ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ మహమ్మారి విలయ తాండవం చేస్తోంది. మరణ మృదంగం వినిపిస్తోంది. రోజురోజుకి కరోనా కేసుల సంఖ్య, మరణాల సంఖ్య పెరుగుతోంది. కరోనా వైరస్
ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ మహమ్మారి విలయ తాండవం చేస్తోంది. మరణ మృదంగం వినిపిస్తోంది. రోజురోజుకి కరోనా కేసుల సంఖ్య, మరణాల సంఖ్య పెరుగుతోంది. కరోనా వైరస్ 205 దేశాలకు వ్యాపించింది. ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 11లక్షలకు చేరువలో ఉంది. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా 10లక్షల 98వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు 59వేల 140మంది కరోనాతో చనిపోయారు. ప్రపంచవ్యాప్తంగా కరోనా నుంచి 2.28 లక్షల మంది కోలుకున్నారు. వరల్డ్ వైడ్ గా నిన్న (ఏప్రిల్ 3,2020) ఒక్కరోజే 82వేల కొత్త కరోనా కేసులు నమోదవగా, 6వేల మంది మరణించారు.
* ప్రపంచవ్యాప్తంగా కరోనా విలయ తాండవం
* 205 దేశాలకు వ్యాపించిన కరోనా వైరస్
* ప్రపంచవ్యాప్తంగా 11లక్షలకు చేరువలో కరోనా బాధితుల సంఖ్య
* ప్రపంచవ్యాప్తంగా కరోనాతో ఇప్పటివరకు 59వేల 140మంది మృతి
* ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 10లక్షల 98వేలకుపైగా కేసులు
* ప్రపంచవ్యాప్తంగా నిన్న ఒక్కరోజే 82వేల కొత్త కేసులు, 6వేల మరణాలు
* ప్రపంచవ్యాప్తంగా కరోనా నుంచి కోలుకున్న 2.28 లక్షల మంది
* అమెరికాలో విజృంభిస్తున్న కరోనా వైరస్, 2.76లక్షలు దాటిన కరోనా కేసులు
* అమెరికాలో నిన్న(ఏప్రిల్ 3,2020) ఒక్కరోజే 32వేలకు పైగా కొత్త కేసులు నమోదు
* అమెరికాలో నిన్న(ఏప్రిల్ 3,2020) ఒక్కరోజే 1,320మంది మృతి
* అమెరికాలో ఏడున్నర వేలకు చేరిన మరణాలు, ఇప్పటివరకు 7వేల 391మంది మృతి
* అమెరికా, స్పెయిన్, బ్రిటన్ లో పెరిగిపోతున్న కరోనా మరణాలు
* న్యూయార్క్ లో కరోనా మృతుల ఖననానికి ఇబ్బందులు, స్థలాల కొరత
* ఒక్క న్యూయార్క్ లోనే దాదాపు లక్ష కేసులు, 3వేల మరణాలు
* న్యూజెర్సీ, కనెక్టికట్, న్యూయార్క్ లలో చైనాను మించిన కేసులు
* ఈ మూడు రాష్ట్రాల్లో లక్షా 20వేల కరోనా కేసులు
* అమెరికాలో 2 వారాల్లో ఉద్యోగాలు పోగొట్టుకున్న కోటి మంది
* అమెరికాలో 7వేల 391 మంది, ఇటలీలో 14వేల 681 మంది, స్పెయిన్ లో 11వేల 198 మంది మరణం
* ఫ్రాన్స్ లో 6వేల 507, చైనాలో 3వేల 322, ఇరాన్ లో 3వేల 294, యూకేలో 3వేల 605, నెదర్లాండ్స్ లో 1,487, జర్మనీలో 1,275, బెల్జియంలో 1,143, స్విట్జర్లాండ్ లో 591 కరోనా మరణాలు
* న్యూయార్క్ లో వైద్య రంగం సంక్షోభం, నిత్యావసరాల కొరత
* ఇటలీ, స్పెయిన్, జర్మనీ, ఫ్రాన్స్, ఇరాన్, యూకేలో వేలల్లో కేసులు
* అమెరికా తర్వాత ఇటలీలోనే అత్యధికంగా కరోనా మరణాలు
* ఇటలీలో లక్షా 20వేలు, స్పెయిన్ లో లక్షా 19వేలు, జర్మనీలో 91వేలు, ఫ్రాన్స్ లో 64వేలు, ఇరాన్ లో 53వేల కరోనా కేసులు
* టర్కీ, బెల్జియం, స్విట్జర్లాండ్, కెనడాల్లోనూ వేలల్లో కేసులు
* భారత్ గత ఆరు రోజుల్లో మూడు రెట్లు పెరిగిన కరోనా కేసులు
* దేశంలో ఇప్పటివరకు 3వేల 108 కేసులు
* శుక్రవారం(ఏప్రిల్ 3,2020) ఒక్కరోజే 508 కొత్త కేసులు, 12 మరణాలు
* ఇప్పటివరకు 90మంది కరోనాతో మృతి
* కరోనా నుంచి కోలుకున్న 229 మంది
* మహారాష్ట్రలో అత్యధికంగా 490 కేసులు
* తమిళనాడులో 411 మందికి వైరస్
* రెండు రోజులుగా దేశంలో నమోదైన కొవిడ్ పేషెంట్లలో 647మంది ఢిల్లీ మర్కజ్ సమావేశాలకు హాజరైన వాళ్లే.
Also Read | తల్లి అంత్యక్రియలకు తిరిగి వచ్చాడు… అందరికి కరోనా అంటించాడు!