Corona Virus: కరోనావైరస్ వస్తుందని ఇతనికి 8ఏళ్ల క్రితమే తెలుసా!!

ప్రపంచాన్ని కకావికలం చేస్తున్న కరోనా వైరస్‌ ఇండియాలో మాత్రం అంతకు రెట్టింపు విధ్వంసం సృష్టిస్తోంది. ఏడాదిన్నర క్రితం మొదలైన కరోనా ప్రభావం ఇప్పటికీ వణుకు పుట్టిస్తోంది. హాస్పిటల్స్ బెడ్స్ నిండిపోయి అంబులెన్సులు, స్ట్రెచర్లపైనే ప్రాణాలు కోల్పోతున్నారు.

Corona Virus: కరోనావైరస్ వస్తుందని ఇతనికి 8ఏళ్ల క్రితమే తెలుసా!!

Corona Virus

Updated On : May 10, 2021 / 4:45 PM IST

Corona Virus: ప్రపంచాన్ని కకావికలం చేస్తున్న కరోనా వైరస్‌ ఇండియాలో మాత్రం అంతకు రెట్టింపు విధ్వంసం సృష్టిస్తోంది. ఏడాదిన్నర క్రితం మొదలైన కరోనా ప్రభావం ఇప్పటికీ వణుకు పుట్టిస్తోంది. హాస్పిటల్స్ బెడ్స్ నిండిపోయి అంబులెన్సులు, స్ట్రెచర్లపైనే ప్రాణాలు కోల్పోతున్నారు. సరైన సమయానికి వైరస్ కట్టడి అయ్యేలా వ్యాక్సిన్ రెడీ చేయలేకపోయారు.

మహమ్మారితో ఈ భయంకర ప్రయాణం ఇంకెన్నాళ్లో చెప్పలేకపోతున్నారు. ఇలాంటి ఉపద్రవాలు వచ్చినప్పుడు.. వీటి గురించి ముందే మనకు తెలిస్తే బాగుండేది కదా అనిపిస్తుంది. ఇది అసాధ్యమని మనకు తెలిసినా.. ఒక వ్యక్తి మాత్రం ముందుగానే ఊహించాడు..

ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న కరోనా గురించి ఎనిమిదేళ్ల క్రితమే ఊహించగలిగాడు. ప్రస్తుతం ఆ ట్వీట్‌ తెగ వైరలవుతోంది. ఆ వివరాలు.. ట్విట్టర్‌ యూజర్‌ మార్కో అక్రోట్‌ అనే వ్యక్తి జూన్‌ 3, 2013న కరోనా వైరస్‌ వస్తుంది అంటూ ట్వీట్‌ చేశాడు. ‘కరోనా వైరస్‌.. ఇట్స్‌ కమింగ్‌’ అంటూ చేసిన ట్వీట్‌ ప్రస్తుతం మరోసారి వైరల్‌ అవుతోంది.

దీనిపై నెటిజనులు మిశ్రమ స్పందన వ్యక్తం చేస్తున్నారు. ‘ఎనిమిదేళ్ల క్రితమే నువ్వు కరోనాను ఎలా పసిగట్టగలిగావ్‌’.. ‘నువ్వు టైం ట్రావేలర్‌వా’ అని ఆశ్చర్యం వ్యక్తం చేస్తుండగా.. మరి కొందరు మాత్రం ట్విట్టర్‌ను హ్యాక్‌ చేసి డేట్‌ మార్చి ఉండొచ్చని ఆరోపిస్తున్నారు. దీనిపై వస్తోన్న మీమ్స్‌ జనాలను కడుపుబ్బ నవ్విస్తున్నాయి.