Coronavirus Cases: దేశంలో పెరిగిన కరోనా కేసులు.. వెయ్యికి పైగా మరణాలు

దేశంలో ప్రాణాంతక కరోనావైరస్ మహమ్మారి కేసులు తగ్గుముఖం పట్టాయి.

Coronavirus Cases: దేశంలో పెరిగిన కరోనా కేసులు.. వెయ్యికి పైగా మరణాలు

India Corona

Coronavirus Cases Today: దేశంలో ప్రాణాంతక కరోనావైరస్ మహమ్మారి కేసులు తగ్గుముఖం పట్టాయి. గడిచిన 24 గంటల్లో దేశంలో 71 వేల 365 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. ఇదే సమయంలో 1,217 మంది మరణించారు. దేశంలో రోజువారీ పాజిటివిటీ రేటు 4.54 శాతంగా ఉంది. దేశంలో ఇప్పటివరకు 4 కోట్ల 24 లక్షల 10 వేల 976 కరోనా కేసులు నమోదయ్యాయి.

మొన్నటివరకు లక్షల్లో నమోదైన కేసులు ఇప్పుడు వేలల్లో నమోదవుతున్నాయి. అయితే, నిన్నటితో పోలిస్తే మాత్రం కరోనా కేసులు కాస్త పెరిగాయి. నిన్న దేశవ్యాప్తంగా 67వేల కేసులు నమోదవగా.. ఈరోజు 70వేల కేసులు దాటాయి.

దేశంలో కరోనా యాక్టివ్ కేసులు 8 లక్షల 92 వేల 828కి తగ్గాయి.. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం, దేశంలో ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 8 లక్షల 92 వేల 828కి తగ్గింది. అదే సమయంలో, మహమ్మారి కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 5 లక్షల 5 వేల 279కి పెరిగింది. గడిచిన 24గంటల్లో రెండు లక్షల 30 వేల 814 మంది కరోనా నుంచి కోలుకున్నారు.

భారతదేశంలో నిన్న 15 లక్షల 71 వేల 726 కరోనా వైరస్ నమూనా పరీక్షలు నిర్వహించగా.. నిన్నటి వరకు మొత్తం 74 కోట్ల 46 లక్షల 84 వేల 750 నమూనా పరీక్షలు చేసినట్లు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) తెలిపింది.

కరోనాపై యుద్ధంలో ముఖ్యమైన ఆయుధంగా భావిస్తున్న వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగంగా సాగిస్తోంది కేంద్రం. దేశవ్యాప్తంగా వ్యాక్సిన్ క్యాంపెయిన్ కింద ఇప్పటివరకు 170 కోట్ల డోస్‌ల యాంటీ-కరోనావైరస్ వ్యాక్సిన్‌లు అందజేశారు. గడిచిన 24గంటల్లో 53 లక్షల 61 వేల 99 డోసులు ఇవ్వగా, ఇప్పటి వరకు 170 కోట్ల 87 లక్షల 6 వేల 705 డోసుల వ్యాక్సిన్‌లు ఇచ్చారు.