Copy-Paste చేస్తున్నారా? మీ కొంప ముంచుతుంది జాగ్రత్త..!

  • Published By: sreehari ,Published On : February 27, 2020 / 02:08 AM IST
Copy-Paste చేస్తున్నారా? మీ కొంప ముంచుతుంది జాగ్రత్త..!

ఏదైనా టైప్ చేయాలంటే సమయం పట్టొచ్చు. కానీ కాపీ, పేస్ట్ చేయడానికి క్షణం పట్టదు. ఇట్టే కాపీ చేయడం.. అట్టా పేస్ట్ చేయడం ఎంతో సులువో.. కష్టం లేని కదా అని అనుకుంటుంటారు. ఏదైనా కనిపిస్తే చాలు.. గుట్టుచప్పుడు కాకుండా కాపీ పేస్ట్ చేస్తుంటారు. ఇలా చేస్తూ పోతే మీ కొంప ముంచుతుంది జాగ్రత్త అంటున్నారు టెక్ నిపుణులు. మీ డేటాను సైబర్ మోసగాళ్లకు మీరే స్వయంగా వారికి అప్పచెప్పినట్టేనట.. అవసరం ఉన్నా లేకున్నా ఎక్కడో ఒకచోట ఇదోదో పనికొచ్చేలా ఉందికదాని తెగ కాపీ చేసేస్తుంటారు.

దాన్ని తమ డేటాలో సేవ్ చేస్తుంటారు. ఇలా చేయడం వల్ల మీకు తెలియకుండానే మీ డేటాను సైబర్ మోసగాళ్లు కాజేస్తున్నారట. దీనికి ప్రత్యక్ష ఉదాహరణ.. ఆపిల్ ఐఓఎస్.. ప్రపంచ టెక్ దిగ్గజమైన సామాన్యుడు కొనలేని అత్యంత ఖరీదైన ఐఫోన్ లోనే ఈ లోపం బయటపడిందంట. ఆపిల్ ఐఓఎస్ లోని కాపీ, పేస్ట్ ఆప్షన్ లోనే లోపాన్ని గుర్తించినట్టు ఇద్దరు సాఫ్ట్ వేర్ డెవలపర్లు గుర్తించారు. 

అందులో ఒకరు కెనడాకు చెందినవారు కాగా, మరొకరు జర్మనీకి చెందినవారు. ఈ లోపం కారణంగా ఐఫోన్, ఐప్యాడ్ యూజర్ల వ్యక్తిగత సమాచారమంతా లీక్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని హెచ్చరిస్తున్నారు. ఐఓఎస్ యాప్ నుంచి ఎవరైనా ఏదైనా సమాచారాన్ని కాపీ చేస్తున్నప్పుడు ఈ సమస్య ఎదురోవుతున్నట్టు టామీ మైస్క్, తలాల్ హజ్ బాక్రే అనే ఈ ఇద్దరు డెవలపర్లు తెలిపారు.

మీరు ఏదైనా సమాచారాన్ని కాపీ చేసినప్పుడు మరో యాప్‌లో ఇన్ఫోను పేస్ట్ చేయడానికి ముందే కొన్ని యాప్స్ ఓపెన్ అయిపోతున్నట్టు గుర్తించారు. మాలసియాస్ యాప్ ద్వారా మీ ప్రైవేట్ డేటాను హ్యాకర్లు తస్కరించే అవకాశం ఉందని మైస్క్ అభిప్రాయపడ్డారు. మీరు పేస్ట్ చేసిన బోర్డుపై ఫొటోలు, పీడీఎఫ్, టెక్స్ట్, పాస్‌వర్డులు కూడా లీక్ అవుతున్నట్టు ఇద్దరు డెవలపర్లు గుర్తించారు. ఒకవేళ మీరు మీ బ్యాంకు అకౌంట్ నెంబర్ లేదా ఏదైనా ప్రైవేట్ సమాచారాన్ని ఇతర యాప్స్ లో కాపీ, పేస్ట్ చేస్తున్నట్టు అయితే అవి లీక్ అవుతాయని హెచ్చరిస్తున్నారు.