North Korea Corona Terror : 7 రోజుల్లో 10లక్షల కరోనా కేసులు.. ఆ దేశంలో కొవిడ్ కల్లోలం

కరోనా మహమ్మారి అక్కడ విలయతాండవం చేస్తోంది. జెట్ స్పీడ్ తో వ్యాపిస్తూ.. ప్రజలకు, ప్రభుత్వానికి కంటి మీద కనుకు లేకుండా చేస్తోంది. 7 రోజుల్లో 10 లక్షలు కేసులు వచ్చాయంటే..(North Korea Corona Terror)

North Korea Corona Terror : రెండేళ్లుగా తమ దేశంలో ఒక్క కరోనా కేసూ రాలేదని గొప్పగా చెప్పుకున్న ఆ దేశం ఇప్పుడు మహమ్మారి దెబ్బకి చిగురుటాకులా వణికిపోతోంది. కరోనా మహమ్మారి అక్కడ విలయతాండవం చేస్తోంది. జెట్ స్పీడ్ తో వ్యాపిస్తూ.. ప్రజలకు, ప్రభుత్వానికి కంటి మీద కనుకు లేకుండా చేస్తోంది. అదే ఉత్తర కొరియా. అవును.. నార్త్ కొరియాను కరోనా మహమ్మారి షేక్ చేస్తోంది. తమ దేశంలో తొలి కరోనా కేసు గుర్తించినట్లు ఉత్తర కొరియా వారం క్రితం ప్రకటించగా.. ఏడు రోజుల్లోనే ఆ సంఖ్య 10 లక్షలు దాటింది.

అయితే, ఉత్తర కొరియా ప్రభుత్వం దాన్ని జ్వరంగా పిలుస్తోంది. దేశంలో 10 లక్షల మంది జ్వరంతో బాధపడుతున్నారని నార్త్ కొరియా ప్రభుత్వం ప్రకటించింది. ఈ లక్షణాలతోనే వారికి కోవిడ్ సోకినట్లు భావిస్తున్నారు. ఇప్పటివరకు 50 మంది ప్రాణాలు కోల్పోయారు. కఠినమైన లాక్ డౌన్ అమలు చేస్తున్నా.. ప్రజలెవరికీ వ్యాక్సిన్ వేయించకపోవడం వల్ల కేసులు వేగంగా పెరుగుతున్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.(North Korea Corona Terror)

Kim Jong-un : ఉత్తరకొరియాలో మూడురోజుల్లో 8,20,000లకు పైగా కేసులు నమోదు..

ఇంత జరుగుతున్నా.. ఉత్తర కొరియాలో కరోనా పరీక్షలు చేసే అవకాశం లేదని అధికారులు చెబుతున్నారు. లక్షణాల ఆధారంగానే వైరస్‌ను నిర్ధారిస్తున్నామంటున్నారు. ఇప్పటివరకు 10 లక్షల మందికి లక్షణాలున్నట్లు గుర్తించారు. కరోనా వల్ల 50 మంది మరణించినట్లు అధికారిక ప్రకటన వచ్చింది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.

మరోవైపు ఉత్తర కొరియాలో పరిస్థితి చేయి దాటి పోకుండా లాక్‌డౌన్ విధించారు. ఆ దేశ అధినేత కిమ్ ఎమర్జెన్సీ పొలిట్ బ్యూరో సమావేశం నిర్వహించారు. దేశంలో కరోనా పరిస్థితులపై చర్చించారు. పరిస్థితి చేయి దాటకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మందుల సరఫరాలో అధికారుల నిర్లక్ష్యంపై కిమ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే సరైన చర్యలు తీసుకోవాలన్నారు.

Kim Jong-un: మారని కిమ్.. నో వ్యాక్సిన్ అట.. అణుబాంబు వేస్తే కరోనా పోతుందా ఏంది..

కరోనా మహమ్మారి తగ్గినట్టే తగ్గి మళ్లీ విజృంభిస్తోంది. పలు దేశాలను వణికిస్తోంది. రోజురోజుకు కేసులు రెట్టింపు అవుతున్నాయి. మరో వేవ్‌ వస్తుందా అన్న భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ సైతం అప్రమత్తంగా ఉండాలంటోంది. ప్రతి ఒక్కరూ నిబంధనలు, జాగ్రత్తలు పాటించాలని సూచిస్తోంది. కరోనా వైరస్ కు పుట్టినిల్లు అయినా చైనాలోనూ కరోనా మహమ్మారి కల్లోలం సృష్టించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఉత్తర కొరియాను బెంబేలెత్తిస్తోంది.

రెండేళ్లగా ప్రపంచమంతా కరోనాతో అల్లాడుతోంది. చైనాలోని వుహాన్‌లో తొలి కేసు నమోదైన దగ్గరి నుంచి ఇప్పటిదాకా అనేక దేశాలు కరోనా ఉత్పాతాన్ని చవిచూశాయి. కోట్ల కేసులు, లక్షల మరణాలు, లాక్‌డౌన్లు, ఐసొలేషన్లతో యావత్ ప్రపంచం తల్లడిల్లిపోయింది. ఆర్థిక వ్యవస్థలు కునారిల్లిపోయాయి. ఇప్పుడిప్పుడే కరోనా కల్లోలం నుంచి ప్రపంచం కాస్తకాస్తగా కోలుకుంటోంది. అయినా వైరస్ పుట్టినిల్లయిన చైనాతో పాటు మరికొన్ని దేశాల్లో ఇంకా కరోనా తీవ్రత తగ్గలేదు. సెకండ్ వేవ్, థర్డ్ వేవ్‌లను తప్పించుకున్న చైనా ఇప్పుడు ఒమిక్రాన్ కట్టడికి కనీవినీ ఎరుగని కఠిన ఆంక్షలు విధిస్తోంది. బీజింగ్, షాంఘై వంటి నగరాల ప్రజలు ఆంక్షలతో దుర్భర జీవితం గడుపుతున్నారు.

ట్రెండింగ్ వార్తలు