత్త బిల్లు ప్రపంచంలోనే మొట్ట మొదటిది. కొన్ని నివేదికల ప్రకారం కొలంబియన్ రోజుకి 12 గ్రాముల ఉప్పును తీసుకుంటాడట. అంటే లాటిన్ అమెరికాలో అత్యధికంగా .. ప్రపంచంలోనే అత్యధికంగా ఉప్పును వాడతారన్నమాట. దీని ప్రకారం ప్రభావిత ఆహార పదార్ధాలపై అదనపు పన్ను 10% ప్రారంభమవుతుంది. తర్వాత ఏడాది 15% పెరుగుతుంది. 2025 నాటికి అది 20% కి చేరుకుంటుంది.
Eating Junk Food : డిప్రెషన్ కు, జంక్ ఫుడ్స్ కు మధ్య ఉన్న లింక్ ఏమిటి?
సోడియం ఎక్కువగా తీసుకుంటే అధిక రక్తపోటు, ఊబకాయంతో సహా అనేక అనారోగ్యాలకు దారి తీస్తుంది. వాస్తవానికి కొలంబియన్ మెయిల్‌మన్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ పరిశోధనల ప్రకారం అనారోగ్యకరమైన రిటైల్ ఆహారం తీసుకుంటే గర్భిణీలకు ప్రసవ సమయంలో ప్రమాదం సంభవించే అవకాశం ఎక్కువగా ఉందని కనుగొన్నారు. చక్కెర, కొవ్వు వంటి అనారోగ్యకరమైన పదార్ధాలు అధికంగా ఉన్న ఆహారాలపై కొలంబియా ఆరోగ్య హెచ్చరికలను ప్రవేశపెడుతోందని నివేదికలు చెబుతున్నాయి.