చైనాదేశం తర్వాత ఎక్కువ మంది కరోనా బాధితులుంది ఈ క్రూయిజ్ షిప్ లోనే!

చైనాను భయపెడుతున్న దాని కంటే క్రూయిజ్ షిప్‌లో ఇరుక్కుపోయిన ప్రయాణికుల్లోనే కరోనా భయం ఎక్కువగా కనిపిస్తోంది. జపాన్‌లో ప్రస్తుతం నిర్బంధంలో ఉన్న క్రూయిజ్ లైనర్ డైమండ్ ప్రిన్సెస్‌లోని 3వేల 700 ప్రయాణీకులతో పాటు  సిబ్బంది ఉన్నారు. వీరిలో 138 భారతీయులు. 136 మంది సిబ్బంది కాగా ఆరుగురు సాధారణ ప్రయాణికులు ఉన్నారు. వైద్యుల నిర్బంధంలో కాలం గడుపుతున్న వారిలో రోజురోజుకూ కరోనా మృతుల సంఖ్య పెరుగుతూనే ఉంది. 

బుధవారం 39 మంది వైరస్‌కు సోకినట్లుగా జపాన్ ఆరోగ్య శాఖ తెలిపింది. మొత్తం ఈ షిప్‌లో కరోనా బాధితుల సంఖ్య 175కు చేరింది. ప్రయాణికులు తప్పనిసరిగా మాస్క్‌లు ధరించి ఉండాలని అధికారులు చెబుతున్నారు. కొత్తగా కరోనా సోకిన వారిలో 10మంది జపాన్ కు చెందిన వారుండగా,  ఇద్దరు భారతీయులు, అమెరికా, చైనాలాంటి దేశాలు లాంటి 11దేశాల వారున్నారు.

నలుగురు పేషెంట్లు సీరియస్ కండీషన్ లో ఉన్నారని, ఐసీయూ లేదా వెంటిలేటర్ పై వారి చికిత్స జరుగుతున్నట్లు జపాన్ చెప్పింది. డేవిడ్ ఏబెల్  అనే ఓ పాసింజర్ రాత్రి సమయంలో తనను షిప్ నుంచి బయటకు పంపాలంటూ గంటల కొద్దీ ఏడుస్తూనే ఉన్నట్లు తోటి ప్రయాణికులు అతని ఆవేదనను బయటపెట్టారు. ‘రోజు మొదలవుతుందంటే సాయంత్రం వరకూ వైరస్ సోకకుండా ఉండటానికి చాలెంజింగ్ గా తీసుకుంటున్నాం. అయినప్పటికీ వైరస్ పెరుగుతూనే ఉంది. వైరస్ సోకిన వారు డీలా పడిపోతుంటే నమ్మకం సన్నగిల్లిపోతుంది’ అని ఓ ప్రయాణికుడు తెలిపాడు.