కొవిడ్-19 వ్యాక్సిన్ 99 శాతం పని చేస్తుంది : చైనా

  • Publish Date - May 30, 2020 / 10:39 AM IST

చైనీస్ సైంటిస్టులు కొవిడ్-19 వ్యాక్సిన్ కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు. డ్రాగన్ అభివృద్ధి చేసే కరోనా వ్యాక్సిన్ 99 శాతం సమర్థవంతంగా పనిచేస్తుందని స్కై న్యూస్‌కు నివేదించింది. బీజింగ్ ఆధారిత బయోటెక్ కంపెనీ సినోవాక్ ప్రస్తుతం.. కరోనా వ్యాక్సిన్ అభివృద్ధిపై రెండో దశ ట్రయల్స్ కొనసాగుతున్నాయి. ఈ ట్రయల్స్‌లో 1000కు పైగా వాలంటీర్లు పాల్గొన్నారు. యూకేలో వ్యాక్సిన్ అభివృద్ధిలో ఆఖరిదైన మూడో దశపై ముందు నుంచే ప్రాథమిక చర్చలను కంపెనీ జరుపుతోంది. Sinovac లోపనిచేసే పరిశోధకుడు Luo Baishan మాట్లాడుతూ.. వ్యాక్సిన్ త్వరలో విజయవంతం అవుతుందని ఆకాంక్షిస్తున్నట్టు ధీమా వ్యక్తం చేశారు. ‘అవును.. అవును.. 99 శాతం కచ్చితంగా కరోనా వ్యాక్సిన్ విజయవంతం అవుతుంది.

ఆ నమ్మకం మాకు బాగుంది’ అని బదులిచ్చాడు. కరోనా వైరస్ నుంచి ఇన్ఫెక్షన్లను కోతులను సంరక్షించేందుకు CoronaVac అనే వ్యాక్సిన్ డెవలప్ చేసింది. దీనికి సంబంధించి ఫలితాలను అకాడమిక్ జనరల్ సైన్స్‌లో గతనెలలోనే సిన్వోక్ పబ్లీష్ చేసింది. చైనాలో కొవిడ్-19 కేసులు అత్యల్ప సంఖ్యలో ఉండటంతో కంపెనీ అతిపెద్ద సమస్యను ఎదుర్కొంటోంది. మహమ్మారి వ్యాప్తితో వ్యాక్సిన్ టెస్టింగ్ చేయడం కష్టతరంగా మారింది. ఫలితంగా కంపెనీ స్టేజీ 3 ట్రయల్స్ చేసేందుకు ప్రయత్నిస్తోంది.

సీనియర్ డైరెక్టర్ ఆఫ్ ఇన్వెస్టర్ రిలేషన్స్ Helen Yang, senior చెప్పిన ప్రకారం.. కొన్ని యూరోపియన్ దేశాలతో మాట్లాడుతున్నామని, అదేవిధంగా యూకేతో మాట్లాడతామని సీనియర్ Helen Yang చెప్పారు. ప్రస్తుతం ఈ చర్చలు ప్రాథమిక దశలో ఉన్నాయి. పరిశోధన ఒకవైపు కొనసాగుతున్నప్పటికీ కూడా ప్రొడక్టు విషయంలో కంపెనీ గట్టిగా నొక్కి చెబుతోంది. వాయువ్య బీజింగ్, ఆరెంజ్, వైట్ పేకెట్స్ తీసుకెళ్తున్నారు. ఒకవేళ ట్రయల్స్ విజయవంతం అయితే వ్యాక్సిన్ వెంటనే రెగ్యులేటరీ అప్రూవ్ చేయాల్సి ఉంటుంది.

Read: 5 నిమిషాల్లో పెళ్లి …బ్రెజిల్ లో ట్రెండ్ అవుతున్న కొత్త పద్ధతి