కరోనా : నవంబర్ నాటికి చైనా వ్యాక్సిన్

  • Published By: madhu ,Published On : September 15, 2020 / 01:26 PM IST
కరోనా : నవంబర్ నాటికి చైనా వ్యాక్సిన్

Updated On : September 15, 2020 / 2:12 PM IST

నవంబర్ నాటికి సాధారణ ప్రజలకు కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందని చైనా సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) అధికారి ఒకరు వెల్లడించారు. ప్రస్తుతం ఆ దేశంలో నాలుగు కరోనా వైరస్ వ్యాక్సిన్ లు తయారవుతున్నాయి. క్లినికల్ ట్రయల్స్ లో ఉన్న ఈ వ్యాక్సిన్లను అత్యవసర సేవలు అందిస్తున్న వారికి ఇచ్చినట్లు తెలిపారు.



https://10tv.in/india-china-border-standoff-why-chushul-sub-sector-is-crucial-for-indian-army/
జులై నెలలో వ్యాక్సిన్ లు ఇచ్చామని, థర్డ్ ట్రయల్స్ సజావుగా సాగుతున్నాయన్నారు. తాను మొదట ఈ వ్యాక్సిన్ తీసుకున్నట్లు, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ రాలేదన్నారు. ఔషధ దిగ్గజం చైనా నేషనల్ ఫార్మాస్యూటికల్ గ్రూప్ (సినోఫార్మ్), యూఎస్‌ కాన్సినో బయోలాజిక్స్ 6185 చే అభివృద్ధి చేయబడుతున్న నాలుగవ కోవిడ్‌-19 వ్యాక్సిన్‌ను చైనా సైన్యం ఉపయోగించడానికి జూన్‌ నెలలో ప్రభుత్వం ఆమోదం తెలిపింది.



మూడవ దశ క్లినికల్‌ ట్రయల్స్‌ ముగిసిన తరువాత 2020 చివరి నాటి ఈ వ్యాక్సిన్‌ను ప్రజలకు అందుబాటులోకి తెస్తామని సినోఫార్మ్‌ జూలైలోనే ప్రకటించింది. వైరస్‌ నిర్మూలనలో భాగంగా వ్యాక్సిన్‌ను కనిపెట్టడానికి ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాలు పోటీ పడుతున్నాయి. ఇప్పటికే రష్యా ఒక వ్యాక్సిన్‌ను ప్రజలకు అందుబాటులోకి తెచ్చిన విషయం తెలిసిందే. కానీ ఈ టీకాపై పలు విమర్శలు చెలరేగుతున్నాయి.