ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ మహమ్మారి ప్రభావం చూపిస్తోంది. రోజురోజుకి పాజిటివ్ కేసుల సంఖ్యతో పాటు మరణాల సంఖ్యా పెరుగుతోంది. వ్యాక్సిన్ లేని ప్రాణాంతకమైన కరోనా
ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ మహమ్మారి ప్రభావం చూపిస్తోంది. రోజురోజుకి పాజిటివ్ కేసుల సంఖ్యతో పాటు మరణాల సంఖ్యా పెరుగుతోంది. వ్యాక్సిన్ లేని ప్రాణాంతకమైన కరోనా వైరస్ 185 దేశాలకు వ్యాపించింది. ప్రపంచవ్యాప్తంగా 2లక్షల 75వేల కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 7వేల 479 మంది పరిస్థితి విషమంగా ఉంది. 11వేల 385మంది కరోనాతో చనిపోయారు. 90వేల 943 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇటలీలో కరోనా తీవ్రత అధికంగా ఉంది.
కరోనా మరణాల్లో చైనాను దాటిపోయింది ఇటలీ. ఇటలీలో ఒక్క రోజులోనే 627 కరోనా మరణాలు నమోదయ్యాయి. ఇటలీలో కరోనా మరణాల సంఖ్య 4వేల 32కి చేరింది. చైనాలో 3వేల 248 మంది చనిపోయారు. స్పెయిన్, ఇరాన్ లోనూ కరోనా మృతుల సంఖ్య పెరుగుతోంది. స్పెయిన్ లో 1,093 మంది, ఇరాన్ లో 1433 మంది, ఫ్రాన్స్ లో 372మంది చనిపోయారు. అమెరికాలో కరోనా మృతుల సంఖ్య 218కి చేరింది. కరోనా వైరస్ వెలుగు చూసిన చైనాలో మాత్రం పరిస్థితి అదుపులోకి వచ్చింది. ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదు. కరోనా మృతుల సంఖ్య 11వేలకు దాటడం ప్రపంచ దేశాలను మరింత కలవరపెడుతోంది.
See Also | మీకు తెలుసా : కరోనాపై చైనా విజయం..ఎలా సాధ్యమైంది
భారత్ లో 250 కేసులు, నలుగురు మృతి:
మన దేశంలోనూ కరోనా క్రమంగా పంజా విసురుతోంది. కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 250కు చేరింది. శుక్రవారం(మార్చి 20,2020) ఒక్క రోజే దేశవ్యాప్తంగా 50 కొత్త కేసులు నమోదయ్యాయి. కేంద్రం ఆరోగ్య మంత్రిత్వ శాఖ శుక్రవారం (మార్చి 20,2020) ఈ విషయాన్ని వెల్లడించింది. ఈ జాబితాలో 32 మంది విదేశీయులు సహా మృతి చెందిన నలుగురు కూడా ఉన్నట్టు వివరించింది. జైపూర్‌లో మృతి చెందిన ఇటలీ వ్యక్తిని ఈ జాబితాలో చేర్చలేదని ఆరోగ్య మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ లవ్ అగర్వాల్ తెలిపారు. అటు బీజేపీ ఎంపీ దుష్యంత్ సింగ్ వ్యవహారం పార్లమెంట్ సభ్యులను కలవరానికి గురిచేస్తోంది. కరోనా బారినపడ్డ బాలీవుడ్ సింగర్ కనికా కపూర్‌తో పాటు ఇటీవల ఆయన ఓ పార్టీలో పాల్గొనడమే ఇందుకు కారణం. దీంతో దుష్యంత్ సింగ్‌తో పాటు ఆయన తల్లి, రాజస్థాన్ మాజీ సీఎం వసుంధర రాజే ఐసోలేషన్‌లో ఉన్నారు.
మహారాష్ట్రలో అత్యధికంగా 52మంది మృతి:
మహారాష్ట్ర, కేరళలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. దేశంలోనే అత్యధికంగా మహారాష్ట్రంలో 52 పాజిటివ్ కేసులో నమోదయ్యాయి. దీంతో వైరస్ వ్యాప్తిని నిరోధించేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం మరిన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. నాగ్‌పూర్, ముంబై, పుణే నగరాలను మూసివేసింది. ప్రజలు ఇళ్లలోంచి బయటకు రావొద్దని సూచించింది. కరోనా భయంతో దేశ ఆర్థిక రాజధాని ముంబైలో ఇప్పటికే రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి. ఇటు తెలంగాణలో మొత్తం కేసుల సంఖ్య 19కి, ఏపీలో 3కి చేరుకుంది.
భారత్ లో కరోనా కేసులు:
మహారాష్ట్ర 52
కేరళ 37
యూపీ 23
తెలంగాణ 19
ఢిల్లీ 17
రాజస్తాన్ 17
హర్యానా 17
కర్నాటక 15
లడఖ్ 10
గుజరాత్ 5
ఏపీ 3