ఎఫ్-16ను భారత్ కూల్చివేయలేదు : అమెరికా మేగజైన్ కథనం
ఎఫ్-16 కూల్చివేతపై మళ్లీ వివాదం మొదలైంది. ఇప్పటికే దీనిపై భారత్, పాకిస్తాన్ భిన్న వాదనలు వినిపిస్తుంటే.. తాజాగా అగ్రరాజ్యంలోని ఓ మేగజైన్ సంచలన కథనాన్ని ప్రచురించింది.

ఎఫ్-16 కూల్చివేతపై మళ్లీ వివాదం మొదలైంది. ఇప్పటికే దీనిపై భారత్, పాకిస్తాన్ భిన్న వాదనలు వినిపిస్తుంటే.. తాజాగా అగ్రరాజ్యంలోని ఓ మేగజైన్ సంచలన కథనాన్ని ప్రచురించింది.
ఎఫ్-16 కూల్చివేతపై మళ్లీ వివాదం మొదలైంది. ఇప్పటికే దీనిపై భారత్, పాకిస్తాన్ భిన్న వాదనలు వినిపిస్తుంటే.. తాజాగా అగ్రరాజ్యంలోని ఓ మేగజైన్ సంచలన కథనాన్ని ప్రచురించింది. పాక్‌లోని ఎఫ్-16 ఫ్లైట్లన్నీ సేఫ్ అంటూ ప్రకటించింది. దీనిపై భారత వాయుసేన భగ్గుమంది. తాము కూల్చివేసింది ఎఫ్-16 విమానాన్నే అంటూ క్లారిటీ ఇచ్చింది. మరి… పాక్ ఎందుకు ఇంకా బుకాయిస్తోంది? అమెరికాలోని మేగజైన్ ఆ కథనాన్ని ఎందుకు ప్రచురించింది?
భారత్ -పాకిస్థాన్ మధ్య మరో వివాదానికి తెరలేసింది. భారత్ అంత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఎయిర్ స్ట్రైక్‌పై ఇప్పటికీ భిన్నవాదనలు వినిపిస్తున్నాయి. బాలాకోట్‌లో ఎయిర్ స్ట్రైక్ జరిగిన మరునాడే పాక్‌కు చెందిన జెట్ ఫైటర్ ఎఫ్-16 విమానాన్ని భారత వైమానిక వింగ్ కమాండర్ అభినందన్ వర్థమాన్ కూల్చివేశాడని భారత అధికారులు ప్రకటించారు. ఇందుకు సంబంధించి పాకిస్తాన్ అంగికరించకపోతే విమాన శకలాలను సైతం మీడియా ముందు ప్రదర్శించారు.
Read Also : సీఎం కేసీఆర్ కు కొత్త పాస్ పోర్టు
తాజాగా అమెరికాకి చెందిన ఫారిన్ పాలసీ మేగజైన్ కూడా అదంతా అబద్ధమంటూ కలకలం రేపింది. ఎఫ్-16 యుద్ధ విమానాన్ని తాము వాడలేదంటూ చెప్పుకొస్తున్న పాకిస్థాన్ వాదనకు మద్దతు పలుకుతూ సంచలన కథనాన్ని ప్రచురించింది. అమెరికా రక్షణరంగ నిపుణులు ఇస్లామాబాద్‌లోని ఎఫ్-16 ఫ్లైట్లని లెక్కించారని.. వారిలో ఇద్దరు అధికారులు పాకిస్తాన్‌కి తాము సరఫరా చేసిన ఎఫ్-16 నిక్షేపంగా ఉన్నాయని, ఒక్కటి కూడా మిస్ కాలేదని చెప్పారని ఆ కథనంలో రాసుకొచ్చింది.
అయితే.. వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ ఎఫ్-16ని వెంటాడుతూనే పాక్ భూభాగంలోకి వెళ్లిందన్నది వాస్తవం..ఆ క్రమంలోనే తాను నడుపుతున్న మిగ్ 21 కూలిపోయిన సంగతీ నిజమే. మరి అభినందన్ కూల్చింది ఎఫ్-16 కాదంటే… మరే యుద్ధ విమానాన్ని అతడు కూల్చివేశాడు? అభినందన్ విడుదల తర్వాత భారత వైమానిక అధికారులు మీడియాకు చూపించిన విమాన శకలాలు ఎక్కడివి ? అమెరికా అధికారులు ఎఫ్-16 విమానాలు కూల్చబడలేదని ఎందుకు చెబుతున్నారు అనే అనుమానాలు తలెత్తాయి. దీంతో భారత వాయుసేన మరోసారి స్పందించింది.
అమెరికా మేగజైన్ కథనానికి ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ గట్టిగా బదులిచ్చింది. ఫిబ్రవరి 27న జరిగిన పోరాటంలో తాము కూల్చింది ఎఫ్-16 విమానాన్నే అని పునరుద్ఘాటించింది. నౌషేరా సెక్టార్ లో తమ మిగ్-21 బైసన్ విమానం పాక్ కు చెందిన ఎఫ్-16తో హోరాహోరీతో తలపడి దాన్ని కూల్చివేసిందని తెలిపింది. ఎఫ్-16 తయారీదారైన అమెరికాను నమ్మించేందుకే పాకిస్తాన్ విశ్వ ప్రయత్నాలు చేస్తోందని తేల్చిచెప్పింది.
ఫారిన్ పాలసీ కథనంపై అమెరికా మాత్రం ఇప్పటివరకు స్పందించలేదు. దీనికి కారణాలేంటన్నదే ఇపుడు ప్రశ్నార్థకంగా మారింది. శత్రుదుర్బేధ్యంగా వర్ణించుకునే ఎఫ్16ని.. ఓ మిగ్ విమానం కూల్చేసిందనే వాస్తవాన్ని ఒప్పుకోవడం ఇష్టంలేకనా? లేదంటే.. తమ ఎఫ్-16 విమానాల సామర్ధ్యంపై సందేహం కలిగితే.. వ్యాపారం దెబ్బతింటుందని భయపడుతోందా అనే సందేహాలు కలుగుతున్నాయి.
Read Also : హత్య చేసి శవంతో సెల్ఫీ : గంజాయి మత్తులో యువకుడి కిరాతకం