Comet C2023 A3 : ఆకాశంలో అత్యుద్భుతం.. 80వేల ఏళ్ల నాటి అరుదైన తోకచుక్క.. వీడియో వైరల్!
Comet C2023 A3 : ప్రతి 80వేల సంవత్సరాలకు ఒకసారి కనిపించే అరుదైన తోకచుక్క (C/2023 A3)కు సంబంధించిన శుచిన్‌షాన్ - అట్లాస్ పేరుతో పిలుస్తారు. ఈ తోకచుక్క ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.

Comet of the Century Lights Up Night Skies In First Visit In 80k Years
Comet C2023 A3 : ఆకాశంలో అద్భుతమైన దృశ్యం ఆవిష్కృతమైంది. దాదాపు 80వేల సంవత్సరాల తర్వాత మొదటిసారి అరుదైన తోకచుక్క కనువిందు చేసింది. ఈ అక్టోబర్ నెలలో భారత్ సహా ఇతర ప్రాంతాల్లో ఈ అరుదైన తోకచుక్క ప్రత్యక్షమైంది. ఈ నెలాఖరులో భూమికి అత్యంత దగ్గరగా రానుంది. కర్ణాటకలోని కొందరు ఫోటోగ్రాఫర్లు ఈ అరుదైన తోకచుక్క దృశ్యాలను తమ కెమెరాల్లో బంధించారు. దీనికి సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్ అయ్యాయి.
ప్రతి 80వేల సంవత్సరాలకు ఒకసారి కనిపించే అరుదైన తోకచుక్క (C/2023 A3)కు సంబంధించిన శుచిన్‌షాన్ – అట్లాస్ పేరుతో పిలుస్తారు. ఈ తోకచుక్క ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఈ వారం ఉత్తర అర్ధగోళంలో ఆకాశంలో కనిపించింది. సుచిన్‌షాన్-అట్లాస్ అనే ఈ తోకచుక్క గత శనివారమే భూమికి సుమారు 44 మిలియన్ మైళ్ల దూరంలోకి వచ్చిందని యూకే బ్రాడ్‌కాస్టర్ స్కై న్యూస్ నివేదిక తెలిపింది.
Comet C/2023 A3 (Tsuchinshan-ATLAS) time lapse from 1847–1937 MST 13 October 2024. Was able to capture the anti tail (and too many headlights). 85mm lens cropped to 16:9 aspect ratio.
Ashurst Lake, Coconino National Forest, Arizona.#comet #astrophotography pic.twitter.com/ubUAkgGjCH
— David Blanchard (@dblanchard_AZ) October 14, 2024
ప్రతి 80ఏళ్లకు ఒకసారి మాత్రమే ఈ అద్భుతమైన తోకచుక్క అంతర్గత సౌర వ్యవస్థకు తిరిగి వస్తుంది. 2023లో మొదటిసారిగా కనుగొన్న ఈ ఖగోళ అద్భుతం.. అత్యంత దీర్ఘవృత్తాకార కక్ష్యలో అంతర్గత సౌర వ్యవస్థలో ప్రవేశించింది. మానవ చరిత్రలోనే మొట్టమొదటి డాక్యుమెంట్ రూపాన్ని కలిగి ఉంది.
ఈ తోకచుక్కను చైనాలోని సుచిన్‌షాన్ లేదా “పర్పుల్ మౌంటైన్” అబ్జర్వేటరీ, దక్షిణాఫ్రికాలోని అట్లాస్ (గ్రహశకలం భూగోళ-ప్రభావం లాస్ట్ అలర్ట్ సిస్టమ్) టెలిస్కోప్‌లోని పరిశీలకులు గుర్తించారు. ప్రపంచవ్యాప్తంగా స్టార్‌గేజర్‌లు తోకచోక ఫొటోలను బంధించారు. యూఎస్ అరిజోనా కొకోనినో నేషనల్ ఫారెస్ట్, రష్యా, మాసిడోనియా, మౌంట్ యరిగాటాకే, జపాన్‌లో కూడా రాత్రిపూట ఆకాశంలో తోకచుక్క కనిపించిన వీడియోలు దర్శనమిచ్చాయి.
Amazing timelapse of comet C/2023 A3 Tschinshan-ATLAS from Mt Mt.Yarigatake, Japan.
[📹 yarigatake3180m]pic.twitter.com/uQMIqdd1ng
— Massimo (@Rainmaker1973) October 15, 2024
Read Also : Bigg Boss 8 : అవినాష్ భార్య గురించి మాట్లాడిన పృథ్వీ.. ఇదేనా నీ సంస్కారం అంటూ వార్నింగ్ ఇచ్చిన అవినాష్