Brazil Varriant : వేలల్లో యువతను బలితీసుకుంటున్న కొత్త కోవిడ్ వైరస్

ప్రపంచవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చేశాయి. కొత్త వైరస్ స్ట్రయిన్ రోజురోజుకీ విజృంభిస్తోంది. ఈ వైరస్ మహమ్మారి వేలాది మంది యువతను బలితీసుకుంటోందని బ్రెజిల్ వైద్యులు హెచ్చరించారు.

Coronavirus Brazil Varriant : ప్రపంచవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చేశాయి. కొత్త వైరస్ స్ట్రయిన్ రోజురోజుకీ విజృంభిస్తోంది. ఈ వైరస్ మహమ్మారి వేలాది మంది యువతను బలితీసుకుంటోందని బ్రెజిల్ వైద్యులు హెచ్చరించారు. కొత్త వైరస్ కేసులతో బ్రెజిల్ అతులాకుతలమైంది. గతంలో వైరస్ల కంటే ఈ కొత్త వేరియంట్ అత్యంత ప్రాణాంతకమైనదిగా ఆస్ట్రేలియాను హెచ్చరిస్తున్నారు. కొత్త వేరియంట్ దేశాన్ని ముంచెత్తింది.

ఇప్పటికే 300,000 మందికి పైగా మృతిచెందగా.. స్థలం లేక సమాధులు లేక పాత సమాధులను వెలికితీస్తున్న పరిస్థితి నెలకొంది. దేశమొత్తంలో కరోనా బాధితుల కోసం ఐసీయూ బెడ్లు ఖాళీగా లేవు. కరోనా మరణాల సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతోంది. బ్రెజిల్ వేరియంట్.. P1 అనే వైరస్.. కిరోసిన్‌ను పోలి ఉంటుంది. సాధారణ కోవిడ్-19 కంటే 150శాతం అత్యంత వేగంగా వ్యాపించగలదు.

ఈ వైరస్ స్ట్రయిన్ ఎక్కువగా 30ఏళ్ల నుంచి 40ఏళ్లు, 50ఏళ్ల మధ్యలోనే వ్యాపిస్తోంది. కేవలం ఒక నెలలో బ్రెజిల్ లో రోజువారీ మరణాల సంఖ్య భారీగా పెరిగిపోతున్నాయి. గతంలో రోజుకు 3వేల కేసులు నమోదయ్యేవి. ఈ బ్రెజిల్ వేరియంట్.. కెనడాకు కూడా వ్యాపించింది.

ట్రెండింగ్ వార్తలు