కరోనా వైరస్ బాధితుల్లో మగాళ్లే ఎక్కువ

తాజా వైద్య పరిశోధనల ప్రకారం చైనాలోని వూహాన్ లో పుట్టిన ప్రాణాంతక కరోనా వైరస్ ఎక్కువగా మగవాళ్లకే సోకుతోంది. 140 మంది కరోనా పేషెంట్ల కేస్ రిపోర్టులను స్టడీ చేసిన

  • Published By: veegamteam ,Published On : February 11, 2020 / 03:15 PM IST
కరోనా వైరస్ బాధితుల్లో మగాళ్లే ఎక్కువ

Updated On : February 11, 2020 / 3:15 PM IST

తాజా వైద్య పరిశోధనల ప్రకారం చైనాలోని వూహాన్ లో పుట్టిన ప్రాణాంతక కరోనా వైరస్ ఎక్కువగా మగవాళ్లకే సోకుతోంది. 140 మంది కరోనా పేషెంట్ల కేస్ రిపోర్టులను స్టడీ చేసిన

తాజా వైద్య పరిశోధనల ప్రకారం చైనాలోని వూహాన్ లో పుట్టిన ప్రాణాంతక కరోనా వైరస్ ఎక్కువగా మగవాళ్లకే సోకుతోంది. 140 మంది కరోనా పేషెంట్ల కేస్ రిపోర్టులను స్టడీ చేసిన తర్వాత విస్తుపోయే విషయాలు బైటపడ్డాయి. అనారోగ్యంగా ఉన్న సీనియర్ సిటిజన్లకు కరోనా తొందరగా సంక్రమిస్తోంది. కొన్ని బయోలాజికల్ కండీషన్స్ వల్ల కొందరికి తొందరగా కరోనా వచ్చే అకాశముంది. కరోనా బాధితుల్లో మహిళల సంఖ్య ఎందుకు తక్కువుగా ఉందో వైద్య నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ విషయమై నిపుణులు రెండుగా విడిపోయారు.

50ఏళ్ల వయస్సున్న మగాళ్లకే ఎక్కువగా కరోనా:
ఇప్పటిదాకా వెయ్యి మందికి పైగా ప్రజలు కరోనాకు బలయ్యారు. 40వేల మందికి పైగా పేషెంట్లు ఐసీయూల్లో ఉన్నారు. ఇందులో ఎక్కువ మంది చైనా వాళ్లే. వీళ్లలో 54శాతం మంది మగాళ్లు. సగటు వయస్సు 56 ఏళ్లు. వూహాన్ జినియాంటన్ హాస్పటల్ లో పేషెంట్ల సగటు వయస్సు 55.5 ఏళ్లు. వీళ్లలో 32 శాతం మంది ఆడవాళ్లు. ఒక అంచనా ప్రకారం కరోనా వైరస్ బాధితుల సగటు వయస్సు 47 ఏళ్లు. వీళ్లలో 58 శాతం మంది పురుషులు. 50 ఏళ్ల వయస్సున్న మగాళ్లకే ఎక్కువగా కరోనా ఎందుకు సోకుతుంది? బహుశా కొందరికి వైరస్ ను తట్టుకొనే శక్తి లేకపోవడమేనని కొందరంటుంటే, ఈ అంచనా తప్పని మరికొందరు అంటున్నారు.

సార్స్ బాధితుల్లో ఎక్కువ మగాళ్లే:
కరోనా బాధితుల గురించిన డేటా పూర్తిగా లేదు కాబట్టి, వైద్య నిపుణులు 2002-03లో వచ్చిన సార్స్ బాధితుల డేటాను స్టడీ చేస్తున్నారు. కరోనా లాగే మార్కెట్లలో యానిమల్స్ నుంచి మనుషులకు సార్స్ వచ్చింది. కరోనాతో పోల్చితే సార్స్ జినోమ్ 80శాతం సరిపోతోంది. అంటే సార్స్ లాంటి కొత్త వైరస్. సార్స్ బాధితుల్లో ఎక్కువమంది మగాళ్లే. అందులోనూ మగ ఎలుకల నుంచే ఎక్కువగా సార్స్ వ్యాపించిందంట. 

సార్స్ మగవాళ్లకే ఎక్కువ మందికి సంక్రమించింది?
X chromosome సమీపంలోని కొన్ని జీన్స్, ఈస్ట్రోజన్ లాంటి హార్మోన్స్ వల్ల కరోనా, సార్స్ వైరస్ లు తొందరగా ఆడవాళ్ల శరీరంలో వ్యాపించడం లేదన్నది పరిశోధనల మాట. ఈ విషయంలో మగాళ్లు వీక్. Wuhan Jinyintan Hospital డాక్టర్ల మాట ప్రకారం మహిళల శరీరం వైరస్ కు లోబడే అవకాశాలు తక్కువున్నాయని అంటున్నారు. ఇంకో సంగతి. మధుమేహం, హృదయ సంబంధ రోగాలున్న మగాళ్లకు కరోనా ఎక్కువగా సంక్రమిస్తోంది. కాకపోతే Huanan Seafood Wholesale Marketలో ఎక్కువ మంది పని వాళ్లు మగాళ్లు కాబట్టి, కరోనా పేషెంట్లలో మగాళ్లు ఎక్కువగా కనిపిస్తున్నారని కొందరు నిపుణులు అంటున్నారు.