స్పెయిన్ లో కట్టలు తెంచుకున్న కరోనా….24గంటల్లో 2వేల మందికి సోకిన వైరస్

ఆదివారం(మార్చి-15,2020)నుంచి దేశవ్యాప్త లాక్ డౌన్ తో స్పెయిన్ లో రోడ్లు,పబ్లిక్ స్పేస్ లు జనాలు లేక నిర్మానుష్యంగా మారాయి. కరోనాను కట్టడి చేసేందుకు స్పానిష్ ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకుంటోంది. శనివారం స్పెయిన్ ప్రభుత్వం రెండువారాల ఎమర్జెన్సీని డిక్లేర్ చేసిన విషయం తెలిసిందే.

ఫుడ్,మెడిసిన్ ల కోసం షాపింగ్ వంటి కనీస అవసరాలకు,పని నుంచి ఇంటికి వెళ్లడం.రావడం తప్పితే ప్రజలందరూ ఇళ్లకే పరిమితం కావాలని స్పెయిన్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. రవాణా సదుపాయాన్ని కూడా తగ్గించింది. రెస్టారెంట్లు,హోటల్స్ కూడా మూసివేయాలని ఆదేశాలు జారీ చేసింది. 

ఆదివారం(మార్చి-15,2020)స్పెయిన్ లో కరోనా పాజిటివ్ కేసులు సంఖ్య గణనీయంగా పెరిగింది. గడిచిన 24గంట్లోనే 2వేలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని స్పెయిన్ ప్రకటించింది. దీంతో స్పెయిన్ ఇప్పటివరకు కరోనా వైరస్(COVID-19)సోకిన వారి సంఖ్య 7వేల 400కి చేరుకోగా,288మరణాలు నమోదయ్యాయి.

చాలా మందికి కరోనావైరస్…జ్వరం మరియు దగ్గు వంటి తేలికపాటి లేదా మితమైన లక్షణాలను మాత్రమే కలిగిస్తుంది. కొంతమందికి, ముఖ్యంగా వృద్ధులకు మరియు ఇప్పటికే ఉన్న ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నవారికి, ఇది న్యుమోనియాతో సహా మరింత తీవ్రమైన అనారోగ్యానికి కారణమవుతుంది.

ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO)తెలిపిన ప్రకారం….తేలికపాటి అనారోగ్యంతో బాధపడుతున్నవారు సుమారు రెండు వారాల్లో కోలుకుంటారు. అయితే తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్న వారు కోలుకోవడానికి మూడు నుండి ఆరు వారాలు పట్టే అవకాశముంది. కొన్ని సమయాల్లో ప్రాణాలు కూడా కోల్పోతుంటారు.

Also Read | టెక్నాలజీ మాయ : డీప్ ఫేక్ ఫోర్న్ వీడియోలు