ప్రపంచ దేశాలతో పాటు భారత్ లోనూ కొవిడ్ నివారణకు ప్రయత్నాలు ముమ్మరంగానే జరుగుతున్నాయి. రోగనిరోధక శక్తిని పెంచేందుకు plasma therapyని అమల్లోకి తీసుకురావాలని భారత్ రెడీ అవుతుంది. అమెరికన్ జర్నల్, నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ సైతం వీటికి ఆమోద ముద్ర వేశాయి. ఇండియాన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్(ఐసీఎమ్మార్) సైతం వీటిపై ప్రయత్నాలు మొదలుపెట్టింది.
ట్రయల్స్ నిర్వహించి.. ఒకసారి రెడీ అయ్యాక అపెక్స్ డ్రగ్ రెగ్యూలేటరీకి పంపిస్తారు. అక్కడ సక్సెస్ అయితే ఇక ఆమోదం లభించినట్లే. ‘మరి కొద్ది రోజుల్లో డ్రాఫ్ట్ సిద్ధం కానుంది. ఇది కొత్త మందు కావడంతో క్లినికల్ ట్రయల్‌కు పంపాలి. ప్రతి మందుకు ఇది తప్పనిసరి. అని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎపిడెమియాలజీ డైరక్టర్ డాక్టర్ మనోజ్ అన్నారు.
ఈ పద్ధతితో డాక్టర్లకు కొవిడ్ 19పై పోరాడేందుకు మరిన్ని అవకాశాలు ఉంటాయి. చైనాలో ఈ టెక్నిక్ వడి విషమ పరిస్థితుల్లో ఉన్న 10మంది పేషెంట్లను కాపాడగలిగారు. ఒక్క సింగిల్ డోస్ తోనే ఇది సాధించగలగడం విశేషం.
ఇతర దేశాల్లో వెంటిలేటర్ సపోర్ట్ తో ఉండేవారికే ఇది సూచిస్తారు. అలా అని అందరికీ ఇది పనికిరాదు. కొందరు పేషెంట్లకే మాత్రమే. ట్రయల్స్ లోనూ ఎక్కువ మంది పేషెంట్లను వాడకుండా కొద్ది మందిని మాత్రమే పరీక్షిస్తాం. DCGI అప్రూవ్ చేయకుండా దేశంలో ఎక్కడా ఈ టెక్నిక్ వాడేది లేదు.
అసలు ఈ థెరఫీ ఎలా చేస్తారంటే.. జబ్బు నుంచి కోలుకున్న వ్యక్తి నుంచి యాంటీ బాడీస్.. తీసి కొవిడ్ బాధితుల శరీరంలోకి ఎక్కిస్తారు. దాంతో రోగి కోలుకునేందుకు ఎక్స్ ట్రా ఎనర్జీ ఇచ్చినట్లు అవుతుంది. వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. ఇలా ప్లాస్మా థెరఫీ ఇచ్చిన తర్వాత జ్వరం, దగ్గు, గొంతు మంట, జలుబు ఏడు రోజుల్లో తగ్గిపోతాయి. ఆ తర్వాత మళ్లీ RT-PCR టెస్టు చేసి రిపోర్టులు నార్మల్ గా వస్తేనే వ్యాధి తగ్గినట్లుగా నిర్ధారిస్తారు.
Also Read | ఏపీలో కరోనా : మాస్క్ లేదా..అయితే..రూ. 1000 కట్టాల్సిందే