North Korea Lock Down : ఉత్తరకొరియాలో కఠిన లాక్‌‌డౌన్.. కిమ్ అడ్డాలో తొలి కరోనా కేసు..!

North Korea Lock Down : నార్త్ కొరియా నియంత అడ్డాలో తొలి ఒమిక్రాన్ కేసు నమోదైంది. వెంటనే ఉత్తరకొరియాలో కఠిన లాక్ డౌన్ విధిస్తున్నట్టు ఆ దేశాధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ ఆదేశాలు జారీ చేశారు.

North Korea Lock Down : ఉత్తరకొరియాలో కఠిన లాక్‌‌డౌన్.. కిమ్ అడ్డాలో తొలి కరోనా కేసు..!

North Korea Reports First Covid Outbreak With Omicron Case, Kim Orders Lockdown

North Korea Lock Down : నార్త్ కొరియా నియంత అడ్డాలో తొలి ఒమిక్రాన్ కేసు నమోదైంది. వెంటనే ఉత్తరకొరియాలో కఠిన లాక్ డౌన్ విధిస్తున్నట్టు ఆ దేశాధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ ఆదేశాలు జారీ చేశారు. ఉత్తర కొరియాలో మొదటి ఒమిక్రాన్ కేసును గుర్తించినట్టు ఉత్తరకొరియా మీడియా అధికారికంగా ధృవీకరించింది. ప్యోంగ్యాంగ్ నగరంలో అత్యంత వేగంగా వ్యాపించే ఒమిక్రాన్ వైరస్ ఉప-వేరియంట్ వ్యాప్తిని కనుగొన్నట్టు రాష్ట్ర మీడియా నివేదించింది. ఈ నేపథ్యంలో అధ్యక్షుడు కిమ్ అన్ని నగరాల్లో జాతీయంగా కఠినంగా లాక్‌డౌన్‌ అమలుకు ఆదేశించారు.

దేశంలోనే అతిపెద్ద ఎమర్జెన్సీగా ప్రకటించిన కిమ్.. ఒమిక్రాన్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు క్వారంటైన్ తప్పనిసరి చేశారు. ఫిబ్రవరి 2020 నుంచి గత రెండు ఏళ్లలో మూడు నెలలుగా క్వారంటైన్ కొనసాగుతూనే ఉందని అధికారిక KCNA వార్తా సంస్థ తెలిపింది. ప్యోంగ్యాంగ్‌లో ఒమిక్రాన్ కేసులు లేదా ఇన్‌ఫెక్షన్‌‌కు దారితీసే మూలాలపై పూర్తి స్థాయిలో వివరాలను అందించలేదు. కానీ, ఒమిక్రాన్ వేరియంట్‌ తొలి కేసు నమోదైనట్టు ఓ నివేదిక పేర్కొంది. ఒమిక్రాన్ సోకిన వ్యక్తుల శాంపిల్స్ మే 8న సేకరించినట్లు తెలిపింది. కరోనావైరస్ మొదటి కేసు నమోదు కావడంతో అప్రమత్తమైన అధ్యక్షుడు కిమ్.. వెంటనే వర్కర్స్ పార్టీ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. దేశంలో ఒమిక్రాన్ కట్టడికి అవసరమైన చర్యలపై ఆయన సమావేశంలో చర్చించినట్టు నివేదిక తెలిపింది.

North Korea Reports First Covid Outbreak With Omicron Case, Kim Orders Lockdown (1)

North Korea Reports First Covid Outbreak With Omicron Case, Kim Orders Lockdown

కరోనావైరస్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు.. దేశంలోని అన్ని నగరాలు, కౌంటీలు తమ ప్రాంతాలను కచ్చితంగా లాక్ డౌన్ చేయాలని కిమ్ ఆదేశించారు. KCNA ప్రకారం.. అత్యవసర రిజర్వ్ వైద్య సదుపాయాలు అందిస్తామని కిమ్ అధికార యంత్రాంగం తెలిపింది. దేశంలో తొలి కరోనా కేసుపై నార్త్ కొరియా అధికారికంగా ధృవీకరించకపోవడంపై దక్షిణ కొరియా యునైటెడ్ స్టేట్స్‌లోని అధికారులు సందేహం వ్యక్తం చేశారు. ప్రత్యేకించి ఒమిక్రాన్ వేరియంట్ కేసులు దక్షిణ కొరియా, చైనాలో ఎక్కువగా నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఉత్తర కొరియా COVAX గ్లోబల్ COVID-19 వ్యాక్సిన్-షేరింగ్ ప్రోగ్రామ్ చైనా నుంచి సినోవాక్ బయోటెక్ వ్యాక్సిన్ దిగుమతులను తిరస్కరించింది.

కరోనావైరస్ వ్యాప్తిని నియంత్రించాలంటే తక్కువ వ్యవధిలో వ్యాప్తిచేసే వేరియంట్ మూలాన్ని గుర్తించాల్సిన అవసరం ఉందని కిమ్ అభిప్రాయపడ్డారు. కరోనా సోకిన వ్యక్తులకు త్వరగా చికిత్స అందించి కోలుకునేలా చేయడమే ఎమర్జెన్సీ క్వారంటైన్ సిస్టమ్ ఉద్దేశ్యమని కిమ్ వర్కర్స్ పార్టీ సమావేశంలో చెప్పినట్టు KCNA తెలిపింది. ప్యోంగ్యాంగ్‌లోని కార్యకలాపాలను పర్యవేక్షిస్తున్న దక్షిణ కొరియా ఆధారిత వెబ్‌సైట్ ప్రకారం.. ఈ వారమంతా అక్కడి వారంతా ఇంట్లోనే ఉండమని సూచించింది. చైనీస్ స్టేట్ టెలివిజన్ ఉత్తర కొరియా దేశ ప్రజలను మే 11 నుంచి ఇంట్లోనే ఉండాలని కోరిందని నివేదించింది. ఎందుకంటే వారిలో చాలా మందిలో కరోనా అనుమానిత లక్షణాలు ఉన్నాయని తెలిపారు.

Read Also : China president: చైనా అధ్యక్షుడికి వింత వ్యాధి.. మెదడులో రక్తనాళాలు ఎప్పుడైనా..