రూ. 480ల స్టెరాయిడ్… కరోనా మరణాల సంఖ్యను తగ్గిస్తోంది… బ్రిటన్ సైంటిస్ట్‌ల భరోసా!

  • Publish Date - June 16, 2020 / 02:27 PM IST

కరోనా మరణాల సంఖ్యను తగ్గించగల చౌకైన స్టెరాయిడ్ ను యూకేలోని సైంటిస్టులు కనుగొన్నారు. కొవిడ్-19 రోగుల చికిత్సకు కేవలం రూ.480లకే అందుబాటులో ఉంది. dexamethasone అనే ఈ డ్రగ్.. సాధారణ స్టెరాయిడ్ డ్రగ్ గా పరిశోధకులు వర్ణించారు. ఈ మందుతో వెంటిలేటర్ పై ఉన్న మూడో వంతు కరోనా రోగులతో పాటు ఆక్సీజన్ అవసరమైన 5వ వంతు రోగుల్లో మరణాల సంఖ్యను తగ్గించినట్టు వెల్లడించారు. ఇంగ్లాండ్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ ప్రొఫెసర్ Chris Whitty మాట్లాడుతూ… కరోనా చికిత్సలో అత్యంత ముఖ్యమైన ట్రయల్ ఫలితమని అన్నారు.

కరోనా వ్యాప్తి ప్రారంభం నుంచి ప్రాణాంతకంగా మారిన రోగులకు ఈ dexamethasone మెడిసిన్ వాడటం ద్వారా 4వేల నుంచి 5 వేల మంది ప్రాణాలు నిలబడేవని చెప్పారు. Oxford University ప్రొఫెసర్ Martin Landray ఈ ట్రయల్ కు నేతృత్వం వహించారు. వెంటిలేటర్ మీద ఉన్నవారు లేదా ఆక్సిజన్ అవసరమైన కరోనా పేషెంట్లకు ఈ dexamethasone స్టెరాయిడ్ మెడిసిన్ ఇచ్చినట్టయితే తక్కువ ఖర్చుతోనే వారి ప్రాణాలను కాపాడవచ్చునని స్పష్టం చేశారు. దాదాపుగా 60ఏళ్లుగా ఈ మెడిసిన్ అందుబాటులో ఉందన్నారు. 

NHSలో చికిత్స పూర్తి కోర్సు కోసం అయ్యే ఖర్చు కేవలం 5 పౌండ్లు (రూ.480).. గణనీయంగా తక్కువనే చెప్పాలి. ప్రపంచంలోని ఇతర ప్రాంతాలలో… అదే భారతదేశంలో అయితే బహుశా ఒక డాలర్ కన్నా తక్కువ ఖర్చు అవుతుంది. కో-లీడ్ ఇన్వెస్టిగేటర్, Peter Horb చెప్పిన ప్రకారం.. dexamethasone అనే మందు.. మంటను తగ్గించడానికి ఇతర వ్యాధులలో ఎక్కువగా ఉపయోగించే ఒక సాధారణ స్టెరాయిడ్ అని పేర్కొన్నారు. కొవిడ్ మరణాలను తగ్గించే మందుల్లో ఇప్పటివరకు చూపించిన ఏకైక ఔషధం ఇదొక్కటే గణనీయంగా తగ్గిస్తుందని అంటున్నారు.

డెక్సామెథాసోన్ అధ్యయనంలో.. 2,104 మంది రోగులు 6మిల్లీ గ్రాముల డెక్సామెథాసోన్‌ను రోజుకు ఒకసారి నోటి ద్వారా లేదా 10 రోజుల పాటు ఇంట్రావీనస్ ఇంజెక్షన్ ద్వారా ఇవ్వడం జరిగింది. వారి ఫలితాలను 4,321 మంది రోగుల నియంత్రణ గ్రూపుతో పోల్చారు. 8 రోజుల వ్యవధిలో.. వెంటిలేషన్ అవసరమయ్యే రోగులలో మరణాల రేటు 41శాతం, ఆక్సిజన్ అవసరమైన వారికి ఇది 25శాతంగా నమోదైనట్టు గుర్తించారు. ఆక్సీజన్ అవసరం లేని వారిలో ఈ సంఖ్య 13శాతంగా ఉన్నట్టు తేల్చారు.

అధ్యయనంలో… వెంటిలేటెడ్ రోగులలో, ఆక్సిజన్ అవసరమయ్యే వ్యక్తులలో మరణాలను తగ్గించినట్లు వెల్లడించారు. ఆక్సిజన్ సహాయం అవసరం లేని రోగులలో మరణాలలో ఎలాంటి మార్పు లేదన్నారు. UKలో కరోనావైరస్ కోసం పాజిటివ్ పరీక్షించిన తరువాత ఆస్పత్రులు, కేర్ హోమ్స్, విస్తృత సమాజంలో 41,700 మందికి పైగా మరణించినట్లు ఆరోగ్య శాఖ వెల్లడించింది.  

ట్రెండింగ్ వార్తలు