151 దేశాలకు పాకిన కరోనా : ప్రపంచవ్యాప్తంగా 5,821 మృతి..ఇటలీలో ఒక్కరోజే 3497 కేసులు

కరోనా వైరస్ చాపకింద నీరులా ప్రపంచ దేశాలకు విస్తరిస్తోంది. 151 దేశాలకు వైరస్ పాకింది. ప్రపంచ వ్యాప్తంగా మృతుల సంఖ్య 5,821కి చేరింది.

  • Publish Date - March 15, 2020 / 02:13 AM IST

కరోనా వైరస్ చాపకింద నీరులా ప్రపంచ దేశాలకు విస్తరిస్తోంది. 151 దేశాలకు వైరస్ పాకింది. ప్రపంచ వ్యాప్తంగా మృతుల సంఖ్య 5,821కి చేరింది.

కరోనా వైరస్ చాపకింద నీరులా ప్రపంచ దేశాలకు విస్తరిస్తోంది. 151 దేశాలకు వైరస్ పాకింది. ప్రపంచ వ్యాప్తంగా మృతుల సంఖ్య 5,821కి చేరింది. లక్షా 56 వేల 433 మంది బాధితులు ఉన్నారు. 5 వేల 909 మందికి సీరియస్ అయింది. నాలుగు రాష్ట్రాలు మినహా అమెరికా అంతటా వైరస్ వ్యాపించింది. అమెరికాలో ఆరోగ్య అత్యయిక పరిస్థితి ప్రకటించారు. కరోనా వ్యాప్తి నివారణకు ప్రపంచ దేశాల ప్రయత్నాలు చేస్తున్నాయి. కరోనాపై కఠిన నిర్ణయాల దిశగా దేశాలు అడుగులు వేస్తున్నాయి. ఈ రోజు సార్క్ దేశాధినేతల వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. 

కరోనాపై పోరుకు నేతలు ఉమ్మడి వ్యూహం ఖరారు చేయనున్నారు. చైనా నుంచి ఇతర దేశాలకు వెళ్లినవారి నుంచే కొత్త కేసులు నమోదు అవుతున్నాయి. ఇటలీలో నిన్న ఒక్కరోజే 3497 కేసులు నమోదు కాగా, 175 మంది మృతి చెందారు. ఇరాన్ లో నిన్న 1365 కేసులు నమోదు కాగా 97 మంది చెందారు. స్పెయిన్ లో 1159 కేసులు నమోదు, 62 మంది మృతి చెందారు. 

భారత్ లో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు 97కు చేరాయి. కరోనా ఇద్దరు మృతి చెందారు. కరోనాను జాతీయ విపత్తుగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. కరోనా నియంత్రణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు చేపట్టాయి. పలు రాష్ట్రాల్లో ఇప్పటికే ఈనెల 31 వరకు విద్యాసంస్థలు బంద్ చేశారు. 

థియేటర్లు, పబ్ లు, మాల్స్, స్విమ్మింగ్ పూల్స్ మూసివేశారు. పార్లమెంట్ సముదాయంలోకి సందర్శకులకు నో ఎంట్రీగా ప్రకటించారు. అంతర్జాతీయ సరిహద్దుల దగ్గర ఆంక్షలు విధించారు. భూటాన్ సరిహద్దును పశ్చిమబెంగాల్ మూసివేసింది.