Kim Jong-un: మారని కిమ్.. నో వ్యాక్సిన్ అట.. అణుబాంబు వేస్తే కరోనా పోతుందా ఏంది..

ఉత్తర కొరియాను కరోనా వైరస్ అతలాకుతలం చేస్తుంది. మూడు రోజుల్లో ఎనిమిది లక్షల మంది వైరస్ బారిన పడ్డారు. 42మంది మృత్యువాత పడ్డారు. పరిస్థితి ఇలానే ఉంటే ఇది తీవ్ర మానవతా సంక్షోభానికి దారితీసే అవకాశం ఉందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు..

Kim Jong-un: మారని కిమ్.. నో వ్యాక్సిన్ అట.. అణుబాంబు వేస్తే కరోనా పోతుందా ఏంది..

Kim Jong Un

Kim Jong-un: ఉత్తర కొరియాను కరోనా వైరస్ అతలాకుతలం చేస్తుంది. మూడు రోజుల్లో ఎనిమిది లక్షల మంది వైరస్ బారిన పడ్డారు. 42మంది మృత్యువాత పడ్డారు. పరిస్థితి ఇలానే ఉంటే ఇది తీవ్ర మానవతా సంక్షోభానికి దారితీసే అవకాశం ఉందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు ఆ దేశ అధ్యక్షుడు కిమ్‌ జోంగ్‌ ఉన్‌ చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేస్తున్నప్పటికీ ఫలితం లేకుండా పోతుంది. మూడు రోజుల్లోనే వైరస్ వ్యాప్తి అతలాకుతలం చేసిందంటే కట్టడి చేయడంలో ఆలస్యమైతే ఆ దేశ ప్రజలు పిట్టల్లా రాలిపోయే ప్రమాదం లేకపోలేదు.

North Korea: ఉత్తరకొరియాలో కరోనా వైరస్ స్వైరవిహారం.. వణికిపోతున్న కిమ్ జోంగ్-ఉన్ అడ్డా..

ప్రస్తుతం ఉత్తర కొరియాకు ఈ పరిస్థితి రావడానికి ఆ దేశ అధ్యక్షుడు కిమ్ నే కారణమన్న వాదన బలంగా వినిపిస్తుంది. కిమ్ నియంత పోకడ చివరికి ప్రజల ప్రాణాల మీదకు వచ్చింది. గత రెండేళ్లుగా ప్రపంచ వ్యాప్తంగా వైరస్ విజృంభిస్తుంది. అయితే ప్రస్తుతం చైనా, ఉత్తర కోరియా మినహా అన్ని దేశాల్లో కొవిడ్ అదుపులోకి వచ్చినట్లు కనిపిస్తుంది. ఉత్తర కొరియాలో ఇప్పటి వరకు కరోనా వైరస్ ఆనవాళ్లు కనిపించలేదు. రెండేళ్లు ఎలాంటి ఆంక్షలు విధించాల్సిన అవసరం ఆ దేశంలో ఏర్పడలేదు. అయితే రెండేళ్ల తరువాత ప్రపంచ వ్యాప్తంగా కొవిడ్ వ్యాప్తి తగ్గుతుందనుకుంటున్న సమయంలో ఉత్తర కొరియాను కరోనా వైరస్ అతలాకుతలం చేస్తోంది. ఏడాది క్రితం ఆ దేశ ప్రజలకు వ్యాక్సిన్ వేయించాల్సిందిగా ప్రపంచ ఆరోగ్య సంస్థ అధ్యక్షుడు కిమ్‌ జోంగ్‌ ఉన్‌కు సూచించింది. చైనా అయితే ఉచితంగా మేమే వ్యాక్సిన్ వేస్తామని తెలిపింది. కానీ కిమ్‌ జోంగ్‌ ఉన్‌ మాత్రం వారి సూచనలేమీ పట్టించుకోలేదు. మేము సపరేట్ మాకు వ్యాక్సిన్ అవసరం లేదని తెగేసి చెప్పాడు.

North Korea Lock Down : ఉత్తరకొరియాలో కఠిన లాక్‌‌డౌన్.. కిమ్ అడ్డాలో తొలి కరోనా కేసు..!

ప్రస్తుతం ఉత్తర కొరియాలో కొవిడ్ వ్యాప్తి వేగంగా జరుగుతుంది. ఈ క్రమంలో పలు దేశాలు కరోనా వ్యాక్సిన్ ప్రక్రియను మొదలు పెట్టాలని కిమ్ కు సూచిస్తున్నాయి. కానీ కిమ్ మాత్రం వారి ప్రతిపాదనలు ఏమీ పట్టించుకోవటం లేదు. ఒకపక్క వైరస్ తో ప్రజలు మృతి చెందుతుంటే కిమ్ మాత్రం నియంత పోకడను కొనసాగిస్తూ ప్రజలకు వ్యాక్సిన్ ఇచ్చేందుకు ముందుకు రావడం లేదు. కిమ్ పోకడను చూస్తున్న ప్రపంచ దేశాలు.. కరోనా అంటే అణుబాంబు వేస్తే పోయేది కాదు కిమ్.. వ్యాక్సిన్ వేయాల్సిందే అంటూ సెటైర్లు వేస్తున్నారు.