డేంజర్ బెల్స్.. అమెరికా మిలటరీకి కరోనా వైరస్ ముప్పు.. తొలి కేసు నమోదు

చైనాలో పుట్టి ప్రపంచాన్ని వణికిస్తున్న మహమ్మారి కొవిడ్-19(కరోనా వైరస్-corona virus) అంతకంతకూ విజృంభిస్తోంది. కరోనా వేగంగా విస్తరిస్తోంది. ఇప్పటికే వేలాది మంది

  • Publish Date - February 26, 2020 / 11:58 PM IST

చైనాలో పుట్టి ప్రపంచాన్ని వణికిస్తున్న మహమ్మారి కొవిడ్-19(కరోనా వైరస్-corona virus) అంతకంతకూ విజృంభిస్తోంది. కరోనా వేగంగా విస్తరిస్తోంది. ఇప్పటికే వేలాది మంది

చైనాలో పుట్టి ప్రపంచాన్ని వణికిస్తున్న మహమ్మారి కొవిడ్-19(కరోనా వైరస్-corona virus) అంతకంతకూ విజృంభిస్తోంది. కరోనా వేగంగా విస్తరిస్తోంది. ఇప్పటికే వేలాది మంది ప్రాణాలు పొట్టన పెట్టుకుంది. దాదాపు 80వేల మంది వైరస్ బారిన పడ్డారు. తాజాగా అమెరికా మిలటరీ(u.s. military) దళాలకు కరోనా ముప్పు పొంచి ఉంది. అమెరికా ఆర్మీకి చెందిన ఓ సైనికుడికి(u.s. soldier) కరోనా సోకింది. దక్షిణ కొరియాలో(south korea) విధులు నిర్వహిస్తున్న అమెరికన్ సోల్జర్ కరోనాతో బాధపడుతున్నాడు. అమెరికా మిలటరీలో తొలి కరోనా కేసు ఇదే. అమెరికా మిలటరీలో తొలి కరోనా కేసు వెలుగు చూడటం కలకలం రేపింది.

ఆందోళనలో అమెరికా మిలటరీ అధికారులు:
దక్షిణ కొరియాలోని క్యాంప్ కరోల్ లో(camp carroll, daegu) విధులు నిర్వహిస్తున్న తమ సైనికుడికి కరోనా సోకింది అనే విషయాన్ని అమెరికా మిలటరీ అధికారులు ధృవీకరించారు. అతడికి కరోనా వైరస్ సోకింది అని తెలియగానే.. క్వారంటైన్ లో ఉంచి చికిత్స అందిస్తున్నారు. అయితే క్యాంప్ వాకర్(camp walker), క్యాంప్ కరోల్(camp carroll).. రెండు మిలటరీ బేసులకు బాధితుడు వెళ్లి వచ్చాడు. దీంతో ఆయా బేసుల్లో ఒక్కసారిగా కలకలం రేగింది. ఇంకా ఎవరికైనా కరోనా సోకిందా అనే అనుమానాలు అధికారులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఆ రెండు బేసుల్లో ఉన్న అందరికి… అధికారులు టెస్టులు చేస్తున్నారు. ఎవరికైనా కరోనా ఉందేమో అని చెక్ చేస్తున్నారు.

అమెరికా ఆర్మీకి ఎదురుదెబ్బ:
ముందుగా సౌత్ కొరియాలో అమెరికా సైనికుడి భార్యకు కరోనా వైరస్ సోకింది. ఆమె ద్వారా ఆ సైనికుడికి కూడా వైరస్ సోకి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. దీనిపై అమెరికా ఆర్మీ అధికారులు స్పందించారు. ఇది మాకు పెద్ద ఎదురు దెబ్బ అని అన్నారు. అయినా భయపడేది లేదని, పోరాటం చేస్తామని చెప్పారు. దీనిపై పోరాటం చేసే సత్తా మనకుందని దళాలకు ధైర్యం నూరిపోశారు. దక్షిణ కొరియాలో అమెరికా మిలటరీకి చెందిన 28వేల 500 మంది సైనికులు విధుల్లో ఉన్నారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా చూడటమే వీరి విధి. 

దక్షిణ కొరియాలో కరోనా కల్లోలం:
దక్షిణ కొరియాలో కరోనా వైరస్ ప్రభావం తీవ్రంగా ఉంది. చైనా తర్వాత ఆ స్థాయిలో కరోనా విజృంభించింది ఇక్కడే. దక్షిణ కొరియా మిలటరీలో పని చేసే 20మందికి కరోనా సోకినట్టు నిర్ధారణ అయ్యింది. కరోనా అనుమానాలతో 10వేల మంది సైనికులను క్వారంటైన్ లో ఉంచారు. దక్షిణ కొరియాలో ఒక బుధవారం(ఫిబ్రవరి 26,2020) రోజే 300 కరోనా కేసులు వెలుగు చూడటం కరోనా తీవ్రతకు అద్దం పడుతుంది. ఆ దేశంలో కరోనా బారిన పడ్డ వారి సంఖ్య 1200కు పెరిగింది. ఇప్పటికే 12మంది చనిపోయారు. 

See Also>>కరోనాపై తప్పుడు యాడ్ ఇస్తే ఖతమే.. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ కొరడా..!

చైనాలో తగ్గినా కొరియాలో రెచ్చిపోతోంది: 
రానున్న రోజుల్లో దక్షిణ కొరియాలో కరోనా బారిన పడ్డ వారి కేసులు, మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అంతా భయపడుతున్నారు. కొరియాలో 2లక్షల 10వేల మందికి టెస్టులు నిర్వహిస్తున్నారు. దీంతో మరిన్ని కేసులు వెలుగులోకి వస్తాయని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కరోనా పుట్టింది చైనాలోని వూహాన్(wuhan) నగరంలో. ప్రస్తుతం చైనాలో కరోనా ప్రభావం కాస్త తగ్గింది. చైనాలో కరోనా కేసులు, మృతుల సంఖ్య తగ్గు ముఖం పట్టింది. అయితే ప్రపంచంలోని ఇతర దేశాల్లో మాత్రం కరోనా ప్రభావం తీవ్రంగానే ఉండటం ఆందోళనకు గురి చేస్తోంది. సౌత్ కొరియా, ఇరాన్, ఇటలీ వంటి దేశాల్లో కరోనా వేగంగా విస్తరిస్తోంది. 

ఇటలీని వణికిస్తున్న కరోనా:
ఇటలీలో కరోనా ఎఫెక్ట్ తీవ్రంగా ఉంది. ఇటలీలో 357మంది కరోనా వైరస్ బారిన పడ్డారు. కరోనా కారణంగా ఇప్పటికే 11మంది చనిపోయారు. ఇక అల్జీరియా, క్రొయేషియా, మెయిన్ ల్యాండ్ స్పెయిన్, స్విట్జర్లాండ్ లాంటి దేశాల్లో తొలి కరోనా కేసులు నమోదు కావడం.. ఆయా దేశాల ప్రజలను భయాందోళనకు గురి చేస్తోంది.