Abdul Khaleque: ఫుట్‭బాల్ లెజెండ్ మెస్సీ భారతీయుడేనట.. ఒక్క ట్వీట్‭తో తేల్చేసిన కాంగ్రెస్ ఎంపీ

మంత్రి వ్యాఖ్యలను గమనించిన నెటిజెన్లు ఊరుకుంటారా.. మెస్సీని భారతీయుడిని చేస్తూ ట్రోల్స్ వేస్తున్నారు. అస్సాం సందప్రదాయంలో తన భార్యతో కలిసి మెస్సీ ఇండియాకు వచ్చినట్లు మీమ్స్ వేస్తుండగా.. కొందరేమో మెస్సీ తన క్లాస్‭మేట్ అని సెటైర్లు వేస్తున్నారు.

Abdul Khaleque: ఫుట్‭బాల్ లెజెండ్ మెస్సీ భారతీయుడేనట.. ఒక్క ట్వీట్‭తో తేల్చేసిన కాంగ్రెస్ ఎంపీ

Congress MP Abdul Khaleque claims Messi was born in Assam

Abdul Khaleque: అర్జెంటీనా ఫుట్‭బాల్ ప్లేయర్, ప్రపంచ దిగ్గజ ఆటగాడు లియోనెల్ మెస్సీ భారతీయుడట. ఈశాన్య రాష్ట్రమైన అస్సాంకు చెందిన వ్యక్తట. మెస్సీ పుట్టింది అస్సాంలోనే అయినప్పటికీ, అర్జెంటీనా వలస వెళ్లి అక్కడే ఉంటున్నాడట. ఈ మాటలు అన్నది కాంగ్రెస్ పార్టీ నేత, లోక్‭సభ సభ్యుడు అబ్దుల్ ఖలెకు. అర్జెంటీనా ఫిఫా ప్రపంచ కప్ గెలిచిన సందర్భంలో శుభాకాంక్షలు చెబుతూ ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ అబ్దుల్ ఈ విషయం వెల్లడించారు. అయితే నెటిజెన్లు దీనిపై వివరాలు అడగడంతో.. ఒక్కసారిగా నాలుక కరుచుకుని ట్వీట్ డిలీట్ చేసుకున్నారు.

Elon Musk: ట్విట్టర్ బాస్‭ ఎలాన్ మస్క్‭కు షాక్.. మస్క్ అడిగిన ప్రశ్నకు దిమ్మతిరిగే జవాబిచ్చిన నెటిజెన్లు

అస్సాంలోని బర్పెట లోక్‭సభ నుంచి ఎంపీగా గెలిచిన అబ్దుల్ ఖలెకు అనే కాంగ్రెస్ నేత సోమవారం ఉదయం ఒక ట్వీట్ చేశారు. ఫిఫా ప్రపంచ కప్‭తో ఉన్న మెస్సీ ఫొటోను షేర్ చేస్తూ ‘‘కోట్లాది హృదయాల నుంచి అభినందనలు. మీకు అస్సాం మూలాలు ఉన్నందుకు మేము చాలా గర్విస్తున్నాం’’ అని ట్వీట్ చేశారు. ఇందులో మెస్సీ అనే హ్యాష్‭ట్యాగ్ ఇవ్వడంతో పాటు టీం మెస్సీ అకౌంట్ ట్యాగ్ చేశారు. అయితే ఒక నెటిజెన్ దీనిపై ఆశ్చర్య వ్యక్తం చేస్తూ అస్సాం మూలాల గురించి ప్రశ్నించగా ‘‘అవును, అతడు పుట్టింది అస్సాంలోనే’’ అని సమాధానం చెప్పారు.

Same-Sex Marriages: ఇద్దరు జడ్జీలు నిర్ణయించలేరు.. స్వలింగ సంపర్కుల వివాహంపై బీజేపీ ఎంపీలు

మంత్రి వ్యాఖ్యలను గమనించిన నెటిజెన్లు ఊరుకుంటారా.. మెస్సీని భారతీయుడిని చేస్తూ ట్రోల్స్ వేస్తున్నారు. అస్సాం సందప్రదాయంలో తన భార్యతో కలిసి మెస్సీ ఇండియాకు వచ్చినట్లు మీమ్స్ వేస్తుండగా.. కొందరేమో మెస్సీ తన క్లాస్‭మేట్ అని సెటైర్లు వేస్తున్నారు. పాపం.. తప్పులో కాలేశారని ఎవరైనా చెప్పారో లేదంటే ఆయనే గ్రహించారో కానీ, కాసేపటి తన ట్వీట్ డిలీట్ చేసుకున్నారు ఎంపీ అబ్దుల్. కానీ, అప్పటికే జరగాల్సిందంతా జరిగింది. ట్వీట్ స్క్రీన్ షాట్ తీసిన నెటిజెన్లు దాన్ని సోషల్ మీడియాలో వదిలి జోకులు వేసుకుంటున్నారు.