Colombia Mudslide: కొలంబియాలో కొండచరియలు విరిగిపడి 14 మంది మృతి

కొలంబియాలో కురిసిన భారీ వర్షాలకు కొండచరియలు విరిగిపడి 14 మంది మృతి చెందారు. మరో 35 మంది గాయాలయ్యారు.

Colombia Mudslide: పశ్చిమ కొలంబియాలో కురిసిన భారీ వర్షాలకు కొండచరియలు విరిగిపడి 14 మంది మృతి చెందారు. మరో 35 మంది గాయాలయ్యారు. కాగా..భారీ వర్షాలకు కొండచరియలు విరిగిపడి అక్కడంతా బురత పేరుకుపోవటంతో మృతులంతా బురదలో కూరుకుపోయిన ప్రాణాలు కోల్పోయారని అధికారులు తెలిపారు. కాగా..మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.

కొలంబియాలో భారీ వర్షాలు పశ్చిమ కొలంబియాలో భారీ వర్షాలు బీభత్సం సృష్టించాయి. పెరరీ ప్రాంతంలో కొండచరియలు విరిగిపడడం కారణంగా అక్కడ ఉన్న నివాస ప్రాంతాలు బురదతో నిండిపోయాయి. బురదలో కూరుకుపోయి 14 మంది చనిపోయారని అధికారులు తెలిపారు. మరొకరు కనిపించకుండాపోయారని తెలిపారు.

Also read : Coronavirus Cases: దేశంలో పెరిగిన కరోనా కేసులు.. వెయ్యికి పైగా మరణాలు

ఈ ప్రమాదంలో మరో 35 మంది తీవ్రంగా గాయపడ్డారని, గాయపడినవారిని సమీపంలోని ఆసుపత్రులకు తరలించి చికిత్సనందిస్తున్నామని తెలిపారు. కాగా..కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఇంకా ఉందని అధికారులు భావిస్తున్నారు. దీంతో మరింత ప్రాణ నష్టం జరగకుండా ఉండేందుకు ముందు జాగ్రత్తగా స్థానికులను సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని అధికారులు సూచించారు.

ప్రమాదం జరిగిన ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టారు.మృతుల కుటుంబాలకు కొలంబియా అధ్యక్షుడు ఇవాన్ డ్యూక్ సంతాపం తెలిపారు. సహాయక చర్యలు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. గల్లంతు అయిన వ్యక్తి కోసం రెస్క్యూ బృందాలు బురదలో వెతుకుతున్నాయని కొలంబియా విపత్తు నిర్వహణ అధికారులు తెలిపారు.డుబెర్నీ హెర్నాండెజ్ అనే ఓ ట్యాక్సీ డ్రైవర్ బురదలో కూరుకుపోయ చనిపోవటానికి సిద్ధంగా ఉన్న ఇద్దరిని కాపాడాడు. మృతుల సంఖ్య మరింత పెరుగుతుందన్న భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి.

Also read : Vijayawada : వివాహితపై అత్యాచారం.. వీడియో, ఫొటోలు తీసిన భార్య

కొలంబియాలో కొండచరియలు విరిగిపడటం సర్వసాధారణం. దేశంలోని వర్షాకాలంలో ఏటవాలు కొండలపై నిర్మించబడిన ఇళ్లు ఇటువంటి ప్రమాదానికి గురవుతుంటాయి.
2019లో నైరుతి కాకా ప్రావిన్స్‌లో కొండచరియలు విరిగిపడటంతో 28 మంది చనిపోయారు. రెండేళ్ల క్రితంకూడా ఇటువంటి ఘటన చోటుచేసుకుంది. దక్షిణ పుటుమాయో ప్రావిన్స్‌లోని మోకోవా పట్టణంలో కొండచరియలు విరిగిపడడంతో 250 మందికి పైగా మరణించారు.

ట్రెండింగ్ వార్తలు