China president: చైనా అధ్యక్షుడికి వింత వ్యాధి.. మెదడులో రక్తనాళాలు ఎప్పుడైనా..
చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ వింత వ్యాధితో బాధపడుతున్నాడు. మెదడుకు సంబంధించిన సెరిబ్రల్ అనూరిజంతో బాధపడుతున్నట్లు చైనా మీడియా వెల్లడించింది. ఈ వ్యాధి కారణంగా గతేడాది చివరిలో జీ జిన్‌పింగ్ ఆస్పత్రిలో చేరినట్లు ...

China president: చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ వింత వ్యాధితో బాధపడుతున్నాడు. మెదడుకు సంబంధించిన సెరిబ్రల్ అనూరిజంతో బాధపడుతున్నట్లు చైనా మీడియా వెల్లడించింది. ఈ వ్యాధి కారణంగా గతేడాది చివరిలో జీ జిన్‌పింగ్ ఆస్పత్రిలో చేరినట్లు స్థానిక మీడియా తెలిపింది. 2019 మార్చిలోనే జిన్‌పింగ్‌కు ఈ వ్యాధి ఉన్నట్లు బయటపడింది. చైనా అధ్యక్షుడు ఇటలీ పర్యటనలో ఇబ్బంది ఎదుర్కొన్నారు. ఆ తర్వాత ఫ్రాన్స్ పర్యటనలో కూడా కూర్చోవడానికి చాలా ఇబ్బంది పడ్డాడు. ఈ క్రమంలో తాను ఎదుర్కొంటున్న ఆరోగ్యం సమస్యపై పలురకాల పరీక్షలు నిర్వహించగా సెరిబ్రల్ అనూరిజంతో బాధపడుతున్నట్లు వైద్యులు గుర్తించారు.
China Covid : చైనాలో కోవిడ్ ఆంక్షలు అమలు చేయకపోతే కేసులు, మరణాలు పెరుగుతాయి
2020లో షెన్‌జెన్‌లో ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తున్నప్పుడు జిన్‌పింగ్ దగ్గుతో చాలా ఇబ్బంది పడ్డారు. ఈ క్రమంలో జిన్‌పింగ్ అనారోగ్యంతో బాధపడుతున్నట్లు ప్రచారం మొదలైంది. అయితే జిన్‌పింగ్ మాత్రం ఈ వ్యాధికి చికిత్స నిమిత్తం 2021 చివరిలో ఆస్పత్రిలో చేరినట్లు చైనా మీడియా వెల్లడించింది. జిన్‌పింగ్ ఎదుర్కొంటున్న సెరిబ్రల్ అనూరిజం అనే వ్యాధి చాలా ప్రమాదకరమైందని వైద్యులు పేర్కొన్నట్లు స్థానిక మీడియా పేర్కొంది. సెరిబ్రల్, ఇంట్రాక్రానియల్ అనూరిజం అనేది మెదడులోని ధమని అసాధారణ ఫోకల్ డైలేషన్. దీని ఫలితంగా రక్తనాళాల గోడ లోపలి కండరాల పొర బలహీనపడుతుంది. దీంతో మెదడులో రక్తం ప్లాట్ అవుతుంది. దీనికితోడు మెదడులోని రక్తనాళాలు ఎప్పుడు పగిలిపోతాయో కూడా చెప్పలేం. మెదడు చుట్టూ రక్తస్రావం అవుతుంది. దీన్ని సబ్ అరాక్నోయిడ్ హెమరేజ్ అంటారు.
China: చైనా కీలక నిర్ణయం.. 5కోట్ల కంప్యూటర్లను పక్కనపడేయనున్న ప్రభుత్వం!
ఈ రక్తస్రావం కారణంగా సదరు వ్యక్తి స్ట్రోక్ లేదా కోమాలోకి వెళ్లిపోవడం, మరణించడం కూడా జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అక్కడి వైద్యులు తెలిపినట్లు చైనా మీడియా వెల్లడించింది. అయితే ఈ వ్యాధితో బాధపడుతున్న జిన్‌పింగ్ వైద్యుల సమక్షంలో చికిత్స పొందుతున్నట్లు తెలుస్తోంది. ఈ కారణంగా దేశలో కరోనా విజృంభిస్తున్నప్పటి నుంచి బీజింగ్ వింటర్ ఒలింపిక్స్ వరకు కూడా జిన్ పింగ్ విదేశీ నాయకులను ఎవర్నీ కలవలేదని స్థానిక మీడియా పేర్కొంది.
1Anemia : రక్తహీనతకు దారితీసే పోషకాహార లోపం!
2Navjot Singh Sidhu: జైలులో క్లర్కుగా మారిన సిద్ధూ.. మూడు నెలల తర్వాతే జీతం
3Terror Funding Case : యాసిన్ మాలిక్‌కి జీవిత ఖైదు విధించిన ఎన్ఐఏ కోర్ట్
4Yasin Malik: టెర్రర్ ఫండింగ్ కేసులో యాసిన్ మాలిక్ అరెస్ట్
5Rahul Gandhi: రాహుల్ గాంధీ చెప్పాపెట్టకుండా లండన్ వెళ్లారు: విదేశీ వ్యవహారాలశాఖ
6Captain Abhilasha Barak: ఆర్మీ ఏవియేషన్ కార్ప్స్లో మొట్టమొదటి మహిళా యుద్ధ వైమానిక చోదకురాలిగా అభిలాష బరాక్
7Kerala Actress: నటితో పోలీసు అసభ్య ప్రవర్తన.. దర్యాప్తు
8Vijayawada : ఇంద్రకీలాద్రిపై హనుమాన్ జయంతి వేడుకలు
9Vikram: విక్రమ్ సెన్సార్ రిపోర్ట్.. రన్‌టైమ్ ఎంతంటే?
10Japanese Man: కుక్కగా మారిపోయేందుకు రూ.12లక్షలు ఖర్చు పెట్టిన జపాన్ వ్యక్తి
-
Naga Chaitanya: థ్యాంక్ యూ టీజర్ టాక్.. తనను తాను సరిచేసుకునే ప్రయాణం!
-
PM Modi Gift: జపాన్ ప్రదానికి మోదీ ఇచ్చిన ‘రోగన్ పెయింటింగ్ చెక్కపెట్టె’ గురించి తెలుసా
-
Dawood Ibrahim: దావూద్ ఇబ్రహీం తన తోబుట్టువులకు, బంధువులకు నెల నెలా రూ.10 లక్షలు పంపాడు: ఈడీ
-
Naga Chaitanya: ఆ డైరెక్టర్‌తో బొమ్మరిల్లు కడతానంటోన్న చైతూ!
-
Heart : వీటితో గుండెకు నష్టమే?
-
Lungs : ఊపిరితిత్తుల్లో నీరు ప్రాణాంతకమా?
-
Nani: నేచురల్ స్టార్‌ను ఊరమాస్‌గా మార్చనున్న డైరెక్టర్..?
-
Pawan Kalyan : కోనసీమ జిల్లా పేరు మార్పుపై పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు