కరోనా వైరస్ గాల్లో ఉన్నా.. నేలపై ఉన్నా 9రోజులు బతికే ఉంటుంది: బీ అలర్ట్

కరోనా వైరస్.. ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న మహమ్మారి. వైరస్ సోకిందంటే వారం కాదు కదా.. రోజుల్లో ప్రాణాలు పోవడం ఖాయం. అంత పవర్‌ఫుల్. చైనాలో 700కు పైగా దీని కారణంగా చనిపోయారు. అసలు ఇది వ్యాప్తి చెందడానికి ఎంత సమయం తీసుకుంటుంది. వైరస్ నుంచి ఎంతవరకూ సేఫ్ అవగలమని చేసిన పరిశోధనలో కీలక విషయాలు వెల్లడయ్యాయి. 

వైరస్ ఉన్న వ్యక్తి.. దగ్గినా, తుమ్మినా ఆ ప్రదేశంలోనే 9రోజుల పాటు ఉంటుందట. హాస్పిటల్‌లో ఇన్ఫెక్షన్ సోకిన రోగులను పరీక్షించి ఈ విషయం కనుగొన్నారు. వారిని కాపాడటానికి వారి దగ్గర ఉన్న టెక్నిక్ ఏంటంటే.. ‘రోగులను తక్కువ ఉష్ణోగ్రత, ఎక్కువ తేమతో కూడిన గాలి’ జీవిత కాలాన్ని పెంచుతాయని జర్మనీకి చెందిన ప్రొఫెసర్ గంటెర్ కాంప్  వెల్లడించారు. 

మాలిక్యులర్ అండ్ మెడికల్ వైరాలజీ హెచ్‌ఓడీ ప్రొఫెసర్ ఈక్ స్టీన్‌మన్‌తో కలిసి 22మందిపై పరిశోధన జరిపారు. ఒకసారి గాల్లోకి విడుదలైన వైరస్ ఎంతవరకూ సజీవంగా ఉంటుందనే దానిపై పలు విషయాలు కనుగొన్నారు. కరోనా వైరస్ రావడానికి కారణాలు వేరుగా ఉన్న లక్షణాలు మాత్రం ఒకేలా ఉన్నాయి. 

వైరస్ గురించి పూర్తిగా తెలుసుకుని థెరపీ గురించి కనుగొనే ప్రక్రియలో ఫెయిల్ అయ్యారు. అన్నీ అంటు వైరస్‌లలానే చేతులు తాకడం ద్వారా, పరిసరాల్లో తిరగడం ద్వారా కరోనా వైరస్ అంటుకుంటుంది. ఉదాహరణకు ‘హాస్పిటల్స్‌లో డోర్ హ్యాండిల్స్, టేబుల్స్, బెడ్‌లు, పేషెంట్లను నేరుగా పట్టుకోవడం, వారు వాడిన మెటల్ లేదా ప్లాస్టిక్ వస్తువులు పట్టుకోవడం వల్ల వ్యాప్తి చెందుతుంది’ అని డాక్టర్ తెలిపారు. 

ఇప్పటివరకూ చేసిన టెస్టుల ఫలితంగా కరోనా వైరస్‌కు ఇథనాల్, హైడ్రోజన్ పెరాక్సైడ్, సోడియం హైపోక్లోరైట్‌లు వ్యతిరేకంగా పనిచేస్తున్నాయి. వీటిని వాడి రోగులు తిరిగిన ప్రదేశాల్లో వైరస్ లేకుండా శుభ్రం చేయడానికి ఉపయోగించవచ్చు. ఈ పరిశోధన ఫలితంగా వైరస్ ఇతరులకు సోకకుండా ఏం చేయగలమో తెలుసుకున్నట్లు రీసెర్చర్స్ తెలిపారు.